Black Chain Technology
-
బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లకు అండగా జీఎంఆర్ ఇన్నోవెక్స్!
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్ విభాగంలో స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ ఇన్నోవెక్స్ తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాల్లో బ్లాక్ చెయిన్ సాంకేతికత వినియోగానికి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఐడియాల్యాబ్స్, పాలిగాన్, కాయిన్ఎర్త్, ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరం, వెరోయిన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపార దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ భాగస్వాముల సహాయంతో జీఎంఆర్ ఇన్నోవెక్స్–బ్లాక్‌చెయిన్ సీవోఈ .. అంకుర సంస్థలను గుర్తించి, అవి వృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈడీ (సౌత్) ఎస్జీకే కిషోర్ తెలిపారు. -
పబ్జీకి చుక్కలే.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై కొత్త గేమ్.. ఊహించని రివార్డులు
హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ గేమింగ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు తెర తీస్తోంది. బ్లాక్ చెయిన్ , మెటావర్స్ టెక్నాలజీను అనుసంధానం చేస్తూ సరికొత్త గేమ్‌ని రూపొందించింది. ఈ గేమ్‌లో హై లెవల్స్‌కి వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను బహుమతిగా గెలుచుకోవచ్చు. ఇలా గెలుచుకున్న టోకెన్లను క్రిప్టో ఎక్సేంజీల్లో సొమ్ము చేసుకోవచ్చు. యూత్ టార్గెట్ చేసి మరీ ఈ గేమ్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన బ్లాక్ చెయిన్ స్టార్టప్ క్లింగ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాక్సే ఇన్ఫినిటీని స్ఫూర్తితో సరికొత్త గేమ్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ 2022 మార్చిలో రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత 2022 జూన్‌లో ఫుల్ వెర్షన్‌ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ గేమ్‌లో పలు స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి క్లింగ్ టోకెన్లను జారీ చేస్తారు. ఈ టోకెన్లను మనీ మార్చుకునేందుకు వీలుగా పాన్కేక్ స్వాపింగ్ డీ సెంట్రలైజ్డ్ ఎక్సేంజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు హాంగ్‌కాంగ్, కజకిస్తాన్, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లలో కూడా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇండియాలో ఎంతో ఫేమస్ పబ్జీ. ఈ గేమ్‌లో చికెన్ డిన్నర్ వంటి గిఫ్ట్‌లు, ఒకేసారి టీమ్‌లుగా అడుతూ ఛాలెంజ్‌లు బెట్టింగ్‌లు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో ఒకేసారి చాలా మంది ప్లేయర్లు కూడా ఆడొచ్చు. ఇక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసొకొచ్చే గేమ్‌లో మెటావర్స్ టెక్నాలజీని పొందు పరిచారు. దీంతో వర్చువల్ రియాల్టీలో ఒకే సారి ఎక్కువ మంది ఈ గేమ్ ఆడే వీలుంటుంది. అంతేకాదు చాలా కఠినంగా ఉండేలా గేమ్‌ని రూపొందించారు. ఈ గేమ్‌లో పై స్థాయిలకు వెళితే క్లింగ్ టోకెన్లు పొందవచ్చు. -
హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ
బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ కంపెతీ త్రయంభూలో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందని వెంచర్ క్యాపిటలిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఫండ్ రైజింగ్‌లో మొదటి విడతగా రూ.4.20 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆక్టేవ్ వెంచర్స్ అంగీకరించింది. ప్రబిర్ మిశ్ర, సురజ్ తేజా, పురు మొండానీలు త్రయంభూ స్టార్టప్‌ని 2020లో హైదరారబాద్లో ప్రారంభించారు. ఈ సంస్థ వాతవరణ మార్పులు, కార్బన్ పాయింట్స్ వంటి అంశాలపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది. వివిధ సంస్థలకు ఇచ్చే కార్బన్ పాయింట్లను ఎన్ఎఫ్టీ టోకెన్లుగా మార్చి బ్లాక్ చెయిన్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అడుగు పెట్టని చోటు ఉండదంటున్నా నిపుణులు. భారత ప్రభుత్వం సైతం డిజిటల్ కరెన్సీకి తెస్తామంటూ ప్రకటించింది. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. ఈ తరహా స్టార్టప్‌లు హైదరాబాద్‌లో నెలకొనడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. -
గోల్డ్ చెయిన్ కాదు ‘బ్లాక్ చెయిన్’.. ఇలాంటి పెళ్లి ఇండియాలో ఇదే మొదటిసారి
పూనేకి చెందిన ఓ జంట విచిత్రంగా టెక్నాలజీ పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించింది. పెళ్లి అంటే ఠక్కున గుర్తుకు వచ్చే గోల్డ్ చెయిన్‌ని పక్కన పెట్టి బ్లాక్ చెయిన్‌తో ఒక్కటయ్యారు. ఇండియాలోనే ఈ తరహా పెళ్లి జరగడం ఇదే ప్రథమం. కరోనా వచ్చాక వర్చువల్ పెళ్లిలు, ఆన్లైన్లో బంధువుల ఆశ్వీర్వాదాలు ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కానీ తాళిబొట్టు మొదలు మెట్టెలు, ఉంగరం ఇలా.. సమస్తం డిజిటల్‌మయంగా ఇండియాలో ఓ పెళ్లి జరిగింది. డిజైనర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అనిల్ నర్సిపురం, శృతి నాయర్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో 2021 నవంబరు 15న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ, పెళ్లి పది కాలాల పాటు చెక్కుచెదరకుండా ఉండేందుకు డిజిటల్ వివాహతంతును నిర్వహించారు. పూనేకి చెందిన అనిల్ నర్సిపురం, శృతినాయర్లు తమ అభిరుచికి తగ్గట్టుగా వెరైటీ పెళ్లి చేసుకున్నారు. టెక్నాలజీని అమితంగా ఇష్టపడే ఈ జంట తమకు నచ్చిన రీతిలో ఇంత వరకు ఎవరూ చూడని స్టైల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఈథెరమ్ స్మార్ట్ కాంట్రాక్టు పద్దతిని అనుసరించి ఓపెన్ సీ ఫ్లాట్‌ఫామ్‌లో పెళ్లి చేసుకున్నారు. ముందుగా శృతి తన చేతికి ధరించిన ఎంగేజ్మెంట్ ఉంగరం ఫోటోను నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా (ఎన్ఎఫ్టీ) మార్చారు. ఆ తర్వాత ఈ ఎన్ఎఫ్టీని అనిల్‌కి బ్లాక్ చెయిన్‌లో పంపించారు. ఈ ఎన్ఎఫ్టీని అనిల్ రిసీవ్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మొత్తం వ్యవహరానికి 15 నిమిషాల సమయం పట్టగా రెండు ల్యాప్‌ట్యాప్‌లు.. ఓ డిజిటల్ పురోహితుడు అవసరం అయ్యారు. బంధువులు గూగుల్ మీట్లో ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లికి పెద్దగా అంటే డిజిటల్ పురోహితుడిగా అనూప్ పక్కీ అనే ఆయన వ్యవహరించారు. ఈ బ్లాక్ చెయిన్ పెళ్లి వ్యవహారమంతా ఆయనే పర్యవేక్షించారు. ఈ వెరైటీ పెళ్లిపై ఈ జంట స్పందిస్తూ ‘ మేమిద్దరం ఒకరికొకరు తోడుగా నిలవాలి అనుకున్నాం. మమ్మల్నీ మేము అర్థం చేసుకుని జీవించాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికి ఒకరిపై ఒకరి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఊరంతా మాకు మద్దతు ఇవ్వాలని కూడా అనుకోలేదు. కలిసి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇరు కుటుంబాలను ఒప్పించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత పెళ్లి చేసుకున్నాం అని చెబుతున్నారు. చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!! -
వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట?
Elon Musk Jack Dorsey Hates Web 3.0: web3.. మనలో చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, రాబోయే రోజులు మాత్రం వెబ్3 గురించి పదే పదే వినాల్సి రావడం ఖాయం. ఎందుకంటే.. ఇది ఇంటర్నెట్లో ఓ తరం కాబట్టి. అయితే దీనిపై కొందరు టెక్ మేధావులకు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకు కారణాలేంటో తెలుసుకునే ముందు.. అసలు వెబ్3 అంటే ఏంటో చూద్దాం. టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ‘వెబ్ 1’గా పరిగణనలోకి తీసుకోకపోయినా.. జనాల్ని ఆన్లైన్లోని వెళ్లేలా చేసింది మాత్రం ఇదే. కానీ, ఆ తర్వాతి తరంలో వచ్చిన ఇంటర్నెట్కు వెబ్ 2.0 అనే పేరు అధికారికంగా వచ్చింది. 1999 నుంచి ఇది అనేక రకాలుగా యావత్ ప్రపంచం విస్తరించి కోట్ల మందిని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు దగ్గర చేసింది. ఇక మూడో తరం ఇంటర్నెట్ పేరే ‘వెబ్ 3.0’. దీనికి బీజం పడింది 2014లోనే!. నో డామినేషన్ 2014లో బ్రిటన్ కంప్యూటర్ సైంటిస్ట్ గావిన్ వుడ్ ‘ఎథెరియం’(క్రిప్టోకరెన్సీ) రూపొందించాడు. ఎథెరియం ప్రకారం.. ఇంటర్నెట్ను వికేంద్రీకరించడమే 3.0 ఉద్దేశం. అంటే.. బ్లాక్‌చెయిన్ ఆధారంగా ఇంటర్నెట్ను డీసెంట్రలైజ్డ్ చేయడం. తద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి దిగ్గజాల ఆధిపత్యం ఇంటర్నెట్లో నడవదు. ఇంటర్నెట్ యూజర్ కాస్త యజమాని అవుతాడు. ఇందులో భాగంగానే ప్రతీదానికి బ్లాక్చెయిన్స్తో ముడిపడి ఈ తరం ఇంటర్నెట్ నడుస్తోంది. టైం పట్టొచ్చు వెబ్3.0లో ఎలాంటి సేవలు వినియోగించుకోవాలన్నా.. ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఎవరూ బ్లాక్ చెయ్యరు. సేవల్ని వినియోగించుకోవడానికి తిరస్కరించరు. టోకెన్స్, క్రిప్టోకరెన్సీల ఆధారంగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఒకరకంగా వెబ్ 3.0 వల్లే క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీలు చాలా ఏళ్ల క్రితమే వాడుకలోకి రాగలిగాయన్నమాట. అయితే ఇది ఇంటర్నెట్ను చూసే తీరును మార్చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ, అందుకు చాలా టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి అని చెప్తున్నారు. ఎందుకు మెచ్చట్లేదు థర్డ్ జనరేషన్.. ఈ పదం వినడానికే టెక్ దిగ్గజాలు ఇష్టపడడం లేదు. వినడానికే దరిద్రంగా ఉందంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంతకు ముందు కామెంట్ చేశాడు. తాజాగా ‘ఎవరైనా చూశారా? నాకైతే కనిపించలేదు. జస్ట్ అదొక మార్కెటింగ్ బజ్‌వర్డ్’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ‘ఇంటర్నెట్ అనేది వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు మాత్రమే సొంతమని, జనాలు దానిని పొందలేర’ని సోమవారం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరిదే కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సహా చాలామంది అభిప్రాయమూ ఇదే. ఈ తరహా ఇంటర్నెట్ను సాధారణ పౌరులు ఉపయోగించడం కష్టమని, కాబట్టి, ఇదొక విఫలయత్నంగా అభివర్ణిస్తున్నారు. అయితే థర్డ్జనరేషన్ ఇంటర్నెట్ ద్వారా యూజర్ సులువుగా బిలియనీర్ అయిపోవచ్చు. విపరీతంగా సంపాదించొచ్చు. రిస్క్ రేటు తక్కువే. ఈ కారణం చేతనే కుళ్లుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఇక 90లో ఫోన్ల రాక సమయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అయ్యింది. కట్ చేస్తే.. పరిస్థితి ఏంటో తెలిసిందే కదా. అలా థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ కూడా సక్సెస్ అయ్యి తీరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భార్య చేసిన తప్పు.. వేల కోట్లు చెత్తపాలు! -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్‌నేమ్) 75 ఎథర్‌లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్‌ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్‌కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
డేంజరస్ సేల్స్.. ఆర్జీవీనా మజాకా ! మూవీ బిజినెస్‌లో మరో యాంగిల్
Rgv Dangerous Movie: డేంజరస్ సినిమా బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోనూ అదరగొడుతోందని దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. ఈ సినిమాను నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అందుబాటులో ఉంచగా అవన్ని హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయని ఆయన వెల్లడించారు. టోకెన్లు సోల్డ్ అవుట్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమాను ప్రపంచంలోనే తొలిసారిగా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) పద్దతిలో రిలీజ్ చేస్తున్నట్టు గత వారం ప్రకటించారు. మొత్తం ఆరు లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఐదు లక్షల టోకెన్లు వేలానికి అందుబాటులో ఉంచి సినిమా యూనిట్ దగ్గర కేవలం లక్ష టోకెన్లు ఉంచుకున్నారు. తాజాగా ఐదు లక్షల టోకెన్లు అమ్ముడైనట్టు వర్మ వెల్లడించారు. సినిమా యూనిట్ దగ్గరున్న లక్ష యూనిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. The 100,000 tokens left are for the DANGEROUS team as one can understand the details in https://t.co/bmcI4QhJQR Rest of all the 500,000 TOKENS are SOLD OUT 💐💐💐 pic.twitter.com/LEh30fIT5z — Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2021 ఏది చేసినా సంచలనమే క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. శివ మూవీతో మూవీ మేకింగ్ లెక్కలనే మార్చేసిన వర్మ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్లో సరికొత్త పంథాకు తెర లేపారు. గతంలో విష్ణుతో చేసిన అనుక్షణం సినిమాను డిస్ట్రిబ్యూషన్‌ని ఓపెన్ మార్కెట్లో ఉంచారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డేంజరస్ సినిమాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అమ్మకానికి పెట్టారు. చదవండి: ఏ సినిమా ఇండస్ట్రీ చేయని ప్రయోగం చేస్తోన్న ఆర్జీవీ..! -
Crypto Currency: గజిబిజి గందరగోళం.. ఉద్యోగాలు బోలెడు!
క్రిప్టో కరెన్సీ... ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం.ఇన్వెస్టర్లు క్రమంగా కొత్త తరహా ఆర్థిక వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పది వేల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇండియాలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పుంజుకుంటాయని దీని వల్ల దేశవ్యాప్తంగా పది వేల వరకు నూతన ఉద్యోగాలు సృష్టించడతాయని ప్రముఖ నియామకాల సంస్థ జెనో పేర్కొంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీలో పెద్దగా ఉద్యోగాలు లేవని, కానీ భవిష్యత్తు అలా ఉండబోదంటూ తెలిపింది. యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సైతం క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాయని తెలిపింది. ఇక్కడే ఎక్కువ క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో గుర్‌గ్రామ్, బెంగళూరు, ముంబైలు ప్రధాన కేంద్రాలుగా మారుతాయంటూ జోనో సంస్థ అభిప్రాయపడింది. దేశంలో క్రిప్టో కరెన్సీలో వచ్చే ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా జాబ్స్ ఈ మూడు నగరాల పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది. నైపుణ్యం తప్పనిసరి క్రిప్టో కరెన్సీలో రంగంలో భారీ వేతనంతో ఉద్యోగం పొందాలంటే సాధారణ మెలకువలు సరిపోవడని జెనో తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిర్వాహణకు అవసరమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, రిపిల్ ఎక్స్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది. క్రిప్టో కరెన్సీ కోడ్లను ఉపయోగిస్తూ గజిబిజిగా గందరగోళంగా ఓ సమాచారాన్ని క్షేమంగా, రహస్యంగా చేర్చడం లేదా భద్రపరచాడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. అదే పద్దతిలో క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2009లో తొలి క్రిప్టో కరెన్సీగా బిట్ కాయిన్ రాగా ఆ తర్వాత వందల కొద్ది బిట్కాయిల్లు చలామనిలోకి వచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు ఆవల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. చదవండి: క్రిప్టో.. కొలువుల మైనింగ్! -
Sunny Leone: మెగాస్టార్ తర్వాత సన్నీ లియోన్
అడల్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఆపై హిందీ బిగ్‌బాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్(కరణ్‌జిత్ కౌర్ వోహ్రా). మిగతా భాషల్లోనూ నటిగా, ఐటెం సాంగ్‌లతో అవకాశాలు అందిపుచ్చుకుంటోందామె. తాజాగా సన్నీ మరో ఫీట్ సాధించింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో నాన్-ఫంగిబుల్ టోకెన్స్(NFTs) వైపు అడుగులేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫిమేల్ ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఈ మధ్యే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఈ ఘనత అందుకున్న తొలి సెలబ్రిటీగా నిలిచారాయన. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆస్తుల్ని వెనకేసుకునే పనిలో ఇప్పుడు సన్నీ లియోన్(40) కూడా తలమునకలైంది. ఇందుకోసం సన్నీ లియోన్.. సిలికాన్ వ్యాలీకి చెందిన మింట్డ్రోప్జ్తో చేతులు కలపింది. ప్రత్యేక వెబ్సైట్ తన ఆర్ట్ వర్క్‌కు చెందిన ఎన్ఎఫ్టీ కలెక్షన్లను(ఈథేరియం బ్లాక్ చెయిన్) వేలం వేయనుంది. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. అలా వీటిని నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. భారత్‌లో 2021 జూన్‌లో వాజిర్ ఎక్స్.. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లో అడుగుపెట్టిన మొదటి ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ టైంలో కాన్వాస్ ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు వాళ్ల టోకెన్లను అమ్ముకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే దేశంలో అమితాబ్ బచ్చన్ కంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్ఎఫ్టీ ఘనత దక్కించుకున్నారు. కానీ, అది వ్యక్తిగతంగా కాదు. శివాజీ ది బాస్ సినిమా 14 ఏళ్ల రిలీజ్ పూర్తైన సందర్భంగా మొన్న జులైలో ఇద్దరు టీనేజర్లు.. సినిమా పేరిట ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను ప్రారంభించారు. చదవండి: ఫ్రస్టేట్ జర్నలిస్ట్ వీడియో.. జాక్‌పాట్ -
Big B Amitabh: మరో ప్రయోగం.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయనిది!
బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ మరో కొత్త అధ్యాయానికి తెర లేపారు. వెండితెర రారాజుగా వెలిగి బుల్లితెర మీద కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఒకప్పటి ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ ఎవరికీ అంతు చిక్కని రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రయోగాలకు వెరవసి సాహసి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి సిద్ధమయ్యారు. Amitabh Bachchan NFT Collection : అతి త్వరలోనే అమితాబ్‌బచ్చన్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) కలెక్షన్ ప్రారంభించబోతున్నారు. తన ఆర్ట్ వర్క్, పర్సనల్స్కి సంబంధించిన కలెక్షన్స్‌ని ఎన్ఎఫ్టీలోకి తీసుకు వస్తున్న మొదటి ఇండియన్‌గా అమితాబ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు రితీ ఎంటర్టైన్మెంట్, ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్న నో కోడ్ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. నవంబర్‌లో అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు వాటిని వేలంలో దక్కించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్కార్లును ఉపయోగించి ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు BeyondLife.Club ద్వారా వేలంలో పాల్గొనవచ్చని రితీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఎన్ఎఫ్టీ అంటే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులు, వ్యక్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. ట్రెండ్ మారుతోంది మనకు గాంధీజి ఉపయోగించిన కళ్లజోడు, స్వామి వివేకనంద రాసిన ఉత్తరం, పికాసో వేసిన పెయింటింగ్, టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, సచిన్ వందో సెంచరీ చేసిన బ్యాట్, షారూక్ఖార్ వాడిన బైక్ ఇలా ప్రముఖులకు సంబంధించిన ఆర్ట్‌వర్క్ లేదా వారు ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వీటి కోసం వేలం పాటలు అక్కడక్కడా జరిగేవి. కొన్ని సార్లు ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం సెలబ్రిటీలే ముందుకు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు వేలంలో ఉంచేవారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ట్రెండ్ మారింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత తమ ఆర్ట్‌వర్క్‌లను సెలబ్రిటీలే నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)గా వేలంలో ఉంచుతున్నారు. అమితాబ్‌తో మొదలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పాలిగజ్ వంటి డీఫై యాప్‌లు స్టార్టప్‌లుగా ఉండగా ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం ఇండియాలో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్న అమితాబ్‌ను ఎంచుకున్నాయి. బిగ్‌బి బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటూ క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్టీ అస్సెట్స్కి ఇండియాలో మార్కెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమితాబ్‌కి సంబంధించిన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మీకెం కావాలో అడగండి గతంలో వేలం పాటలో సాధారణంగా గతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆర్ట్‌వర్క్‌ను వేలంలో ఉంచేవారు. ఈ ఎన్ఎఫ్టీలో మీకేం కావాలో అడగండి సెలబ్రిటీలు ఆ పని చేసి మీకు డిజిటల్ ఫార్మాట్లో మీకు మాత్రమే స్వంతం అయ్యేలా అందిస్తారంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారను. దీనిపై రితి ఎంటర్టైన్మెంట్ ఎండీ ఆరుణ్ పాండే మాట్లాడుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా సెలబ్రిటీలు, సినితారలు వేగంగా మారిపోతున్నారు. ఈ ఎన్ఎఫ్టీల ద్వారా సెలబ్రిటీలకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు వారి అభిమానులకు విలువైన ఆస్తులు అందివ్వడమే మా లక్ష్యం అని చెప్పారు. అభిమానులు ఆలస్యం చేయకుండా బిగ్ బి నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి అంటూ కోరుతున్నారు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
ఘరానా దొంగకే చీఫ్ సెక్యూరిటీ జాబ్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి గట్టి దెబ్బ కొట్టిన వైట్ హ్యాట్ మరో సంచలనం సృష్టించాడు. ఏ చోటైతే 12 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టాడో.. తిరిగి అదే సంస్థ నుంచి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీసర్ జాబ్ సంపాదించాడు. దోపిడి చేసిన వాడికి దండన విధించే అవకాశం ఇవ్వకుండా అతని మెడలో దండలు వేయాలని ఆ కంపెనీ ఎందుకు అనుకుంటోంది. దానికి గల కారణమేంటీ ? సాక్షి, వెబ్‌డెస్క్: డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలిగాన్ డిఫై యాప్ గత వారం హ్యాకింగ్‌కు గురైంది. ఈ యాప్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ భారీ ఎత్తున దోపిడి అయ్యింది. పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా అయ్యాయి. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్ తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. మంచిదొంగ బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్‌కి పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన హ్యాకర్ మరుసటి రోజే హ్యాకర్ సానుకూలంగా స్పందించి కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని పాలినెట్‌వర్క్ డిఫై యాప్‌లో జమ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ హ్యాకర్ని వైట్హ్యాట్గా పేర్కొటోంది బాధిత పాలినెట్ వర్క్. వైట్‌హ్యాట్ సాధారణంగా హ్యాకర్లు ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. హ్యాకర్లను సూచించేందుకు నల్లటోపీ లేదా హుడీ క్యాప్ ధరించి ముఖం సరిగా కనిపించని వ్యక్తి ఇమేజ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాలక్రమేనా హ్యాకర్లకు బ్లాక్‌హ్యాట్ పేరు స్థిరపడిపోయింది. అయితే ఇందులో బాధితుల మేలు కోరి హ్యాక్ చేసే వారు కూడా ఉంటారు. వీరిని ఎథికల్ హ్యాకర్లుగా పేర్కొంటారు. ఏదైనా సంస్థకు సంబంధించి సైబర్ సెక్యూరిటీలో లోపాలను బయటపెట్టేందుకు వీరు హ్యాక్ చేస్తుంటారు. వీరిని వైట్ హ్యాట్గా పేర్కొనడం రివాజుగా మారింది. సెక్యూరిటీ చీఫ్ ప్రస్తుతం పాలినెట్వర్క్ని హ్యాక్ చేసింది ఒక్కరా లేక కొంత మంది హ్యకర్ల గ్రూపా అనే అంశంపై స్పష్టత లేదు. ఐనప్పటికీ వైట్హ్యాట్ను ఒక్కరిగానే గుర్తిస్తూ పాలినెట్ వర్క్ కబురు పంపింది. మీరు హ్యాక్ చేయడం వల్ల మా డిఫై యాప్‌లోని లోపాలు తెలిశాయి. మీలాంటి నిపుణుల అవసరం మాకు ఉంది. కాబట్టి పాలినెట్వర్క్కి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా సేవలు అందివ్వాలని కోరింది. అంతేకాదు హ్యాక్ చేసిన సొమ్ములో ఐదు మిలియన్ డాలర్లను మీ ఖర్చు కోసం అట్టే పెట్టుకుని హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలో మిగిలిన దాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. #PolyNetwork has no intention of holding #mrwhitehat legally responsible and cordially invites him to be our Chief Security Advisor. $500,000 bounty is on the way. Whatever #mrwhitehat chooses to do with the bounty in the end, we have no objections. https://t.co/4IaZvyWRGz — Poly Network (@PolyNetwork2) August 17, 2021 ఇది ఎత్తుగడా? వైట్హ్యాట్కి పాలినెట్‌వర్క్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది మంది పాలినెట్ చర్యను స్వాగతిస్తుండగా మరికొందరు హ్యాక్ అయిన సొమ్మను రాబట్టుకునేందుకు పాలినెట్‌వర్క్ వేసిన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మరికొందరు హ్యాక్ చేసిన సొమ్ము వందల మిలియన్ డాలర్లు ఉండగా హ్యాకర్‌కు జాబ్‌తో పనేంటి అంటూ స్పందిస్తున్నారు. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
మంచి దొంగలు.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా?
Hackers Returning Crypto: డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్వర్క్ హ్యాకింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. హ్యాకింగ్‌లో కొత్త రికార్డు పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌చైయిన్ ఫ్లాట్‌ఫామ్‌పై నడిచే డీఫై యాప్ పాలినెట్వర్క్ను ఇటీవల హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్ నుంచి ఏకంగా 611 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్‌వర్క్ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్‌తో బిత్తరపోయిన పాలి నెట్వర్క ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్ నెట్వర్క్ కోరింది. $260 million (As of 11 Aug 04:18:39 PM +UTC) of assets had been returned: Ethereum: $3.3M BSC: $256M Polygon: $1M The remainings are $269M on Ethereum, $84M on Polygon — Poly Network (@PolyNetwork2) August 11, 2021 హ్యాకర్ల మంచి మనసు పాలిగాన్ నెట్వర్క్ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్వర్క్ సూచించిన ఖాతాలో జమ చేశారు. కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్ వర్క్ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్ నెట్వర్క్కి తిరిగి బదిలీ చేస్తున్నారు. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ
న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్‌తో కలసి బ్లాక్ చైన్ వ్యవస్థపై పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని చెప్పారు. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి చైన్నైలో ఉద్యోగం చేస్తుంటే, రాజస్తాన్‌లో జరిగే ఎన్నికలకు చైన్నైలోనే ఓటేయవచ్చు. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. -
నకిలీ పట్టేస్తా!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం మన దేశం నుంచి ఏటా లక్షల మంది అమెరికాకు బారులు తీరుతున్నారు. అక్కడి కాలేజీల్లో ప్రవేశాలు, సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కొందరు విద్యార్థులు, యువత నకిలీ సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. దరఖాస్తుల వివరాలపై లోతుగా ఆరా తీసే క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూస్తుండటంతో, ఈ అంశంపై దృష్టి సారించాలని అమెరికా రాయబార కార్యాలయం భారత్‌కు సూచించింది. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందుకు తెలంగాణ ఐటీ శాఖ నడుం బిగించింది. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత పరిష్కారమని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డుతో పాటు, బాసర ట్రిపుల్ ఐటీలోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఐటీ శాఖ.. హైదరాబాద్ జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలను కూడా త్వరలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ జేఎన్టీయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో జేఎన్టీయూను ఎంపిక చేసినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత ఆచరణలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ ఇటీవలే ప్రకటించింది. ఇతర రంగాలకూ విస్తరణ నకిలీ సర్టిఫికెట్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, ఇతర నియామక కంపెనీల వద్ద కూడా లేదు. నకిలీల బెడద ఎదుర్కోవడంలో బ్లాక్‌చెయిన్ సాంకేతికత సమర్థంగా ఉపయోగపడుతుందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగంలో భారత్ ముందంజలో ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ బ్లాక్‌చెయిన్ స్టాండర్డ్స్ కాన్ఫరెన్స్’వెల్లడించింది. దేశంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించడమే కాకుండా ఇతర రంగాల్లోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. విద్యుత్ శాఖ లావాదేవీల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచడంతో పాటు, వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తగ్గించడం లక్ష్యంగా ‘బ్లాక్‌చెయిన్’ను వేదికగా చేసుకుని పీ2పీ (పీర్ టు పీర్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పీ2పీ బ్లాక్‌చెయిన్ వేదికను రూపొందించేందుకు అహ్మదాబాద్ ఐఐఎంతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల జీవిత కాలానికి సంబంధించిన సమాచారం (వెహికల్ లైఫ్‌టైమ్ మేనేజ్మెంట్), ఔషధాల్లో నకిలీల నివారణలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్లాక్‌చెయిన్ అంటే.. ఇంటర్నెట్ రంగానికి ఇటీవల వెన్నెముకగా మారుతున్న నూతన ఐటీ సాంకేతికత పేరు ‘బ్లాక్‌చెయిన్’. ఈ నూతన సాంకేతికత ద్వారా డిజిటల్ సమాచారాన్ని పంపిణీ చేయొచ్చు కానీ కాపీ చేయలేం. ఒక సంస్థ తన సమాచారాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో పెడుతుంది. కానీ ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని తస్కరించడం లేదా కాపీ చేయడానికి అవకాశం లేకుండా, డేటా నిర్వహణ పూర్తిగా సదరు సంస్థ అధీనంలోనే ఉంటుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్లాట్ఫారంలోని భాగస్వామి ఏదైనా సమాచారాన్ని కోరితే.. ఆ సమాచారాన్ని కలిగి ఉన్న భాగస్వామి తన డేటా బేస్‌ను పరిశీలించి సమాధానం ఇవ్వొచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఏదైనా కొత్త సాంకేతికతకు ఉన్నట్లే బ్లాక్‌చెయిన్‌కు కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయని, అయితే రాబోయే రోజుల్లో వాటిని అధిగమిస్తామని ఐటీ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
ఫేక్‌కాల్స్ నియంత్రణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్ రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌కు ఆడిట్ లావాదేవీల నిర్వహణకు -
ఫేస్బుక్ సైతం ఆ కరెన్సీని తెచ్చేస్తోంది..
టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు తెలిసింది. తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని అన్వేషిస్తున్న ఫేస్బుక్, కొత్త బ్లాక్ చెయిన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఈ టెక్నాలజీ ఆధారిత అవకాశాలను అన్వేషించే బాధ్యతల్ని వారికి అప్పగించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఫేస్బుక్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు టెక్ వెబ్సైట్ చెడార్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. క్రిప్టోకరెన్సీని లాంచ్ చేసి, బిట్‌కాయిన్ తరహాలో వర్చ్యువల్ కరెన్సీ ద్వారా పేమెంట్లు జరిపేలా అనుమతి ఇవ్వనుంది.’’ఫేస్బుక్లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని అన్వేషించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశాం’ అని ఫేస్ బుక్ మెసెంజర్ ఎగ్జిక్యూటివ్ ఇంఛార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు. ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు అన్వేషిస్తుందని కంపెనీ సైతం ప్రకటించింది. తాము ఏర్పాటు చేసిన చిన్న టీమ్ భిన్నమైన అప్లికేషన్లను అన్వేషించడంపై దృష్టి పెట్టనుందని తెలిపింది. ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది. 2018లో బ్లాక్‌చెయిన్ సొల్యూషన్లు 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 2017 కంటే ఇది రెండింతలు ఎక్కువ అని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై పనిచేసేందుకు ఫేస్బుక్ కొత్త టీమ్‌ను అభివృద్ధి చేసిందని రీకోడ్ కూడా రిపోర్టు చేసింది. న్యూ ప్లాట్‌ఫామ్స్, ఇన్ఫ్రా కింద ఈ బ్లాక్‌చెయిన్ టీమ్ వస్తోంది. దీన్ని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ నడిపించనున్నారు. ష్రోఫెర్నే ఫేస్బుక్ ఏఆర్, వీఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కార్యకలాపాలను చూసుకోనున్నారు. -
బ్లాక్‌చెయిన్ ప్రమాణాలపై ఐసీఐసీఐ కసరత్తు
ముంబై: దేశీ బ్యాంకింగ్ రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రమాణాల రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ తెలిపారు. ఇందుకోసం ఇతర బ్యాంకులు, భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. ట్రేడ్ ఫైనాన్స్‌కి సంబంధించి కొనుగోలుదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ సంస్థలు, బీమా సంస్థలు మొదలైనవన్నీ కూడా భాగస్వాములుగా ఉండే బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చందా కొచర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ రూపంలో సత్వర ఆర్థిక లావాదేవీలకు తోడ్పడే తమ బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంను ఇప్పటికే 250 కార్పొరేట్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. -
మోసాలను.. 'బ్లాక్' చేస్తుంది
సాక్షి, హైదరాబాద్: పారదర్శకతను ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇంకోలా చెప్పాలంటే దొంగ చేతికి తాళమిస్తే చోరీలు జరగవన్నట్లు ఈ టెక్నాలజీలో సమాచారం అందరివద్దా ఉంటుంది. ఎవరు మోసం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. అంటే కంపెనీ, బ్యాంకు లేదా ఏ సంస్థలోనైనా లావాదేవీల నమోదుకు ఉండే పుస్తకాలు (లెడ్జర్స్) ఉంటాయి. లెక్కలు రాసేందుకు జనరల్ లెడ్జర్, అమ్మకాల నమోదుకు సేల్స్ లెడ్జర్, కొనుగోళ్లకు సంబంధించి పర్చేసింగ్ లెడ్జర్ ఇలా ఉంటాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో అన్ని లెడ్జర్లు అందరివద్దా అందుబాటులో ఉంటాయి. టెక్నికల్ భాషలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అన్నట్లు. ఈ విభాగాల్లో దేనిలో ఏ చిన్న లావాదేవీ జరిగినా ఆ సమాచారం అందరికీ చేరుతుంది. అందరూ ఆమోదిస్తేనే ఆ లావాదేవీ ముందుకు సాగుతుంది. ఈ లావాదేవీల్లో సరుకులు అమ్మినవారితో పాటు కొనుగోలు చేసిన వారు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటారు. వారికి సంబంధించిన లావాదేవీలు ఎలా ముందుకెళ్తున్నాయో ఎప్పటికప్పుడు వీరికీ తెలుస్తుంటుంది. ఒకవేళ బ్యాంక్, కంపెనీ వాళ్లందరూ కుమ్మక్కై ఏదైనా ఫ్రాడ్ చేయాలనుకున్నా.. వీరికీ ఆ విషయం తెలిసిపోతుంది కాబట్టి చేయలేరన్నమాట! ఎవరి సృష్టి ఇది.. బిట్కాయిన్ల గురించి తెలుసు కదా..! వాటి కోసమే ఈ టెక్నాలజీ వచ్చింది. సటోషీ నకమోటో పేరుతో కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగించొచ్చని నమ్మకం. నిపుణుల అంచనా ప్రకారం.. ఇది ఇంకోరకమైన ఇంటర్నెట్. సమాచారం కోసం సామాన్యుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడో.. అచ్చం అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా అన్ని లావాదేవీలను సులువుగా ఎలాంటి మోసాలకు తావులేకుండా జరుపుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. ఒక్కో లావాదేవీ.. ఒక బ్లాక్! ఈ టెక్నాలజీ పేరు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. బ్లాక్ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీ.. అందులో భాగమైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతాయి. ఒకవేళ ఈ బ్లాక్‌లో ఉన్నవారితో ఇంకో లావాదేవీ జరిగిందనుకోండి. అది మునుపటి బ్లాక్‌కు అనుబంధంగా ఇంకో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ వరుసగా ఒక చెయిన్ మాదిరిగా ఏర్పడతాయి. మొత్తం చెయిన్‌లో దేంట్లో మార్పులు జరిగినా అది ఆ లావాదేవీ నమోదైన బ్లాక్‌లో నమోదవుతుంది. పది నిమిషాలకు ఒకసారి బ్లాక్‌లలోని వివరాలు నెట్‌వర్క్‌లో ఉండే అందరి కంప్యూటర్లలోకి చేరి లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకుంటాయి. ఏదన్నా తేడా వస్తే.. ఆ విషయాన్ని నెట్‌వర్క్‌లో ఉన్న వారందరికీ తెలియజేస్తాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తప్పులు, మోసాలకు అస్సలు ఆస్కారం ఉండదు. ప్రతిఒక్కరూ వందశాతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. – ఇయాన్ ఖాన్, టెక్నాలజీ ఫ్యూచరిస్ట్ ఆఫ్రికా, ఇండియా, తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాల్లో వ్యక్తులు కంపెనీలు, వ్యవస్థలను నమ్మడం మానేస్తున్నారు. అలాంటి చోట పరిస్థితులను పూర్తిగా మార్చేసే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. – విటాలిక్ బుటెరిన్, ఎథీరియం సృష్టికర్త ఇవి రెండు రకాలు.. పబ్లిక్ బ్లాక్ చెయిన్ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రజలకు సంబంధించిన లావాదేవీలను నమోదు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకునేవి. రెండోది ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకునేవి. ఉపయోగాలు ఇవీ... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అన్ని రంగాలకూ ఉపయోగకరమే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి ప్రభుత్వాలను నిర్ణయించే ఓటింగ్ వరకూ అన్నింటిలోనూ దీన్ని ఉపయోగించొచ్చు. ఇది పారదర్శకత, నమ్మకాన్ని కలిగిస్తుంది. మోసాలకు తావుండదు. అందరి అంగీకారంతోనే ఏ వ్యవహారమైనా నడుస్తుంది. అధికారులు, లేదా రాజకీయ పార్టీల ఇష్టాఇష్టాలతో పని లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుంచి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్టును ఉపయోగించుకుని ఆస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. సమాచార భద్రతకు ఢోకా ఉండదు. కొన్న వ్యక్తి ఎవరో.. అమ్మిన వారు ఎవరో కూడా తెలియదు. లావాదేవీలు జరిపేవారందరూ ఇక్కడ సమాన భాగస్వాములు. ఫలితంగా అధికారం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరూ దుర్వినియోగం చేసేందుకు వీలుండదు. – బుక్కపట్నం మురళి ఈ టెక్నాలజీతో బ్యాంకులే ఉండవని అంటున్నారు కానీ అది అంత నిజం కాదు. ఎందుకంటే లావాదేవీలను ధ్రువీకరించేందుకు కొంతమంది అధికారుల అవసరముంటుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చేందుకు కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. – అఖిలేష్ టుటేజా, గ్లోబల్ సెక్యూరిటీ ప్రాక్టీస్ కో లీడర్, కేపీఎంజీ -
బ్యాంకు అవసరం లేకుండానే లావాదేవీలు
► త్వరలోనే విపణిలోకి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ► అభివృద్ధి చేస్తున్న ఐడీఆర్‌బీటీ: డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సాధారణంగా బ్యాంకు కస్టమర్లు తమ లావాదేవీల కోసం బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థల వంటి థర్డ్ పార్టీ మాధ్యమాన్ని వినియోగిస్తుంటారు. అయితే బ్లాక్ చెయిన్ వేదిక ద్వారా థర్డ్ పార్టీ అవసరం లేకుండా నేరుగా కస్టమర్, సప్లయర్ అనుసంధానం అవుతారు. అంటే బ్యాంకు అవసరం లేకుండానే లావాదేవీలు జరిపే వీలుంటుంది’’ అని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి తెలిపారు. శుక్రవారమిక్కడ ఐడీఆర్‌బీటీ 13వ బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, అనలిటిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో 3 పేటెంట్ల కోసం దరఖాస్తు చేశామని తెలియజేశారు. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ మాట్లాడుతూ.. ఆర్బీఐ, ఐడీఆర్‌బీటీ, ఫిన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా కలిసి బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. హాజరుకాని కనుంగో... : వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు బి.పి.కనుంగో హాజరు కావాల్సి ఉంది. ఆయన రాకపోవటంతో ఆయన పంపిన సందేశాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ గణేష్ కుమార్ చదివి వినిపించారు. ‘‘సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించి.. మోసాలకు పాల్పడటం పెరుగుతున్నట్లు కనుంగో తన సందేశంలో అభిప్రాయపడ్డారు. ఈ–మెయిళ్లు, మెసేజ్‌ల ద్వారా వచ్చే ఆయాచిత అభ్యర్థనలను స్వీకరించడం, స్పందించడం పెరగడమే ఇందుకు కారణమన్నారు. బ్యాంకులు తమ ఐటీ వ్యవస్థను భద్రతకు తగిన ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానంపై బ్యాంకులు వినియోగదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయని అయినా సైబర్ దాడులను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నామన్నారు. తెలివైన మోసగాళ్లు, సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ రెండు కారణాలే ఇందుకు కారణమని వివరించారు.