బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ మరో కొత్త అధ్యాయానికి తెర లేపారు. వెండితెర రారాజుగా వెలిగి బుల్లితెర మీద కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఒకప్పటి ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ ఎవరికీ అంతు చిక్కని రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రయోగాలకు వెరవసి సాహసి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి సిద్ధమయ్యారు.
Amitabh Bachchan NFT Collection : అతి త్వరలోనే అమితాబ్‌బచ్చన్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) కలెక‌్షన్ ప్రారంభించబోతున్నారు. తన ఆర్ట్ వర్క్, పర్సనల్స్‌కి సంబంధించిన కలెక‌్షన్స్‌ని ఎన్‌ఎఫ్‌టీలోకి తీసుకు వస్తున్న మొదటి ఇండియన్‌గా అమితాబ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు రితీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్న నో కోడ్ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. నవంబర్‌లో అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు వాటిని వేలంలో దక్కించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్‌కార్లును ఉపయోగించి ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు BeyondLife.Club ద్వారా వేలంలో పాల్గొనవచ్చని రితీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది.
ఎన్‌ఎఫ్‌టీ అంటే
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులు, వ్యక్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్‌నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు.
ట్రెండ్ మారుతోంది
మనకు గాంధీజి ఉపయోగించిన కళ్లజోడు, స్వామి వివేకనంద రాసిన ఉత్తరం, పికాసో వేసిన పెయింటింగ్, టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, సచిన్ వందో సెంచరీ చేసిన బ్యాట్, షారూక్‌ఖార్ వాడిన బైక్ ఇలా ప్రముఖులకు సంబంధించిన ఆర్ట్‌వర్క్ లేదా వారు ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వీటి కోసం వేలం పాటలు అక్కడక్కడా జరిగేవి. కొన్ని సార్లు ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం సెలబ్రిటీలే ముందుకు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు వేలంలో ఉంచేవారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ట్రెండ్ మారింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత తమ ఆర్ట్‌వర్క్‌లను సెలబ్రిటీలే నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్‌ఎఫ్‌టీ)గా వేలంలో ఉంచుతున్నారు.
అమితాబ్‌తో మొదలు
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పాలిగజ్ వంటి డీఫై యాప్‌లు స్టార్టప్‌లుగా ఉండగా ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం ఇండియాలో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్న అమితాబ్‌ను ఎంచుకున్నాయి. బిగ్‌బి బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకుంటూ క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీ అస్సెట్స్‌కి ఇండియాలో మార్కెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమితాబ్‌కి సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీ కలెక‌్షన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి.
మీకెం కావాలో అడగండి
గతంలో వేలం పాటలో సాధారణంగా గతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆర్ట్‌వర్క్‌ను వేలంలో ఉంచేవారు. ఈ ఎన్‌ఎఫ్‌టీలో మీకేం కావాలో అడగండి సెలబ్రిటీలు ఆ పని చేసి మీకు డిజిటల్ ఫార్మాట్‌లో మీకు మాత్రమే స్వంతం అయ్యేలా అందిస్తారంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారను. దీనిపై రితి ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ ఆరుణ్ పాండే మాట్లాడుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా సెలబ్రిటీలు, సినితారలు వేగంగా మారిపోతున్నారు. ఈ ఎన్‌ఎఫ్‌టీల ద్వారా సెలబ్రిటీలకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు వారి అభిమానులకు విలువైన ఆస్తులు అందివ్వడమే మా లక్ష్యం అని చెప్పారు. అభిమానులు ఆలస్యం చేయకుండా బిగ్ బి నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి అంటూ కోరుతున్నారు.
చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి..
Comments
Please login to add a commentAdd a comment