ఈ మధ్య ఎన్‌ఎఫ్‌టీ (NFT) పదాన్ని తరచుగా వింటున్నాం. పలు సెలబ్రిటీలు ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో భారతదేశంలో ఎన్‌ఎఫ్‌టీకి క్రేజ్ పెరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సన్ని లియోన్ ఎన్‌ఎఫ్‌టీలో పెట్టుబడులు పెట‍్టడంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది.
ఎన్‌ఎఫ్‌టీ అంటే నాన్ పంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒక రకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్‌షిప్ ఇస్తారు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్‌టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్‌షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. అయితే ఎన్‌ఎఫ్‌టీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
1. అమితాబ్ బచ్చన్
బియాండ్‌లైఫ్.క్లబ్‌తో పెరుతో తన సొంత ఎన్‌ఎఫ్‌టీలను ప్రారంభించిన మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రితీ ఎంటర్‌టైన్‌మెంట్ వారి బియాండ్‌లైఫ్.క‍్లబ్, గార్డియన్‌లింగ్.ఐవోతో భాగస్వామ్యమైంది. గ్లోబల్ సెలబ్రిటీలు, ఆర్టిస్తులు, అథ్లెట్లకు వారి వారి చిత్రాలను ఎన్‌ఎఫ్‌టీలుగా (NFTs.Movie) మార్చడానికి ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ఎన్‌ఎఫ్‌టీ వేలంతో మూడు సెట్ల కలెక్షన్‌లతో లైవ్‌లోకి వెళ్లారు.
2. సన్నీ లియోన్
సన్నీ లియోన్ నాన్-ఫంగిబుల్ టోకెన్ల (NFT) మార్కెట్ ప్లేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటిగా అవతరించింది. ఈమె మిస్‌ఫిజీ పేరుతో ఎన్‌ఎఫ్‌టీ తీసుకుంది.
3. దుల్కర్ సల్మాన్
మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన చిత్రం కురుప్ కోసం గత నెలలో ఎన్‌ఎఫ్‌టీ సేల్‌ను నిర్వహించడానికి అబుదాబికి చెందిన టెక్నాలజీ కంపెనీ అంబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
4. రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్‌ఎఫ్‌టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్ చేశారు.
5. విశాల్ మల్హోత్ర
టీవీ హోస్ట్, నటుడు విశాల్ మల్హోత్ర నాన్ ఫంగిబుల్ టోకెన్ (NFT)ను ఆర్టిస్ట్ ఇషితా బెనర్జీతో కలిసి విడుదల చేశారు. అలా ఒక ఆర్టిస్ట్‌తో కలిసి విడుదల చేసిన మొదటి భారతీయ నటుడు విశాల్ మల్హోత్ర. ఈయన తన 25 ఏళ్ల బాలీవుడ్ కెరీర్‌లో ఎన్నో ప్రజాధరణ పొందిన పాత్రలు చేశారు.
వీరితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రాపర్ రాఫ్తర్, సింగర్ మికా సింగ్, యూట్యూబర్ అమిత్ బదాన ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌లోకి దిగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు, ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment