
RGV Bold Interview With Ashu Reddy: వివాదాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్లు కూడా యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా మారుతుంటారు. ఆ మధ్య బోల్డ్ బ్యూటీ అరియానా, వర్మల చిట్‌చాట్ నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. నేడు(సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇందులో అషూ కాఫీ షాపులో కూర్చుని ఫోన్‌లో బిజీగా ఉండగా వర్మ ఆమె దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే ఆర్జీవీ ఎవరో తెలీదన్నట్లు నటించింది అషూ. ఇంతలో నీ థైస్ బాగున్నాయ్ అని వర్మ నిర్మొహమాటంగా కాంప్లిమెంట్ ఇచ్చాడు. దీంతో ఆవేశం ఉప్పొంగుకొచ్చిన అషూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఇంతటితో ప్రోమో పూర్తైంది. మరి వర్మ ఈ చెంపదెబ్బపై ఎలా రియాక్ట్ అయ్యాడనేది తెలియాలంటే సెప్టెంబర్ 7న రిలీజయ్యే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment