దేశీయ స్టార్టప్ సంస్థలు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకెళ్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు జనవరి-జూలై 2021 మధ్య కాలంలో దేశీయ స్టార్టప్ సంస్థలలో మొత్తం 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టారు. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2019లో స్టార్టప్ సంస్థలు ఆకర్షించిన 11.1 బిలియన్ డాలర్లు, 2020లో ఆకర్షించిన 13 బిలియన్ డాలర్ల కంటే ఈ ఏడాదిలో చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి.
ఉడాన్, లెన్స్ కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫామ్ ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జీటా, క్రెడ్, రేజర్ పే, హెల్తీఫైమీ, బైజుస్, అన్ అకాడమీ, ఎరుడిటస్, వేదాంతు, డుంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్, ఎంట్రోపిక్ వంటి సంస్థలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. "ఎఐ/ఎంఎల్, ఎడ్ టెక్, ఫుడ్ టెక్ సంస్థలలో ఈ సంవత్సరం చివరి అర్ధభాగంలో ఎక్కువ మొత్తం ఒప్పందాలు జరగనున్నట్లు" ఐవీసీఏ తెలిపింది. సగటు వెంచర్ క్యాపిటలిస్ట్ ఒప్పందం విలువ 2019-20తో పోలిస్తే 2021లో పెరిగినట్లు నివేదిక తెలిపింది.(చదవండి: ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు)
Comments
Please login to add a commentAdd a comment