సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ (67) కూడా ఆ వైపుగా దూసుకొస్తున్నారు. తన 67వ పుట్టినరోజును పురస్కరించుకుని డిజిటల్ అవతార్ కోసం ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫారమ్ ఫాంటికోతో జత కలిసారు. తన సూపర్ కలెక్షన్‌లతో నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ)లాంచ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో తన సొంత డిజిటల్ అవతార్‌తో మెటావర్స్‌లోకి అడుగిడుతున్న తొలి భారతీయ సెలబ్రిటీగా కమల్ అవతరించ నున్నారు.
ఇటీవల బాలీవుడ్ బిగ్‌బీ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన నేపథ్యంలో కమల్ కూడా సరికొత్త ట్రెండ్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఎన్‌ఎఫ్‌టీల వేలంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పాపులర్ మెటావర్స్‌గా డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్ వెల్లడించారు.
కమల్ హాసన్ వంటి లెజెండ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో చేరడం ద్వారా తామొక ట్రెండ్ సెట్ చేయనున్నామని ఫాంటికో అభయానంద్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. లోటస్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కమల్ ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఫాంటికో గేమ్ ఆధారిత మెటావర్స్ ద్వారా అభిమానులు డిజిటల్ కమల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. అలాగే ఇలాంటి భాగస్వామ్యాల కోసం నటులు, క్రీడాకారులు ఇతర ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఫాంటికో సింగ్ చెప్పారు.
కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన అలనాటి పోస్టర్లు, ఆటోగ్రాఫ్‌లు బియాండ్‌లైఫ్.క్లబ్ నిర్వహించిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడై కోట్లు కురిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment