
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న రిలీజ్ అంటూ ప్రకటించేశాడు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ కాస్త ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ రావటంతో సినిమాకు అదే స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. అందుకే పెద్ద పోటి లేని సమయంలో రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు దొరకటంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయన్న ఆలోచనలో ఉన్నారట లక్ష్మీస్ ఎన్టీఆర్ టీం.
మార్చి 22న ప్రేమకథా చిత్రం 2తో పాటు అల్లు శిరీష్ ఏబీసీడీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను వారం ముందుగానే మార్చి 15న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. ముందుగా రిలీజ్ చేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment