వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగికరించకుండా మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్‌లు వేసిన ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం తాజాగా కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు ఆధారాలేవి లేవని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్‌కు వేరేదారి లేదని ఆయన ఓటమిని అంగీకరించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికపై తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎల్లుండి ఎలక్టోరల్ కాలేజీ డిసెంబర్ 14న సమావేశమై తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. దీంతో డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎలక్రోలర్ ప్రకటించినున్నట్లు స్పష్టమవుతుంది. (చదవండి: వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం)
అయితే పిటిషన్‌లో.. అమెరికాలోని నాలుగు ప్రముఖ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, విస్కాన్సిన్‌లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని, ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ రిపబ్లికన్‌లు కోర్టులో పిటిషన్ వేశారు. కావునా అక్కడి ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలంటూ టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను 126 మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు, 17 మంది అటార్నీ జనరళ్లు కలిసి ఈ పిటిసన్‌ను దాఖలు చేశారు. (చదవండి: ట్రంప్‌కు మరో పరాజయం)
Comments
Please login to add a commentAdd a comment