
పటేల్, అంబేడ్కర్ తరువాత మోదీనే!
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోదీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చారు. అంబేడ్కర్, పటేల్‌లు సామాజిక, భౌగోళిక ఏకీకరణకు పాటుపడితే మోదీ ఆర్థిక సంఘటితానికి కృషిచేస్తున్నారన్నారు. ఆదివారం 67వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధానిపై అమిత్ షా ప్రశంసల జల్లు కురిపిస్తూ...‘మోదీ జీవితం మన దేశ స్ఫూర్తికి చిహ్నం.
పేదల పరిస్థితిని అర్థం చేసుకుని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సామాజిక అసమానతలు రూపుమాపడానికి కృషిచేసిన అంబేడ్కర్‌ను దేశం మరవదు. అలాగే, జన్‌ధన్ యోజన నుంచి జీఎస్టీ వరకు చేపట్టిన చర్యల వల్ల మోదీ ఆర్థిక సంఘటితానికి బాటలు వేస్తున్నారు’ అని తన బ్లాగులో పేర్కొన్నారు.