క్రిప్టో కరెన్సీ... ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం.ఇన్వెస్టర్లు క్రమంగా కొత్త తరహా ఆర్థిక వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పది వేల ఉద్యోగాలు
రాబోయే రోజుల్లో ఇండియాలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పుంజుకుంటాయని దీని వల్ల దేశవ్యాప్తంగా పది వేల వరకు నూతన ఉద్యోగాలు సృష్టించడతాయని ప్రముఖ నియామకాల సంస్థ జెనో పేర్కొంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీలో పెద్దగా ఉద్యోగాలు లేవని, కానీ భవిష్యత్తు అలా ఉండబోదంటూ తెలిపింది. యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సైతం క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాయని తెలిపింది.
ఇక్కడే ఎక్కువ
క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో గుర్‌గ్రామ్, బెంగళూరు, ముంబైలు ప్రధాన కేంద్రాలుగా మారుతాయంటూ జోనో సంస్థ అభిప్రాయపడింది. దేశంలో క్రిప్టో కరెన్సీలో వచ్చే ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా జాబ్స్ ఈ మూడు నగరాల పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.
నైపుణ్యం తప్పనిసరి
క్రిప్టో కరెన్సీలో రంగంలో భారీ వేతనంతో ఉద్యోగం పొందాలంటే సాధారణ మెలకువలు సరిపోవడని జెనో తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిర్వాహణకు అవసరమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, రిపిల్ ఎక్స్ డెవలప్‌మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది.
క్రిప్టో కరెన్సీ
కోడ్‌లను ఉపయోగిస్తూ గజిబిజిగా గందరగోళంగా ఓ సమాచారాన్ని క్షేమంగా, రహస్యంగా చేర్చడం లేదా భద్రపరచాడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. అదే పద్దతిలో క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2009లో తొలి క్రిప్టో కరెన్సీగా బిట్ కాయిన్ రాగా ఆ తర్వాత వందల కొద్ది బిట్‌కాయిల్‌లు చలామనిలోకి వచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు ఆవల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి.
చదవండి: క్రిప్టో.. కొలువుల మైనింగ్!
Comments
Please login to add a commentAdd a comment