ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిన శ్రీలంక తాజాగా భారత్‌ను ప్రశంసించింది. భారత్- శ్రీలంకల స్నేహపూర్వక సంబంధాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. తమ దేశం రెండేళ్ల పాటు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిందని, భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతోనే ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు.
భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ ఇరు దేశాలూ పర్యావరణ అనుకూల ఇంధనరంగంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. ఇటీవల తాను ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ప్రధాని మోదీతో చర్చించానన్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు విక్రమసింఘే పేర్కొన్నారు. తమ దేశంలో సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందని, ఇది అంతర్-ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, దీనిని జూలైలో ప్రారంభించాలనుకుంటున్నామనారు. అలాగే శ్రీలంక-భారత్‌ల మధ్య ల్యాండ్ కనెక్టివిటీని నెలకొల్పే ప్రాజెక్టుపై కూడా తాము దృష్టి సారించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment