
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల పరంగా సమంత మరింత స్పీడు పెంచారు. వరుసగా ప్రాజెక్ట్స్ సంతకం చేయడమే కాకుండా రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచారు. ఇవే కాకుండా పలు ఈవెంట్స్‌కు కూడా ఆమె స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఇలా విడాకుల బాధ నుంచి బయట పడేందుకు సామ్ కూడా తన షెడ్యూల్ బిజీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది.
చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్
ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ ఈవెంట్‌లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఇక వ్యాఖ్యాతగా సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయిను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment