![Amrutha File Petition Against RGV Over Murder Movie - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/4/AMRUTHa.jpg.webp?itok=CenDRYFx)
సాక్షి, నల్లగొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం... ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అమృత. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల)
అమృత పిటిషన్‌ను న్యాయస్థానం.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్స్అప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment