RGV The Family Man 2 Review: Varma Comments On Manoj Bajpayee And Movie - Sakshi
Sakshi News home page

Family Man2: ఇంక్రెడిబుల్‌ యాక్టర్‌ పై వర్మ ప్రశంసలు

Published Sat, Jun 12 2021 1:51 PM | Last Updated on Sat, Jun 12 2021 3:11 PM

RGV Praised Family Man 2 And Manoj Bajpayee - Sakshi

విలక్షణ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ చేష్టలే కాదు.. సోషల్‌ మీడియాలో చేసే కామెంట్లు కూడా ఒక్కోసారి అర్థం కావు. అలాగని ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. పొగడ‍్తల వంకతో తిడతాడో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమూ కాదు. అయితే ఫ్యామిలీమ్యాన్‌ 2 పై మనస్ఫూర్తిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ.

ఒక రియలిస్టిక్‌ జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీ దూసుకుపోవడానికి ఫ్యామిలీమ్యాన్‌ 2 మంచి అవకాశం ఇచ్చిందన్న వర్మ,  ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిసి ఉందని,  ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడు తన నటనతో అద్భుతంగా మలిచాడంటూ మనోజ్‌ వాజ్‌పాయి పై ప్రశంసలు గుప్పించాడు.

కాగా, వర్మ తీసిన సత్య(1998) మూవీతోనే మనోజ్‌ వాజ్‌పాయికి నేషనల్‌ అవార్డు(సపోర్టింగ్‌)తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. రాజ్‌ అండ్‌ డీకేలు డైరెక్ట్ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వివాదాల నడుమే స్ట్రీమ్ అయ్యి సూపర్‌హిట్‌ టాక్‌ దక్కించుకుంది. మనోజ్‌ వాజ్‌పాయితో పాటు సమంత నటనకు క్రిటిక్స్‌, వ్యూయర్స్‌ నుంచి మంచి స్పందన దక్కింది. చదవండి: ఫ్యామిలీమ్యాన్‌ 2 రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement