మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: జిల్లా నుంచి పోలియోను తరిమికొట్టాలని, రెండే రెండు పోలియో చుక్కలు వేయించి, చిన్న పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడేలా చేద్దామని కలెక్టర్ గిరిజాశంకర్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆది వారం ఆయన జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు. రామయ్యబౌళి ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు చుక్కల మందు వేసి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా చుక్కల మందు వేయించేందుకు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విడత పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 4.96 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 3057 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర ప్రయాణ పాంతాల్లో కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేం దుకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఏజేసీ పి.రాజారాం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రుక్మిణమ్మ, డీఐఓ రంగాపూర్, సహాయ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బాలజీ, రామాంజనేయులు, రవిశంకర్, డా.రఫిక్, ఏజో కొమ్ములయ్య, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు లయన్ నటరాజ్, సత్తూర్ రాములుగౌడ్, డా.రజిని,తదితరులు పాల్గొన్నారు.
పల్స్ పోలియోను ఉద్యమంలా చేపట్టాలి
గద్వాల టౌన్: ఐదేళ్లలోపున్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయాలని, ఉద్యమంలో ఈ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దూద్ దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రా న్ని మంత్రి డీకే అరుణ సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలను వేశా రు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు మందు తప్పనిసరిగా వేయిం చాలని సూచించారు. పోలియోపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బీఎస్ కేశవ్, బం డల వెంకట్రాములు, రామంజనేయు లు, తదితరులు పాల్గొన్నారు.
పోలియోను తరిమికొడదాం
Published Mon, Jan 20 2014 4:25 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement