
ఆర్‌ఆర్‌ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఆ చిత్రాన్ని సర్కస్‌తో పోల్చాడు. ముఖ్యంగా ఆ సినిమాలో బ్రిడ్జ్ దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ సర్కస్ చేస్తున్నట్లు అనిపించిందన్నారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చూస్తే అలాంటి భావననే కలిగిందన్నారు.
(చదవండి: మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు)
ఇక మణిరత్నం గురించి అడగ్గా.. ఆయన చిత్రాలేవి తనకు నచ్చవని చెప్పారు.‘మణిరత్నానికి నా సినిమాలేవి నచ్చవు. నాకు కూడా ఆయన చిత్రాలు నచ్చవు. ఒక్కసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కూర్చొన్నాం. నా మాట ఆయన వినలేదు.. ఆయన మాట నేను వినలేదు. చివరకు సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. అవి ‘దొంగ దొంగా’, ‘గాయం’. ఈ రెండు సినిమాల్లో మా ఇద్దరి పేర్లు వేసుకున్నాం’అనీ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో కమ్యూనిష్టు భావాజలాన్ని కలిగి ఉండేవాడిననని.. కానీ అయాన్ ర్యాండ్ పుస్తకాలు చదివినప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందన్నారు. ఫెమినిజం అంటే స్త్రీలకోసం పోరాడటం కాదని.. స్త్రీలను ప్రేమించడం అని చెప్పాడు. తన కెరీర్‌లో ‘క్షణక్షణం’, ‘సర్కార్’చిత్రాలకే సరిగ్గా స్క్రిప్ట్ రాసి, సరైన నటీనటులను ఎంచుకున్నానని, మిగిలిన చిత్రాలన్ని ఫలానా హీరోతో చేయాలని అనుకోలేదని ఆర్జీవీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment