pition
-
అవి చూసే ఫెయిలయ్యా: 75 లక్షలకు ప్లాన్, సుప్రీం రియాక్షన్
న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో అసభ్యకరమైన కంటెంట్ ప్రకటనల కారణంగా తన దృష్టి మళ్లిందని తదర్వారా పరీక్షలో ఫెయిల్ అయ్యానని దాఖలైన పిటీషన్‌పై సీరియస్‌గా స్పందించింది. "ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇదొకటి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రకమైన పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాతు పిటీషనర్‌కు భారీ జరిమానా కూడా విధించింది. దీంతో పిటీషనర్ లబోదిబోమన్నాడు. వివరాలను పరిశీలిస్తే..గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో వచ్చిన అశ్లీల ప్రకటనల కారణంగా తాను పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్కాలేక, ఎగ్జామ్ ఫెయిలయ్యానని ఇందుకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఆనంద్ కిషోర్ చౌదరి అనే ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ పోలీసు పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో తమ దృష్టిని మరల్చేలా లైంగిక, అసభ్యకరమైన యాడ్స్ చూపించారంటూ ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. నచ్చకపోతే యాడ్స్ చూడకండి, వాటిని చూడాలా వద్దా అనేమీ మీ హక్కు అని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని, క్షమించి జరిమానా తగ్గించాలని వాపోవడంతో కోర్టు కనికరించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ధర్మాసనం మందలించింది.జరిమానా తగ్గిస్తాం కానీ క్షమించ లేమంటూ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని అతగాడిని ఆదేశించింది. -
ఆ అర్హత ఆయనకు లేదు : బిగ్‌బీకి ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన వాయిస్ బంగారానికి తావి అబ్బిందా అన్నట్టుగా అతికిపోతుంది. అలనాటి ‘దో బూంద్ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్ యాడ్ నుంచి, ఈనాటి కరోనా వైరస్ కాలర్ ట్యూన్ వరకూ ఆయన వాయిస్ విన్నవారెవ్వరైనా బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు. అయితే ఇపుడు అమితాబ్ గళమే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే కరోనా కాలర్‌ట్యూన్ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్ గొంతును ఆ కాలర్‌ట్యూన్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాలర్ ట్యూన్లో జాగ్రత్తలు బోధిస్తున్న అమితాబ్ స్వయంగా కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా అరోపించారు. అంతేకాదు రెమ్యూనరేషన్ తీసుకొని వాయిస్ చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎంతో మంది కరోనా యోధులతోపాటు, సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని పేర్కొన్నారు. అమితాబ్ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడని, ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆరోపించడం గమనార్హం. మరోవైపు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్.పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం విచారించింది. -
ట్రంప్‌కు సుప్రీం షాక్.. ఆధారాల్లేవ్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగికరించకుండా మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్లు వేసిన ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం తాజాగా కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు ఆధారాలేవి లేవని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్‌కు వేరేదారి లేదని ఆయన ఓటమిని అంగీకరించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికపై తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎల్లుండి ఎలక్టోరల్ కాలేజీ డిసెంబర్ 14న సమావేశమై తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. దీంతో డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎలక్రోలర్ ప్రకటించినున్నట్లు స్పష్టమవుతుంది. (చదవండి: వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం) అయితే పిటిషన్లో.. అమెరికాలోని నాలుగు ప్రముఖ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, విస్కాన్సిన్లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని, ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ రిపబ్లికన్లు కోర్టులో పిటిషన్ వేశారు. కావునా అక్కడి ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలంటూ టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను 126 మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు, 17 మంది అటార్నీ జనరళ్లు కలిసి ఈ పిటిసన్‌ను దాఖలు చేశారు. (చదవండి: ట్రంప్‌కు మరో పరాజయం) -
చందా కొచర్‌కు మరోసారి నిరాశ
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముంబైలోని తలోజా జైలులో ఉండగానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే కోలుకున్న తరువాత ఆందోళనలో ఉన్న కొచర్‌ను మరింత మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్యా తోసిపుచ్చారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్విడ్ ప్రో కో కింద వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1875 కోట్ల రూపాయల రుణాలను అక్రమ మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
కోర్టు బోనులో చేప !
సాక్షి, హన్మకొండ: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆరేళ్లుగా వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లల పంపిణీపై ఈ ఏడాది రాజకీయ నీడ పడింది. నిబంధనలకు లోబడి టెండర్లు దాఖలు చేయలేదని పేర్కొంటూ అన్ని టెండర్లను మత్స్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉచిత చేప పిల్లల విషయమై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒకే సంస్థ ఉండడంతో. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలతో పాటు సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకే సంస్థ బాధ్యులు ఉచిత చేపపిల్లల పంపిణీకి టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతోనే టెండర్లను రద్దు చేసినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. సదరు సంస్థకు దాదాపు దశాబ్దకాలంగా చేపపిల్లల పంపిణీలో అనుభవం ఉన్నా ఈ ఏడాది మాత్రమే టెండర్లను రద్దు చేయడం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక సంస్థ మాత్రమే నిబంధనలకు లోబడి ఉండగా, మిగతా మూడు సంస్థలను సాంకేతిక కమిటీ పరిశీలన తర్వాత పక్కన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నట్లు చెబుతున్న ఓ సీడ్ సంస్థ బాధ్యులు ఇక్కడే కాకుండా సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల్లో సైతం టెండర్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏ అధికారం లేనప్పటికీ అనేక ఏళ్లుగా సదరు సంస్థ బాధ్యులు కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు కొందరు ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చివరకు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సదరు సంస్థను కూడా బరి నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికి నిబంధనలను సాకుగా చూపెట్టారని మత్స్యశాఖ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మా వద్ద తనిఖీకి రాలేదు... నిబంధనలకు లోబడి టెండర్లు వేసినా రద్దు చేయడంతో అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొండా సుస్మితాపటేల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తమ సంస్థ సీడ్ ప్లాంట్ వద్దకు అధికారులెవరూ తనిఖీకి రాలేదని న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఫిషింగ్ సీడ్ ఫాంలో సుమారు దశాబ్దకాలం అనుభవం కలిగిన తమ సంస్థ టెండర్‌ను రాజకీయ దురుద్దేశంతోనే రద్దు చేశారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు మత్స్యశాఖ అధికారుల తీరును తప్పుపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి సదరు సంస్థ టెండర్లను పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం కాగా, ఉమ్మడి వరంగల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కోర్టు ఆదేశాలతో తిరిగి టెండర్లు పిలవాలా, గతంలో దాఖలైన టెండరుదారుల నుంచి ఒకరిని ఎంపిక చేయాలా అనే విషయమై అధికారులు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. అందులో ఒకరి టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండగా, మిగిలిన మూడు సంస్థలను సాంకేతిక కమిటీ నిపుణులను తోసిపుచ్చారు. ప్రభుత్వం ఈనెల 6నుంచి చేపపిల్లలను పంపిణీ చేయాలని సూచించింది. కానీ ఇక్కడ టెండర్లు కూడా ఖరారు కాని విషయాన్ని మత్స్యశాఖ కమిషనర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి టెండర్లు పిలవాలా లేక ఏం చేయాలనే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అక్కడి నుంచి అందే ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – డాక్టర్ టి.విజయభారతి, మత్స్యశాఖ అధికారి, వరంగల్ అర్బన్ -
వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమైన అమృత
సాక్షి, నల్లగొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం... ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అమృత. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) అమృత పిటిషన్‌ను న్యాయస్థానం.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్స్అప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. -
ఒక్క రూపాయి అప్పుందని...
చెన్నై : వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం దాటిపోయే బడాబాబులను ఏమి చేయలేని బ్యాంకులు సామాన్యులను మాత్రం పీడించుకు తింటాయి. బ్యాంకు అధికారుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. కేవలం రూపాయి.. ఒకే ఒక్క రూపాయి బకాయి ఉన్నాడనే నేపంతో దాదాపు 3.50 లక్షల రూపాయల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఓ వ్యక్తిని వేధిస్తున్నారు బ్యాంకు అధికారులు. దాంతో లాభంలేదని భావించిన బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్లో ఉన్న వివరాల ప్రకారం.. కాంచీపురం సెంట్రల్ కో - ఆపరేటివ్ బ్యాంక్, పల్లవరం శాఖలో సీ. కుమార్ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2010, ఏప్రిల్ 6న 131 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి 1. 23 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మరో 138 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు దఫాల్లో మరో 1.65 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. 2011, మార్చి 28న తొలిసారి తీసుకున్న రుణాన్ని వడ్డితో సహా చెల్లించి, 131 గ్రాముల బంగారు ఆభరణాలను విడిపించుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత రెండో సారి తీసుకున్న మొత్తం 1.65 లక్షల రూపాయల రుణాన్ని కూడా చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా బ్యాంకు అధికారులు కుమార్ గ్యారంటీగా పెట్టిన బంగారు ఆభరణాలను అతనికి తిరిగి ఇవ్వలేదు. అంతేకాక రెండు ఖాతాల్లో చెరో రూపాయి రుణం అలానే ఉంది అని చెప్పారు. రూపాయి రుణం చెల్లిస్తాను నా బంగారాన్ని నాకు ఇవ్వండి అని బ్యాంకు అధికారులను కోరాడు కుమార్. అందుకు బ్యాంకు అధికారులు రూపాయిని తీసుకోవడం కుదరదు అని చెప్పి, అతని ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదు. కుమార్ బ్యాంక్‌లో గ్యారెంటీగా ఉంచిన బంగారు ఆభరణాల ప్రస్తుత విలువ 3.50 లక్షల రూపాయలు. ఈ ఆభరణాలను పొందేందుకు కుమార్ దాదాపు దాదాపు ఐదు సంవత్సరాలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ బ్యాంకు అధికారుల మాత్రం స్పందించడం లేదు. దీంతో సహనం కోల్పోయిన కుమార్ తన ఆభరణాలను తనకు ఇచ్చేవిధంగా బ్యాంకుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ గత శుక్రవారం విచారణకొచ్చింది. ఈ సందర్భంగా కుమార్ వాదనలను కోర్టు రికార్డు చేసింది. అంతేకాక కుమార్ తరుపు ప్రభుత్వ న్యాయవాది సత్యనాధన్‌కు రెండు వారాల్లోగా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తన ఆభరణాలు పోయుంటాయని, అందుకే అధికారులు రుణం చెల్లించిన తర్వాత కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు కుమార్. -
సల్మాన్ పిటిషన్‌పై వాదనలు వాయిదా
ముంబై : హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అప్పీలుపై వాదనలు జూలై 1వ తేదీకి వాయిదా పడ్డాయి. ముంబై హైకోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మద్యం సేవించి, నిర్లక్ష్యంగా కారు నడిపి ముంబైలో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. అయిదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ మే 6 వ తేదీన జస్టీస్ డీడబ్ల్యూ దేశ్ పాండే తుది తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసుకున్న పిటిషన్ సందర్భంగా సల్మాన్ కేసుకు సంబంధించిన పేపర్లు కాలిపోయాయనే వార్తలు వివాదాన్ని రేపాయి. జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ కేసు నిష్పక్షిక విచారణపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.