Ram Gopla Varma
-
నేడు ఒంగోలు రూరల్ పీఎస్ కు రాంగోపాల్ వర్మ
-
‘ఆర్ఆర్ఆర్’ఓ సర్కస్.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ
ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఆ చిత్రాన్ని సర్కస్‌తో పోల్చాడు. ముఖ్యంగా ఆ సినిమాలో బ్రిడ్జ్ దగ్గర పిల్లాడిని కాపాడే సీన్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ సర్కస్ చేస్తున్నట్లు అనిపించిందన్నారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. థియేటర్లో ఆర్ఆర్ఆర్ చూస్తే అలాంటి భావననే కలిగిందన్నారు. (చదవండి: మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు) ఇక మణిరత్నం గురించి అడగ్గా.. ఆయన చిత్రాలేవి తనకు నచ్చవని చెప్పారు.‘మణిరత్నానికి నా సినిమాలేవి నచ్చవు. నాకు కూడా ఆయన చిత్రాలు నచ్చవు. ఒక్కసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కూర్చొన్నాం. నా మాట ఆయన వినలేదు.. ఆయన మాట నేను వినలేదు. చివరకు సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. అవి ‘దొంగ దొంగా’, ‘గాయం’. ఈ రెండు సినిమాల్లో మా ఇద్దరి పేర్లు వేసుకున్నాం’అనీ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో కమ్యూనిష్టు భావాజలాన్ని కలిగి ఉండేవాడిననని.. కానీ అయాన్ ర్యాండ్ పుస్తకాలు చదివినప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందన్నారు. ఫెమినిజం అంటే స్త్రీలకోసం పోరాడటం కాదని.. స్త్రీలను ప్రేమించడం అని చెప్పాడు. తన కెరీర్లో ‘క్షణక్షణం’, ‘సర్కార్’చిత్రాలకే సరిగ్గా స్క్రిప్ట్ రాసి, సరైన నటీనటులను ఎంచుకున్నానని, మిగిలిన చిత్రాలన్ని ఫలానా హీరోతో చేయాలని అనుకోలేదని ఆర్జీవీ అన్నాడు. -
సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేసి.. రేవంత్‌రెడ్డి ఆపారు : సుష్మితాపటేల్ ఫైర్
సాక్షి, హన్మకొండ అర్బన్: ‘చదువురానోడికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి సినిమా ఫంక్షన్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అదే చదువుకున్న కడియం శ్రీహరి మంత్రిగా ఉంటే అనుమతి వచ్చేది’ అని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి అన్నారు. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ నిర్మించిన కొండా సినిమా ప్రీరిలీజ్ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఆ చదువు రానోడి పేరు చెప్పనని, అతని గురించి సినిమాలో ఆర్జీవీ బాగా చూపించాడన్నారు. మురళి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మెడ కోసుకుంటాడన్నారు. (చదవండి: గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్) సురేఖ మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని, అందుకు ఈ సినిమా స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. అణచి వేతలనుంచి పైకివచ్చామని, కష్టాలు తెలిసిన వారిగా ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. సినిమా నిర్మాత, కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ మాట్లాడుతూ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా..? నీ బతుకంతా భయంతోనేనా ... సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు.. ఎన్నికలు రానియ్ నీ సంగతి చెబుతా’ అంటూ ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు. చిత్రంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఈరామోర్ నటించారు. ఈ సినిమాకు సుస్మితాపటేల్ నిర్మాతగా ఉండగా, శ్రేష్టపటేల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లానుంచి కొండా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలో దర్శకుడు ఆర్జీవీ, సినిమా తారాగణం పాల్గొన్నారు. -
నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాలను పలకరిస్తూ ఉంటాడు. ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేస్తుంటాడు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఏ ఒక్కరిని వదలడు. అందరిపై ఒకేలా తన వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. అలాగే తనకు పండుగలకు పబ్బాలకు శుభాకాంక్షలు చెప్పడం కూడా నచ్చదు. నచ్చదన్న పని ఎవరూ చేయారు. కానీ అలా చెప్పినట్లుగా చేస్తే అతను ఆర్జీవి ఎందుకు అవుతాడు. అవును ఏ పండుగకు విష్ చేయని రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వజ్రాయుధం ట్వీటర్ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ మేలు జరగాలని కోరాడు. 'అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి'. 'భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.' 'చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి.' 'నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి. అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు ఆర్జీవీ. Happy Sankranthri to all and may god bless each and everyone of u with a bigger house and more money than Mukesh Ambani and may no virus present or future infect u and may all men get the most beautiful woman in world and all women get most handsome man🙏💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all husbands and may god grant ur wish that ur wives will never nag u and they will be okay with whatever u do or u don’t do 🙏💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all small film makers and may each and every one of ur small films become a much bigger hit than Bahubali 🙏💐💪 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all my haters and may god grant ur wish that I will die asap 😎😎😎💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 ఇదీ చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
ఈ మధ్య ఎన్ఎఫ్టీ (NFT) పదాన్ని తరచుగా వింటున్నాం. పలు సెలబ్రిటీలు ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో భారతదేశంలో ఎన్ఎఫ్టీకి క్రేజ్ పెరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సన్ని లియోన్ ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టడంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది. ఎన్ఎఫ్టీ అంటే నాన్ పంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒక రకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్షిప్ ఇస్తారు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్ఎఫ్టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. అయితే ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. 1. అమితాబ్ బచ్చన్ బియాండ్‌లైఫ్.క్లబ్‌తో పెరుతో తన సొంత ఎన్ఎఫ్టీలను ప్రారంభించిన మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రితీ ఎంటర్టైన్మెంట్ వారి బియాండ్‌లైఫ్.క్లబ్, గార్డియన్లింగ్.ఐవోతో భాగస్వామ్యమైంది. గ్లోబల్ సెలబ్రిటీలు, ఆర్టిస్తులు, అథ్లెట్లకు వారి వారి చిత్రాలను ఎన్ఎఫ్టీలుగా (NFTs.Movie) మార్చడానికి ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీ వేలంతో మూడు సెట్ల కలెక్షన్లతో లైవ్‌లోకి వెళ్లారు. 2. సన్నీ లియోన్ సన్నీ లియోన్ నాన్-ఫంగిబుల్ టోకెన్ల (NFT) మార్కెట్ ప్లేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటిగా అవతరించింది. ఈమె మిస్ఫిజీ పేరుతో ఎన్ఎఫ్టీ తీసుకుంది. 3. దుల్కర్ సల్మాన్ మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన చిత్రం కురుప్ కోసం గత నెలలో ఎన్ఎఫ్టీ సేల్‌ను నిర్వహించడానికి అబుదాబికి చెందిన టెక్నాలజీ కంపెనీ అంబర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4. రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. 5. విశాల్ మల్హోత్ర టీవీ హోస్ట్, నటుడు విశాల్ మల్హోత్ర నాన్ ఫంగిబుల్ టోకెన్ (NFT)ను ఆర్టిస్ట్ ఇషితా బెనర్జీతో కలిసి విడుదల చేశారు. అలా ఒక ఆర్టిస్ట్‌తో కలిసి విడుదల చేసిన మొదటి భారతీయ నటుడు విశాల్ మల్హోత్ర. ఈయన తన 25 ఏళ్ల బాలీవుడ్ కెరీర్లో ఎన్నో ప్రజాధరణ పొందిన పాత్రలు చేశారు. వీరితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రాపర్ రాఫ్తర్, సింగర్ మికా సింగ్, యూట్యూబర్ అమిత్ బదాన ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి దిగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు, ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. -
‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. (చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు) తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. మా అసోసియేషన్ లో సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరోసారి మా వివాదంపై కాంట్రవర్శియల్ కామెంట్ చేశాడు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆర్జీవీ ట్వీట్‌కి మంచు మనోజ్ దిమ్మతిరిగే పంచ్) Cine”MAA” is a CIRCUS full of JOKERS — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021 -
వర్మ చెంప చెళ్లుమనిపించిన అషూ రెడ్డి
RGV Bold Interview With Ashu Reddy: వివాదాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్లు కూడా యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా మారుతుంటారు. ఆ మధ్య బోల్డ్ బ్యూటీ అరియానా, వర్మల చిట్‌చాట్ నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. నేడు(సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో అషూ కాఫీ షాపులో కూర్చుని ఫోన్లో బిజీగా ఉండగా వర్మ ఆమె దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే ఆర్జీవీ ఎవరో తెలీదన్నట్లు నటించింది అషూ. ఇంతలో నీ థైస్ బాగున్నాయ్ అని వర్మ నిర్మొహమాటంగా కాంప్లిమెంట్ ఇచ్చాడు. దీంతో ఆవేశం ఉప్పొంగుకొచ్చిన అషూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఇంతటితో ప్రోమో పూర్తైంది. మరి వర్మ ఈ చెంపదెబ్బపై ఎలా రియాక్ట్ అయ్యాడనేది తెలియాలంటే సెప్టెంబర్ 7న రిలీజయ్యే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే! -
ఆర్జీవీకి తెగ నచ్చేసిందట
విలక్షణ దర్శకుడు రాం గోపాల్ వర్మ చేష్టలే కాదు.. సోషల్ మీడియాలో చేసే కామెంట్లు కూడా ఒక్కోసారి అర్థం కావు. అలాగని ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. పొగడ్తల వంకతో తిడతాడో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమూ కాదు. అయితే ఫ్యామిలీమ్యాన్ 2 పై మనస్ఫూర్తిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఒక రియలిస్టిక్ జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీ దూసుకుపోవడానికి ఫ్యామిలీమ్యాన్ 2 మంచి అవకాశం ఇచ్చిందన్న వర్మ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఉందని, ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడు తన నటనతో అద్భుతంగా మలిచాడంటూ మనోజ్ వాజ్‌పాయి పై ప్రశంసలు గుప్పించాడు. FAMILY MAN 2 gives rise to a realistic James Bond franchise which can go on forever .Mixing family drama/action/entertainment is complex and can only be pulled off by an incredible actor like @bajpayeemanoj as he treads the very fine line between realistic and dramatic 👏👏👏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) June 12, 2021 కాగా, వర్మ తీసిన సత్య(1998) మూవీతోనే మనోజ్ వాజ్‌పాయికి నేషనల్ అవార్డు(సపోర్టింగ్)తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వివాదాల నడుమే స్ట్రీమ్ అయ్యి సూపర్‌హిట్ టాక్ దక్కించుకుంది. మనోజ్ వాజ్‌పాయితో పాటు సమంత నటనకు క్రిటిక్స్, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన దక్కింది. చదవండి: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
సోషల్ హల్చల్ : ఆర్జీవీతో అరియానా జిమ్.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ
మొదటి స్టెప్ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. పెంచ్ మెమోరీస్ అంటూ హాట్ ఫోటోని షేర్ చేసింది శ్రీముఖి ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్‌ని షేర్ చేసింది లక్ష్మీరాయ్ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకుంటి బిగ్‌బాస్ బ్యూటీ అరియానా మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
మోనాల్ అందాలు..ఏంజెల్‌ని మర్చిపోయానన్న ఆర్జీవీ
ఆదివారం వీటితో గడిపానంటూ.. తన పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న ఫోటోని అభిమానులతో షేర్ చేశాడు యంగ్ హీరో నాగశౌర్య కోపంగా ఉందంటున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు యాంకర్ సమీర ప్రకటించింది. భర్తతో కలిసి టీ షర్ట్ల మీదే అసలు విషయాన్ని చెప్పింది. ఈ ఏంజెల్ ఎవరో మర్చిపోయానంటూ ఓ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పోస్టు చేసింది. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మోనాల్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
శ్రద్దాదాస్ అందాల విందు.. థాంక్స్ చెప్పిన ఆర్జీవీ
► దయచేసిన నన్ను బాలికి తీసుకెళ్లండి. ఈ సారి లాక్డౌన్ చాలా కష్టం అంటూ బీచ్‌లో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ శ్రద్దాదాస్. ► పుట్టినరోజు సందర్భంగా తనను విష్ చేసిన నటి అప్సరరాణికి రామ్‌గోపాల్‌వర్మ థాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో ఒక పోస్టు చేశారు. ► భర్త అల్లు అర్జున్‌కు బర్త్‌డే విషెష్ చెప్పిన స్నేహరెడ్డి ► మార్నింగ్ ఫేస్.. అంటూ మాళవిక మోహన్ ఒక ఫొటో పోస్టు చేసింది. View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
ఆర్జీవీ: డీ కంపెనీ ట్రైలర్ రిలీజ్..
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసిన చిత్రమే డీ కంపెనీ. హిందీ ట్రైలర్‌ను బుధవారమే రిలీజ్ చేసిన ఆయన తాజాగా నేడు(శుక్రవారం) తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇందులో దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది చూపించారు. మనం పైకి రావడానికి ఛాన్స్ ఉంది, రిస్క్ కూడా ఉంది అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. తుపాకీల మోత, కత్తులతో నరుక్కోవడాలు.. చూస్తుంటే రక్తపాతాలు, బీభత్సాలు, హింస విపరీతంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల పాత పద్ధతులనే రిపీట్ చేస్తూ రొటీన్ అనిపిస్తోంది. ఇందులో వర్మ మార్క్ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. సాగర్ మాచనూరు నిర్మిస్తున్న ఈ సినిమాకు పౌల్ ప్రవీణ్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: వర్మ ‘డీ కంపెనీ’ టీజర్ గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా -
రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దిశ తండ్రి దాఖలు చేసిన అప్పీలుపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోక ముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు.. రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అలానే అనుమతులున్నాయో లేదో తెలుసుకొని చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’) మరోవైపు దిశ ఎన్కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు. -
మీటూ.. దర్శకుడికి ఆర్జీవీ మద్దతు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనురాగ్ కశ్యప్‌కు మద్దతిచ్చారు. అనురాగ్ కశ్యప్ అత్యంత 'సున్నితమైన, భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అనురాగ్ కశ్యప్ ఎవరినీ బాధపెట్టడం తాను ఎప్పుడూ చూడలేదని, కనీసం వినలేదని ఆయన అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ‘నాకు తెలిసిన అనురాగ్ కశ్యప్ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కల వ్యక్తి. నాకు అతడు గత 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఎవరినీ బాధపెట్టడం గురించి నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు.. కనుక ప్రస్తుతం జరిగే దాని గురించి స్పష్టంగా చెప్పలేను’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. (చదవండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్) The @anuragkashyap72 i know is a highly sensitive and emotional person and I never ever saw or heard about him hurting anyone in all of the 20 years that I have known him ..So I frankly can’t picture what’s happening now — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2020 అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా వచ్చారు. తాప్సీ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, కల్కి కోచ్లిన్, ఆర్తి బజాజ్ వంటి ప్రముఖులు అందరూ అనురాగ్ కశ్యప్‌ను సమర్థించారు. తాప్సీ అనురాగ్ కశ్యప్ తనకు తెలిసిన అతిపెద్ద ఫెమినిస్ట్ అనగా.. అనుభావ్ సిన్హా ‘మీటూ ఉద్యమాన్ని మహిళల గౌరవం తప్ప మరే ఇతర కారణాల కోసం దుర్వినియోగం చేయరాదని' అభిప్రాయపడ్డారు. ఇక అనురాగ్ మాజీ భార్య కల్కి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనకు మద్దతు తెలిపారు. -
వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమైన అమృత
సాక్షి, నల్లగొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం... ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అమృత. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) అమృత పిటిషన్‌ను న్యాయస్థానం.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్స్అప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. -
ప్రవన్ కల్యాణ్ అభిమానులకు ఆర్జీవీ థాంక్స్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ సినిమాతో మరో సంచలనానికి తెరతీశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మామూలుగా అభిమానులను సర్ప్రైజ్ చేసే ఆర్జీవీని.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్ సర్ప్రైజ్ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్ రావడంపై ఆయన స్పందిస్తూ.. ఈ విజయం ‘ప్రవన్ కల్యాణ్ అభిమానులకు అంకితం’అని ట్వీట్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్‌ను ఆన్లైన్లో చూసేందుకు రూ.25 చెల్లించాలని ఆర్జీవీ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రేపు (బుధవారం) ఉదయం 11 గంటలు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల కానుంది. ఇలా ట్రైలర్ చూసేందుకు డబ్బులు వసూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. రూ.25 చెల్లించి సినిమా ట్రైలర్ చూడాలని తాజా ట్వీట్లో ఆర్జీవీ మరోసారి స్పష్టం చేశారు. పవర్ స్టార్ సినిమా జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల చేయనున్నారు ఆర్జీవీ. (‘ఆర్జీవీపై ఇష్టంతో.. ఆ సినిమాకు నో చెప్పాను’) -
చిన్న చిత్రాలకు శాశ్వత పరిష్కారం
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హవా కొనసాగుతోంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలువురు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారు. తాజాగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా ‘భీమవరం టాకీస్’ పేరుతో ఒక ఓటీటీ యాప్‌ని తీసుకొస్తున్నాం. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీతో మనం మారుదామంటూ సినిమా జీనియస్ రామ్‌గోపాల్ వర్మ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) అనే సరికొత్త మార్గాన్ని వెలికితీశారు. ఈ రంగంలోకి కూడా భీమవరం టాకీస్ అడుగుపెడుతోంది. ఏటీటీ వల్ల చిన్న సినిమా విడుదల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చిన్న బడ్జెట్ నిర్మాతల కోసం నిర్మాతల మండలి కూడా ఇలాంటి ఓటీటీ యాప్‌ని త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అన్నారు. -
వర్మ సందేహాన్ని తీర్చేసిన అభిమానులు
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమ్ఎమ్ఓఎఫ్’. ఎన్.ఎస్.ఈ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షత, మనోజ్ నందన్, అక్షిత, బెనర్జీ, సంపూర్ణేశ్ బాబు, జబర్దస్త్ నటులు ఆర్పీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రాంగోపాల్ వర్మ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గురించి ఆర్జీవీ స్పందిస్తూ.. ‘ఎమ్ఎమ్ఓఎఫ్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్ రూపొందించి విధానం మాత్రం బాగుంది. పదునైన కటింగ్‌తో జెడ్ స్పీడ్‌లో ఉంది’ అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయన అభిమానులు స్పందిస్తూ వర్మకు టైటిల్ వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్ఎమ్ఓఎఫ్ అంటే 70ఎమ్ఎమ్ అని చెప్పుకొచ్చారు. 70 ఎమ్ఎమ్ను రివర్స్‌లో ఎమ్ఎమ్ఓఎఫ్ అని పెట్టారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇదెంతవరకు నిజమన్నది ఆ సినిమా యూనిట్‌కే తెలియాలి. ఇస్మార్ట్ దర్శకుడు పూరీజగన్నాథ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ట్రైలర్ కొత్తగా ఉందని, ఇందులో జేడీ తన నటనతో ఇరగదీశాడన్నారు. (కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ) కథానాయకుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఒకరోజు నేను అడవిలో వెళుతుంటే సడన్‌గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను.. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది..’ అంటూ డైలాగ్ వినిపిస్తుంది. ఇంతలో ఇంటర్వెల్ పడుతుంది. సినిమాలో లాగా ట్రైలర్లో ఇంటర్వెల్ పడటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ బ్రేక్ తర్వాత హీరో తిరిగి మళ్లీ అదే కథను వినిపిస్తాడు. చివరగా.. ‘ఎటువైపు చూసినా చావే.. ఆ చావులన్నింటినీ దాటాలంటే ఎమ్ఎమ్ఓఎఫ్ చూడండి’ అని ముగిస్తాడు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌పై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ను నిస్సిగ్గుగా కాపీ కొట్టార’ని విమర్శిస్తున్నారు. (సినిమాలో అది ట్రై చేద్దామా) -
‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ భవిష్యత్‌లో ఏ పార్టీతోను కలవదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీజేపీతో కలవాలని ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, టీడీపీకి బీజేపీలో గేట్లు మూసేశామని వెల్లడించారు. టీడీపీ, జనసేన లిమిటెడ్ పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదని చురకలంటించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతున్నామని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులు సగానికి సగం మంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బుధవారం జరగనున్న ముగింపు యాత్రలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పాల్గొంటారని వెల్లడించారు. సంకల్పయాత్రలో లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. (చదవండి : టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా) వర్మని బహిష్కరించాలి ‘రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీలో రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. సాంఘిక దూరాచారానికి రాంగోపాల్ వర్మ చేస్తున్న పనికీ తేడాలేదు. సంచలనం కోసం, చిల్లర ప్రచారం కోసం రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వర్మ వ్యవహరిస్తున్నాడు. వర్మని ఏపీలో బహిష్కరించాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. -
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ప్రజాసేవ చేయను: వర్మ
సాక్షి, భీమవరం: రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైకిల్ టైరు పంక్చర్ అయింది. అందుకే కారులో వచ్చామ’ని చమత్కరించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్ పడిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్‌బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానుంది. -
చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందే చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. చిత్రం విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్ పడిందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఫిలిం చాంబర్‌హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని సన్నివేశాలు 25 ఏళ్ల కిందట జరిగిన వాస్తవ సంఘటనలు అని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఆ సంఘటనల్లో పాల్గొన్న ప్రధాన పాత్రలు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారన్నారు. అప్పట్లో మీడియా లేకపోవడంతో ఎన్టీఆర్ జీవితంలో చివరిరోజుల్లో జరిగిన సంఘటనలపై రకరకాల కథలు వినిపిస్తున్నాయన్నారు. నిజంగా ఆ సమయంలో ఏం జరిగిందో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించినట్లు చెప్పారు. ఒక వ్యక్తిని నమ్మి ఎన్టీఆర్ పెద్ద తప్పు చేశారన్నారు. ఆ వ్యక్తే ఎన్టీఆర్‌ను ఏం చేశారో.. థియేటర్లో చూడవచ్చన్నారు. తాను కాంట్రవర్సీని మాత్రమే సినిమాగా తెరకెక్కించానని, చంద్రబాబు సినిమాను కాంట్రవర్సీ చేశారన్నారు. ఎన్టీఆర్ వెనుక కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉద్దేశం తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని వర్మ అన్నారు. ఈనెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నిజజీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో తానీ సినిమా తీశానని చెప్పారు. ఏపీలో చిత్రం విడుదల కాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్, కోర్టులు ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రం విడుదలైందన్నారు. ప్రస్తుత తన ప్రెస్‌మీట్‌కు పోలీసులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు నమోదు చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తానికి సినిమాను అమ్మేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రయూనిట్ ఖండించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ స్టిల్స్
-
ఇది కుటుంబ కుట్రల చిత్రం!
రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏజీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ఈనెల 14న (వేలంటైన్స్ డే) విడుదల చేస్తున్నారు. ‘ఇది కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్ లైన్‌తో వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాదు.. చాలామందిలో చెమటలు పుట్టిస్తోంది. ‘‘పదవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దన్నా లక్ష్మి పార్వతి చేయి వదలని ఎన్టీఆర్ ప్రేమను చూపించబోతున్నారు ఆర్జీవీ. ఎన్టీఆర్ లోలోపల ఒక నిర్వీర్యమైన ప్రేమకథను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారాయన. లక్ష్మి కోసం అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య అతి రహస్య బంధం ఏంటి? విడదీయరాని ఆ పవిత్ర బంధం ఎంటి?.. ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగు ప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆయన కుటుంబ సభ్యులకు, నమ్మకంగా లేని అనుచరులకు, వెన్నుపోటు పొడిచిన కుట్ర దారులకు ఈ సినిమా ముందుపోటులా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్లోని మంచి విషయాలే కాదు.. తన సొంత ఫ్యామిలీ వాళ్లు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కల్యాణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి. -
నందమూరి-మెగా వివాదం.. మధ్యలో ఆర్జీవీ!
గతకొన్ని రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఏరేంజులో దుమారం లేపుతున్నాయో తెలిసిందే. బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అనడం.. పైగా అప్పట్లో కమెడియన్ బాలయ్య అనే అతను నాకు తెలుసంటూ చురకలు అంటించడం తెలిసిందే. రాను రాను ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. నాగబాబు ‘ఎన్టీఆర్’ బయోపిక్ పైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓ వైపు ఈ రచ్చ జరుగుతూ ఉంటే.. వివాదాలకు కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ కూడా ఇందులో జాయిన్ అయ్యాడు. నాగబాబు చేస్తున్న కామెంట్స్‌పై ఆర్జీవీ సోషల్ మీడియాలో తన స్టైల్లో కామెంట్ చేశాడు. ‘ కామెంట్లో నన్ను మించిపోయారనే నా బాధ ఒక వైపు.. తన స్టార్ బ్రదర్స్‌ని సమర్థించుకోవడంలో సూపర్ స్టార్అయ్యారని ఒకవైపు.. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హ్యాట్సాఫ్.. మీరు మీ బ్రదర్స్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో.. నేనూ అంతే ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. Commemtlalo nannu minchipoyarane naa jealousy baadha oka vaipu..Thana star brotherlani defend cheyyatamlo super star ayipoyarane aanandam oka vaipu..Oka kanta kanneru ..Maro kanta panneru..Naga babu Garu Hats Off ..I love ur brothers as much as u luv them https://t.co/paFwmyDdTz — Ram Gopal Varma (@RGVzoomin) January 7, 2019 -
పవన్‌పై వర్మ తాజా ట్వీట్
పవన్ పై వర్మ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. మెగా ఫ్యామిలిని, ప్రత్యేకంగా పవన్ ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేస్తున్న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి ఉదంతం తరువాత వర్మ పవన్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఇటీవల ఆఫీసర్ టీజర్‌కు అన్ లైక్‌లు రావటానికి పవన్ అభిమానులే కారణం అన్నట్టుగా వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేలటికెట్ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ మళ్లీ ఓ ట్వీటేశారు. రవితేజ పక్కన కూర్చున్న పవన్... రవితేజ వేసుకున్న టోర్న్ జీన్స్‌ను చూపిస్తూ ... దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దీనిపైన వివాదాల వర్మ స్పందిస్తూ... ‘రవితేజకు, పవన్ కల్యాణ్‌కు మధ్యలో వున్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. కానీ పీకే కి, రవి ఎడమతొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో వున్న ఆనందంలో కనబడుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. Agnyaathavasi @PawanKalyan lo ee angle kooda vundhani expression batti @RaviTeja_offl mohamlo cleargaa touch chesi choodu type lo thelusthondi kaani ee secret Mega family ki @JanaSenaParty ki kooda thelisundadhu ..BUT pk gillullallo Nela tickettla connectionlu kanipisthunnayi pic.twitter.com/GOL7jm7zhJ — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 . @Pawankalyan kaani @RaviTeja_offl thoda meedha vunna thana athyantha shraddhaloni just sagam rendu raashtraala meedha pedithe “Abbo athyantha Sashya Shyaamalame"🙏🙏🙏 pic.twitter.com/Zfykf2Qlym — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 .@raviteja_offl yedama thodaki, @pawankalyan kudi chethiki vunna avinaabhava sambhandham aa devudike theliyaali pic.twitter.com/PReVG6FjLB — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 . @RaviTeja_offl ki, @PawanKalyan ki madhyalo vunna ee thoda sambhandham gurinchina loguttu @JanaSenaParty oerumaallake theliyali ..Kaani pk ki,Ravi yedama thoda meedha chaala makkuva vundhanna vishayam pk moham lo vunna aanandham lo kanabaduthondhi pic.twitter.com/D53KgHv5yD — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 -
వచ్చే జన్మలో అయినా నీకోసం పుట్టమ్మా.. : వర్మ
సాక్షి, ముంబయి : ఆయనకు ఇష్టమైన నటి, ప్రాణంకంటే ఎక్కువగా ఆరాధించే దేవత.. ఆమె అంటే తనకు పడిచచ్చిపోయేంత ప్రేమ అంటూ బహిరంగంగానే ఎన్నోమార్లు చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హఠాన్మరణం చెందిన ప్రముఖ నటి శ్రీదేవికి వీడ్కోలుతోపాటు ఓ విజ్ఞప్తితో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. తాజాగా ఆయన ట్విటర్ ద్వారా లక్ష్మీ భూపాల అనే వ్యక్తి శ్రీదేవికి వీడ్కోలు పలుకుతూ రాసిన భావోద్వేగాలతో కూడిన లేఖను పంచుకున్నారు. ఆ వీడ్కోలు సందేశంలో శ్రీదేవిని అమ్మా శ్రీదేవి అంటూ సంబోధించారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని, తల్లిదండ్రులను పోషించడానికి, కుటుంబాన్ని, బంధువులను ఉద్దరించడానికి అలుపు లేకుండా ఆమె నటనతోనే జీవితాన్ని ముగించారని అన్నారు. అనూహ్యంగా వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కెమెరాలకు కొన్నాళ్లకు దూరంగా ఉండి పోయారని, కుటుంబానికే అంకితమయ్యారని, అక్కడ కూడా ఆమె సుఖపడింది లేదని చెప్పారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఆమె నటనలోనే ఉండిపోయి జీవించడం మర్చిపోయారని, చివరకు జీవితాన్నే కోల్పోయారని చెప్పారు. ఈ జన్మకు దురుదృష్టవంతురాలైన పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు అంటూ ఆయన చివరి వీడ్కోలు సందేశాన్ని ప్రారంభించి వచ్చే జన్మలో అయినా నీ కోసం పుట్టమ్మా అని ముగించారు. దీనిని రామ్‌గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. Here’s a heartwrenchingly written tribute to Sridevi by #LakshmiBhupala pic.twitter.com/nzkWb7EFNV — Ram Gopal Varma (@RGVzoomin) 28 February 2018 -
వర్మ ‘శపథం’ నిజమేనా?
సాక్షి, సినిమా : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల టైటిల్ విషయంలో కూడా కాస్త వైవిధ్యతను ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో నాగార్జున అక్కినేనితో తెరకెక్కిస్తున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయ్యారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి శపథం అనే టైటిల్ పరిశీలనలో ఉందంట. దానికి సరిగ్గా సరిపోయేలా రివెంజ్ కంప్లీట్స్ అనే ట్యాగ్ లైన్‌ను కూడా పెట్టేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించారని.. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందని సమాచారం. మరి ఈ వార్తలపై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైరా సరీన్ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. వచ్చే నెల చివరికల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. సమ్మర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఆర్జీవీ యత్నిస్తున్నారు. -
‘దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడు’
విజయవాడ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కడప స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వర్మకు కేవలం ఫ్యాక్షన్ హత్యలు తప్ప.. రాయలసీమలోని మహానుభావులు కనిపించరా అని ప్రశ్నించారు. ఎక్కడో ముంబాయికి పారిపోయి అక్కడి నుంచి మాట్లాడటం కాదు.. దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తాను విజయవాడకు వచ్చి మాట్లాడుతున్నామని సూటిగా చెప్పారు. తన సినిమాల కోసమే అందర్నీ విలన్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో బెజవాడను రౌడీల కేంద్రంగా వర్మ చూపించారని, ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. డబ్బుల కోసమే ఎప్పుడో జరిగిన వాటిని చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉందని, పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే కడప వెబ్‌సిరీస్‌ను నిలిపి వేయాలని కోరారు. రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా చిత్రీకరించడం సరికాదన్నారు. రాంగోపాల్ వర్మ నిజంగానే తెలుగు గడ్డ పైనే పుట్టావా లేదా అనే సందేహం తలెత్తుందన్నారు. ఎదుటి వారి బాధను చూసి రాక్షస ఆనందాన్ని పొందే సైకో లాంటి వ్యక్తి రాంగోపాల్ వర్మ అని అన్నారు. రాయలసీమ చరిత్రను పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని, రాయలసీమ నుంచే రతనాల వంటి నేతలు రాజకీయాలలో రాణించారని.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారని వ్యాఖ్యానించారు. -
నాగ్-వర్మ.. ఓ కొత్త అమ్మాయి
సాక్షి, సినిమా : తన కొత్త చిత్ర హీరోయిన్ విషయంలో వస్తున్న పుకార్లకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టాడు. నాగార్జున సరసన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసినట్లు తన ఫేస్బుక్ పేజీలో అధికారికంగా ధృవీకరించాడు. ‘‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివి‘‘ అంటూ ఓ సందేశంతో స్పష్టత ఇచ్చాడు. చాలా కాలం తర్వాత నాగ్ సరసన ఓ ఫ్రెష్ ఫేస్ నటిస్తుండటం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఓ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. -
'ఆ సినిమా మా జీవితాలను కూడా మార్చేసింది'
శివ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జునల కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభమైంది. శివ సినిమా ప్రారంభమైన 28 ఏళ్ల తరువాత ప్రారంభమైన ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యం ప్రస్తుతం వర్మ ఉన్న పరిస్థితుల్లో నాగ్ లాంటి సీనియర్ హీరో ఆయనకు డేట్స్ ఎలా ఇచ్చాడన్న అనుమానం కలుగుతోంది. వరుస ఫ్లాప్ లతో వివాదాలతో వర్మ కెరీర్ దారుణంగా పడిపోయింది. అయితే ఈ సినిమాతో తనలో జ్యూస్ ఇంకా అయిపోలేదని ప్రూవ్ చేస్తానంటున్నాడు వర్మ. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు వర్మ శిష్యులు కూడా హజరయ్యారు. ఈ సినిమా పై స్పందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ' శివ మా అందరి జీవితాలను మార్చేసింది. నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో మరో సినిమా రావటం ఎంతో ఆనందంగా ఉంది. మరో బ్లాక్ బస్టర్ హిట్ రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ మా సొంత ఇళ్లులాగే అనిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు. పూరి ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నారు. Sir Shiva changed all our lives. So happy to see NAG N RGV together again. One more block buster on da way. We always feel Annapurna studio is our home. Respect n love! 🙏🏽 https://t.co/7NMGZJCIyy — PURI JAGAN (@purijagan) 20 November 2017 -
ఎన్టీఆర్ ఆత్మ రోజు నా కలలోకి వస్తోంది : వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ను నిర్ణయించినట్టుగా ప్రకటించిన వర్మ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పటికే వర్మ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ జీవితకథపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వర్మ మాత్రం మరోసారి తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తున్న వారిపై మాటలదాడి చేస్తున్నాడు. తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో చేసి కామెంట్ ఆసక్తికరంగా మారింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది'. అంటూ కామెంట్ చేశాడు వర్మ. వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను 2018 ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన
ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది. రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు.