Venture Capital Fund
-
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ
బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ కంపెతీ త్రయంభూలో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందని వెంచర్ క్యాపిటలిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఫండ్ రైజింగ్‌లో మొదటి విడతగా రూ.4.20 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆక్టేవ్ వెంచర్స్ అంగీకరించింది. ప్రబిర్ మిశ్ర, సురజ్ తేజా, పురు మొండానీలు త్రయంభూ స్టార్టప్‌ని 2020లో హైదరారబాద్లో ప్రారంభించారు. ఈ సంస్థ వాతవరణ మార్పులు, కార్బన్ పాయింట్స్ వంటి అంశాలపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది. వివిధ సంస్థలకు ఇచ్చే కార్బన్ పాయింట్లను ఎన్ఎఫ్టీ టోకెన్లుగా మార్చి బ్లాక్ చెయిన్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అడుగు పెట్టని చోటు ఉండదంటున్నా నిపుణులు. భారత ప్రభుత్వం సైతం డిజిటల్ కరెన్సీకి తెస్తామంటూ ప్రకటించింది. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. ఈ తరహా స్టార్టప్‌లు హైదరాబాద్‌లో నెలకొనడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. -
దూసుకెళ్తున్న దేశీయ స్టార్టప్ సంస్థలు
దేశీయ స్టార్టప్ సంస్థలు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకెళ్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు జనవరి-జూలై 2021 మధ్య కాలంలో దేశీయ స్టార్టప్ సంస్థలలో మొత్తం 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టారు. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2019లో స్టార్టప్ సంస్థలు ఆకర్షించిన 11.1 బిలియన్ డాలర్లు, 2020లో ఆకర్షించిన 13 బిలియన్ డాలర్ల కంటే ఈ ఏడాదిలో చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఉడాన్, లెన్స్ కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫామ్ ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జీటా, క్రెడ్, రేజర్ పే, హెల్తీఫైమీ, బైజుస్, అన్ అకాడమీ, ఎరుడిటస్, వేదాంతు, డుంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్, ఎంట్రోపిక్ వంటి సంస్థలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. "ఎఐ/ఎంఎల్, ఎడ్ టెక్, ఫుడ్ టెక్ సంస్థలలో ఈ సంవత్సరం చివరి అర్ధభాగంలో ఎక్కువ మొత్తం ఒప్పందాలు జరగనున్నట్లు" ఐవీసీఏ తెలిపింది. సగటు వెంచర్ క్యాపిటలిస్ట్ ఒప్పందం విలువ 2019-20తో పోలిస్తే 2021లో పెరిగినట్లు నివేదిక తెలిపింది.(చదవండి: ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట.. ఆ ఛార్జీలపై జీఎస్టీ ఉండదు) -
2020లోనూ స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు దేశీయంగా గతేడాది భారీ పెట్టుబడులను తీసుకువచ్చాయి. తద్వారా 7,000కు పైగా స్టార్టప్‌లకు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చాయి. బెయిన్ అండ్ కంపెనీస్ తాజాగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ నివేదిక వెల్లడించిన వివరాలివి. నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. వీసీ పెట్టుబడుల్లో అత్యధిక శాతాన్ని కన్జూమర్ టెక్, ఎస్ఏఏఎస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు పొందాయి. వెరసి ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసీ సంస్థల నుంచి 75 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో కన్జూమర్ టెక్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం! దేశీ ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వీసీ అసోసియేషన్(ఐవీసీఏ) భాగస్వామ్యంతో రూపొందిన నివేదిక ప్రకారం.. డిజిటల్ ట్రెండ్‌పై కోవిడ్-19 ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. ఫలితంగా వివిధ రంగాలలో డిజిటల్ ఆధారిత బిజినెస్‌లకు వీసీ నిధులు అధికంగా ప్రవహించేందుకు దారి ఏర్పడింది. డీల్స్ ఎక్కువే కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలోనూ వీసీ పెట్టుబడులు కొనసాగడం గమనార్హమని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2019లో దేశీయంగా 755 డీల్స్ ద్వారా 11.1 బిలియన్ డాలర్లను వీసీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2020లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ డీల్స్ సంఖ్య 810కు పెరిగింది. ఇందుకు సగటు డీల్ పరిమాణం తగ్గడం కారణమైనట్లు నివేదిక తెలియజేసింది. గతేడాది పలు సవాళ్లు ఎదురైనప్పటికీ పెరిగిన డీల్ పరిమాణం దేశీ స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను ప్రతి ఫలిస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్త స్టార్టప్ వ్యవస్థల్లో టాప్-5లో ఒకటిగా భారత్ కొనసాగిన ట్లు నివేదిక తెలియజేసింది. 2020లోనూ 7,000 స్టార్టప్‌లు ఊపిరిపోసుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా నివేదిక ప్రకారం గతేడాదిలో 12 స్టార్టప్‌లో కొత్తగా యూనికార్న్ హోదాను సాధించాయి. తద్వారా యూనికార్న్ హోదాను పొందిన సంస్థల సంఖ్య 37ను తాకింది. వెరసి యూఎస్, చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇది దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన 1.10 లక్షలకుపైగా స్టార్టప్‌లలో ప్రస్తుతం 9 శాతం వరకూ నిధులను పొందాయి. అంటే మరిన్ని పెట్టుబడులకు అవకాశముంది. 2019ను మినహాయిస్తే గతేడాది గరిష్ట స్థాయిలో స్టార్టప్‌లకు వీసీ నిధులు లభించాయి. కొన్ని వినూత్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి. దీంతో పలు చిన్న డీల్స్‌కు తెరలేచింది. భవిష్యత్‌లోనూ మరిన్ని వీసీ పెట్టుబడులకు వీలున్నదని నివేదికకు సహరచయితగా సేవలందించిన బెయిన్ అండ్ కంపెనీ నిపుణులు శ్రీవాస్తవన్ కృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు! -
ఓబీసీలకు రూ. 200 కోట్లతో ఫండ్
సాక్షి,న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018–19లో సమకూర్చనుంది. మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు. ఆదాయ పరిమితి పెంపు: ఓబీసీ ప్రీమెట్రిక్ సాల్కర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతమున్న వార్షికాదాయ పరిమితిని రూ. 44,500 నుంచి రూ. 2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచింది. డేస్కాలర్లకు స్టైఫండ్‌ను రూ. 225కు, హాస్టల్లో ఉండేవారికి రూ. 525కు పెంచింది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. స్టైపండ్‌ను స్థానిక విద్యార్థులకు రూ. 2,000కు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు రూ.5,000కు పెంచింది. డేస్కాలర్లకు ఒకటి నుంచి పది వరకు అన్ని తరగతులకు ఒకేలా రూ. 100 ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఇకపై మూడు నుంచి పది వరకు అన్ని తరగతులకు రూ. 500 ఇవ్వనున్నారు. షెడ్యూలు కులాల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ కింద సాయాన్ని రూ. 28 వేలకు పెంచారు. -
స్టార్టప్స్ కోసం సిడ్బి వెంచర్ క్యాపిటల్ ఫండ్
న్యూఢిల్లీ: చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ప్రత్యేకంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 10,000 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్ ద్వారా స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధులను సిడ్బి సమకూరుస్తుంది. నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) రాజీవ్ ప్రతాప్ రూడి రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. స్టార్టప్ కంపెనీలు మరింతగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిడ్బి పెట్టుబడులు తోడ్పడతాయి.