
బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ కంపెతీ త్రయంభూలో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందని వెంచర్ క్యాపిటలిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఫండ్ రైజింగ్‌లో మొదటి విడతగా రూ.4.20 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆక్టేవ్ వెంచర్స్ అంగీకరించింది.
ప్రబిర్ మిశ్ర, సురజ్ తేజా, పురు మొండానీలు త్రయంభూ స్టార్టప్‌ని 2020లో హైదరారబాద్‌లో ప్రారంభించారు. ఈ సంస్థ వాతవరణ మార్పులు, కార్బన్ పాయింట్స్ వంటి అంశాలపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది. వివిధ సంస్థలకు ఇచ్చే కార్బన్ పాయింట్లను ఎన్‌ఎఫ్‌టీ టోకెన్లుగా మార్చి బ్లాక్ చెయిన్ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహిస్తోంది.
భవిష్యత్తులో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అడుగు పెట్టని చోటు ఉండదంటున్నా నిపుణులు. భారత ప్రభుత్వం సైతం డిజిటల్ కరెన్సీకి తెస్తామంటూ ప్రకటించింది. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. ఈ తరహా స్టార్టప్‌లు హైదరాబాద్‌లో నెలకొనడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment