
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు నమోదు చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తానికి సినిమాను అమ్మేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రయూనిట్ ఖండించారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment