వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన | Ram Gopal Varma never forced to do the Song in 'Ice Cream2' | Sakshi
Sakshi News home page

వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన

Published Thu, Sep 18 2014 9:00 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన

వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన

ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు

ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది. 
 
రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement