Praised
-
రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు. విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలిసిన ధైర్యవంతమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అలాంటి ధైర్యవంతులైన, నిజాయితీ కలిగిన నేతలంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. వీరిలో ఎవరూ ధైర్యవంతులని, ఎవరు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీరు భావిస్తున్నట్లు అడగ్గా.. ముగ్గురూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులేనని అన్నారు. అయితే గతంలో రాహుల్‌పై వచ్చిన విమర్శలను ఆయన ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని తెలిపారు.చదవండి: మోదీని కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ‘రాహుల్‌గాంధీ తీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. చాలా కష్టపడి తన పనుల ద్వారా విమర్శలను తిప్పికొట్టాడు. మళ్లీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని సైఫ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాను రాజకీయ నాయకుడిని కాదని, భవిష్యత్తులోనూరాజకీయాల్లో చేరాలనుకోవడం లేదని పైఫ్ తెలిపారు. అలాగే ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేననని పేర్కొన్నారు.అయితే తనకు ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాలు ఉంటే కచ్చితంగా వాటిని అందరితో పంచుకుంటానని చెప్పారు. అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అది ఇంకా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు -
భారత్ సాయంతోనే సంక్షోభం నుంచి గట్టెక్కాం: శ్రీలంక
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిన శ్రీలంక తాజాగా భారత్‌ను ప్రశంసించింది. భారత్- శ్రీలంకల స్నేహపూర్వక సంబంధాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. తమ దేశం రెండేళ్ల పాటు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిందని, భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతోనే ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు.భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ ఇరు దేశాలూ పర్యావరణ అనుకూల ఇంధనరంగంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. ఇటీవల తాను ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ప్రధాని మోదీతో చర్చించానన్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు విక్రమసింఘే పేర్కొన్నారు. తమ దేశంలో సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందని, ఇది అంతర్-ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, దీనిని జూలైలో ప్రారంభించాలనుకుంటున్నామనారు. అలాగే శ్రీలంక-భారత్‌ల మధ్య ల్యాండ్ కనెక్టివిటీని నెలకొల్పే ప్రాజెక్టుపై కూడా తాము దృష్టి సారించామని తెలిపారు. -
AP: వావ్.. వాట్ ఏ గ్రేట్ మెనూ.. జపాన్ వాసుల కితాబు
యాదమరి(చిత్తూరు జిల్లా): వాట్ ఏ గ్రేట్ మెనూ.. యువర్ సీఎం కేరింగ్ ఈజ్ సూపర్ ఆన్ మిడ్ డే మీల్స్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై జపాన్ వాసులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. పాఠశాలలో అమలవుతున్న మెనూ విధానాన్ని పరిశీలించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రోజుకో స్పెషల్ కూరతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న భోజన విధానంపై ప్రభుత్వ కల్పిస్తున్న సదుపాయాలను వారు కొనియాడారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్ దేశస్తులు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కనకాచారికి జపాన్‌కి చెందిన స్టాన్లీ స్నేహితుడు. కనకాచారి కోరిక మేరకు క్రిస్మస్ వేడుక కోసం స్టాన్లీ అతని జపాన్ స్నేహితులు కోటరో, హిరోమి, ష్కాలర్ ఇక్కడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా అక్కడి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేసేదెవరని ఆరా తీశారు. అలాగే పాఠశాలకు కల్పించిన మౌలిక వసతులకు మంత్రముగ్థులై విషయాలన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల ఇక్కడి పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయిందని కనకాచారి వారికి వివరించారు. దీనికోసం సీఎం జగన్మోహనరెడ్డి మహోద్యమం చేస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తీసుకొచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆశ్చర్యం చెందినవారు వెంటనే అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఇంతటి సదుపాయాలు కల్పిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాఠశాల హెచ్ఎం లలితతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదీ చదవండి: మనసున్న సీఎం వైఎస్ జగన్ -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్‌లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు. -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
Karnataka election results 2023: ప్రేమ విపణి తెరుచుకుంది: రాహుల్
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఫలితమే పునరావృతం కావడం ఖాయమన్నారు. ‘‘కర్ణాటకలో విద్వేష బజార్ మూతపడింది. ప్రేమ బజార్ తెరుచుకుంది. కాంగ్రెస్‌కు అద్భుత విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు. మేం ద్వేషం, చెడు భాష వాడకుండా ప్రజలపై ప్రేమాభిమానాలే అండగా పోటీ చేసిన తీరుకు చాలా ఆనందంగా ఉంది. ఆశ్రిత పెట్టుబడిదారుల బలంపై పేదల బలమే గెలిచింది. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఐదు హామీలను తొలి మంత్రివర్గ భేటీలోనే నెరువేరుస్తాం’’ అని ప్రకటించారు. -
రూయా చిన్న పిల్లల ఆసుపత్రి.. భేష్
సాక్షి, తిరుపతి: రూయా చిన్నపిల్లల ఆసుపత్రిని జాతీయ బాలల హక్కుల కమిషన్(NCPCR) సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అక్కడి సేవలు, సిబ్బంది పని తీరుపై అభినందనలు గుప్పించారు. శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్జీ ఆనంద్. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారాయన. ఈ సందర్భంగా.. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం, అక్కడి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని.. సంబంధిత విభాగపు హెచ్‌వోడి డా. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ఆర్సీ లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ఆర్సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్.. ఇద్దరూ వైద్య ఆరోగ్యానికి, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారాయన. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు. తనిఖీ సందర్భంగా ఆయన వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
అన్ని ప్రాంతాలపై సీఎం జగన్ సమదృష్టి
అనంతపురం కల్చరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాల పట్ల సమాన భావన ఉందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘సాధన’ నవలావిష్కరణ సభ ఆదివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ రాయలసీమ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవన్నారు. కానీ సినీ పరిశ్రమలోని కొందర స్వార్థపరులు సీమ సంస్కృతిని కించపరిచేలా ఫ్యాక్షన్ ముద్ర వేసి చూపించడం తనకు వేదన కల్గిస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తనతోపాటు కొంతమంది కలసి వెనుకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితుల గురించి వివరించిన వెంటనే తాండవ రిజర్వాయర్, ఏలూరు కాలువ ఎత్తిపోతల పథకానికి రూ.470 కోట్లతో అనుమతులివ్వడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు నారాయణమూర్తిని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ రాగే హరిత, వైఎస్సార్సీపీ నాయకులు చామలూరు రాజగోపాల్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ శాంతినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సభకు ఉప్పరపాటి వెంకటేశు అధ్యక్షత వహించగా, రాయలసీమ ఉద్యమ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, మాలపాటి అశోకవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ -
మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రధాని మోదీ స్వతంత్ర విధేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. మాస్కోకు చెందిన వాల్డై డిస్కషన్ క్లబ్ వార్షిక ప్రసంగంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాయత్వంలో భారత్‌లో అనేక మంచి పనులు జరిగాయి. ఆయన అసలైన దేశ భక్తుడు. మోదీ ‘మేకిన్ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైంది. భవిష్యత్తు భారత్‌దే. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్ గర్వించాలి.’ అని పేర్కొన్నారు ఇండియా అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం అద్భుతమని రష్యా అధ్యక్షుడు అన్నారు. దాదాపు 1.5 బిలియన్ల(150 కోట్లు) ప్రజలు, ఖచ్చితమైన అభివృద్ధి కారణంగా భారత్‌ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని, అభిమానిస్తారని పేర్కొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని స్పష్టం చేశారు.రెండు దేశాల మధ్య అనేక దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. చదవండి: Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్ భారత్, రష్యా మధ్య ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులు రాలేదని.. ఎల్లప్పుడూ ఒకరికొకరం మద్దతుగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం అదే కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరాను పెంచాలని మోదీ కోరారని.. ఇందుకు తాము 7.6 రెట్లు సరఫరా పెంచినట్లు తెలిపారు. వ్యవసాయంలో వ్యాపారం దాదాపు రెండితలు పెరిగిందని పుతిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పశ్చిమ దేశాల వైఖరిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ(డర్టీ గేమ్) ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. వాటి చర్యలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని హెచ్చరించారు. చదవండి: డేంజర్స్ డర్టీ గేమ్‌కి ప్లాన్... పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు -
మీకు నయన్ సూపర్‌స్టార్ గానే తెలుసు..: విఘ్నేష్ శివన్
నటి నయనతారను ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ మరోసారి పొగడ్తల్లో ముంచేశారు. ఆయన నయనతారను పొగడటం కొత్త ఏమీ కాదుగా అంటారా..? అది నిజమే. అయితే ఈసారి సందర్భం ఏమిటంటే గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార, విఘ్నేష్ శివన్‌ల జంట ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక అంతా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలోనే జరిగిందంటారు. సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. అయితే ఈ పెళ్లి తంతు ఖర్చు అంతా నెట్‌ఫ్లిక్స్ సంస్థ భరించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీని ఓటీటీ ప్రచార హక్కుల కోసం ఆ సంస్థ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్లి పంక్షన్‌ను బియాండ్ ద ఫెయిరీ టేల్ పేరుతో నెట్‌ప్లిక్స్ త్వరలో ప్రచారం చేయడానికి సిద్ధమైంది. అందులో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ, పెళ్లి గురించి తమ భావాలను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో విఘ్నేష్ శివన్ పేర్కొంటూ నయనతార మీకు సూపర్‌స్టార్‌గానే తెలిసి ఉంటుందని, వ్యక్తిగతంగా తెలిసి ఉండదని పేర్కొన్నారు. తన అలవాట్లు అన్ని మార్చుకున్న అద్భుతమైన ప్రేమకథ ఉన్న మై బంగారం ఈ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ త్వరలో నెట్‌ప్లిక్స్‌లో ప్రచారం కానుందన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నటి నయనతార అని, అయితే చేపట్టిన పనికి 100 శాతం శ్రమించాలని భావించే సాధారణ మహిళని తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. -
‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ‘మనసానమః’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన యువ దర్శకుడు దీపక్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ లఘు చిత్రం దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకోవడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తనను కలిసిన దీపక్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు. చదవండి: చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ -
భారత ఆరోగ్యరంగంపై బిల్‌గేట్స్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని మైకోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శ్లాఘించారు. దేశీయంగా ఆరోగ్య, డిజిటల్ రంగాల దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీని పొగిడారు. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమన్నారు. As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav — Bill Gates (@BillGates) August 15, 2022 ఇదీ చదవండి: భారత్‌పై మరోమారు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు -
AP: సచివాలయ సేవలు బాగున్నాయి
భీమవరం అర్బన్: ఏపీలో అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సేవలు బాగున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను, సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న గ్రామస్తులను పలకరించి.. ఎన్ని డోసులు వేయించుకున్నారు.. ఈ వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల సేవలు, వారికిచ్చే వేతనం గురించి ఆరా తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజావసరాలను, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల ఇంటి ముంగిటకే తీసుకెళ్లడం అభినందనీయమని కితాబిచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు -
స్వరం మార్చిన కాంగ్రెస్ చీఫ్.. బీజేపీపై ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హస్తం నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. కాగా, భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పటికే కాంగ్రెస్ చర్యలకు దిగింది. పార్టీ ప్రక్షాళనకు ప్లాన్స్ తయారుచేస్తోంది. అయితే, ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. తాజాగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హర్ధిక్ పటేల్.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేయగా.. శుక్రవారం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. హఠాత్తుగా హార్ధిక్.. హిందుత్వ బాణిని వినిపించారు. అలాగే బీజేపీని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీకి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. వాటిని మనం అంగీకరించాలి. రాజకీయంగా ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాలి. అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి ఉందని మనం అంగీకరించాలి. అలాగే గుజరాత్లో కాంగ్రెస్ బలంగా మారాంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలి’’ అన్ని అన్నారు. మరోవైపు.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్ పటేల్ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వద్దా అన్నది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. బీజేపీలో చేరే ఆలోచనలేదని తెలిపారు. కాగా, హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా తాను పీసీసీ బాధ్యతలు నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. తన పనులకు కొందరు అడ్డుతగులుతున్న కారణంగా ప్రజల పక్షాన పోరాడలేకపోతున్నానని గుజరాత్ నేతలపై అధిష్టానానికి హార్ధిక్ ఫిర్యాదు చేశారు. -
సూపర్ ఉమెన్.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్ ప్రశంసలు..
సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..? చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్ కమిషనర్ ఆర్వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్ టాపిక్ మారింది. ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్ స్పందించారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆర్జీవీకి తెగ నచ్చేసిందట
విలక్షణ దర్శకుడు రాం గోపాల్ వర్మ చేష్టలే కాదు.. సోషల్ మీడియాలో చేసే కామెంట్లు కూడా ఒక్కోసారి అర్థం కావు. అలాగని ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. పొగడ్తల వంకతో తిడతాడో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమూ కాదు. అయితే ఫ్యామిలీమ్యాన్ 2 పై మనస్ఫూర్తిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఒక రియలిస్టిక్ జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీ దూసుకుపోవడానికి ఫ్యామిలీమ్యాన్ 2 మంచి అవకాశం ఇచ్చిందన్న వర్మ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఉందని, ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడు తన నటనతో అద్భుతంగా మలిచాడంటూ మనోజ్ వాజ్‌పాయి పై ప్రశంసలు గుప్పించాడు. FAMILY MAN 2 gives rise to a realistic James Bond franchise which can go on forever .Mixing family drama/action/entertainment is complex and can only be pulled off by an incredible actor like @bajpayeemanoj as he treads the very fine line between realistic and dramatic 👏👏👏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) June 12, 2021 కాగా, వర్మ తీసిన సత్య(1998) మూవీతోనే మనోజ్ వాజ్‌పాయికి నేషనల్ అవార్డు(సపోర్టింగ్)తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వివాదాల నడుమే స్ట్రీమ్ అయ్యి సూపర్‌హిట్ టాక్ దక్కించుకుంది. మనోజ్ వాజ్‌పాయితో పాటు సమంత నటనకు క్రిటిక్స్, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన దక్కింది. చదవండి: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
సీఎం జగన్‌ను ప్రశంసించిన కేంద్రమంత్రి
సాక్షి, విజయవాడ/విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. విశాఖలోని 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ లక్ష్యమున్న లక్షణమైన నాయకులని పేర్కొన్నారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైద్య సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని.. మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా ఏపీ నిలుస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కరోనా కట్టకికి నిరంతరం పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం. మెగా మెడికల్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న సీఎం జగన్‌కు అభినందనలు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లే అన్ని రంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని.. ముందుకు వెళ్తున్న ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని’’ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. చదవండి: గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారు: సజ్జల చంద్రబాబు కుయుక్తులు ప్రజలు నమ్మరు: కొడాలి నాని -
మోదీపై ఆజాద్ ప్రశంసలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ తన గతం గురించి మొహమాటం లేకుండా నిజాలు చెప్పారని పేర్కొన్నారు. చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్లో టీ అమ్మానని మోదీ గతంలో పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. ఎవరైనా సరే.. తన మూలాల విషయంలో గర్వపడాలన్నారు. జమ్మూలో గుజ్జర్ దేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆజాద్ పాల్గొన్నారు. ‘కొందరు నాయకులను నేను అభిమానిస్తాను. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఆ విషయం నాకు గర్వకారణం. అలాగే, దేశంలోనే పెద్ద నాయకుడైన ప్రధాని మోదీ కూడా చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్నారు. అది వారి గొప్పతనం’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎంపీగా ఆజాద్ పదవీవిరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని మోదీ, ఆజాద్ పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో ఆజాద్ కీలక నేత. జీ 23 నాయకులు శనివారం జమ్మూలో సమావేశమై, కాంగ్రెస్ భవితవ్యంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై స్పందిస్తూ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నుంచి ఆయన హోదాను తొలగించి సామాన్య కానిస్టేబుల్‌గా మార్చినట్లు ఉందని ఆజాద్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో అభివృద్ధి జరుగుతోందన్న వార్తలు అసత్యాలన్నారు. -
గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకువెళ్లడంలో సఫలమయ్యారన్నారు. గురువారం ఆయన వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాలనా నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, ప్రధానంగా విద్యా సంస్కరణలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులతో వెబినార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలు, విద్యా రంగంలో ప్రమాణాల పెంపునకు తీసుకున్న చర్యలు, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూనే విద్యార్థులకు వివిధ మార్గాల్లో బోధనా కార్యక్రమాల కొనసాగింపు తదితర అంశాల గురించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా స్వాగతించిందని, అంతకు ముందు నుంచే పలు సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే అనేక చర్యలను తీసుకున్నామని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ స్పందిస్తూ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విద్యాభివృద్ధికి ఏపీ విశేష కృషి ♦మీ రాష్ట్రంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. విద్యాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. విద్యామృతం, విద్యాకలశం కార్యక్రమాలు అమలు చేస్తుండటం అభినందనీయం. ♦విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు బడి పిల్లల వరకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడంలో మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఆదర్శవంతం. ♦గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం ముదావహం. అక్కడే ఆయా విభాగాలకు అధికారులను నియమించడం మంచిపని. ఇలాంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేకూరడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించడానికి వీలవుతుంది. ఇతరులకూ ఆదర్శం ♦మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ఇతరులకూ ఆదర్శవంతంగా ఉన్నాయి. విద్యారంగంలో జీడీపీని ఆరు శాతానికి ఎలా తీసుకువెళ్లాలనేది విద్యా శాఖ మంత్రులందరూ ఆలోచించాల్సిన సమయం ఇది. ♦కొత్త బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యా మంత్రులు కేబినెట్ సమావేశాల్లో విద్యా రంగ ప్రాధాన్యతను తెలియజెప్పాలి. ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరూ జాతీయ విద్యా విధానం పట్ల సుముఖతతో ఉన్నారు. ♦అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలయ్యేలా సూచనలు చేస్తాం. -
సరికొత్త బిహార్‌లో నితీశ్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుపరిపాలనపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సుపరిపాలన మరో అయిదేళ్ల పాటు కొనసాగాలన్నారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలతో ఎంత లబ్ధి చేకూరుతుందో గత 15 ఏళ్లుగా బిహార్‌వాసులకి తెలుస్తోందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజ్టెల్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పారాదీప్–హల్దియా–దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఆ రాష్ట్ర ఎన్డీయే కూటమిలో చీలికలు వస్తున్నాయన్న ఊహాగా నాలకు తన ప్రసంగం ద్వారా చెక్ పెట్టారు. -
ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు..
-
‘వారందరికీ హేట్సాప్’
సాక్షి, తణుకు: కరోనా వ్యాప్తి నివారణకు వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో తాను మాత్రం ఎందుకు ఇంట్లో ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశానని ఆయన తెలిపారు. (ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు) ఈ కరోనా వల్ల ధనిక దేశాలు కూడా విలవిలలాడుతున్నాయని.. మనకి ఆ పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని.. ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. వైద్యులు,పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు.. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వలంటీర్ల వ్యవస్థను ఆయన అభినందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని సులభంగా గుర్తించగలుగుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. -
ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండు పథకాలను కలిపి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ గురువారం నిర్వహించిన సమావేశానికి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..తాను ఇటీవల సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలుపై చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను పంపిస్తానని, వారితో చర్చించాలని సీఎం చెప్పారన్నారు. వివిధ రాష్ట్రాలు అక్కడున్న ఆరోగ్య పథకాలతో కలిపి కొన్ని మార్పులతో అమలు చేస్తున్నాయని ఆయుష్మాన్ భారత్‌ను గవర్నర్ తెలిపారు. పట్టింపులకు పోకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఎలా అందించాలో ఆలోచించాలన్నారు. కేసీఆర్ కిట్, కంటివెలుగు తదితర పథకాల అమలుతీరును గవర్నర్ ప్రశంసించారు. ఈ సమావేశానికి హాజరైన నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) డిప్యూటీ సీఈవో డాక్టర్ ప్రవీణ్ గోయి మాట్లాడుతూ.. హైదరాబాద్ హెల్త్ హబ్ గా రూపుదిద్దుకున్నందున మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులు చికిత్స కోసం వస్తుంటారన్నారు. లాభదాయక పదవుల జాబితాపై గెజిట్ ఇదిలా ఉండగా..లాభదాయకపదవుల జాబితా నుంచి 29 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను, కార్పొరేషన్ చైర్మన్ పదవులను తొలగిస్తూ తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపు, నిరర్హతల తొలగింపు చట్టం 1953 నిబంధనలను సవరిస్తూ గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో గవర్నర్ తమిళి సై -
నో బ్రేక్.. సింగిల్ టేక్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్.