polio drops
-
పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్‌కు తెలుసు : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: పేద కుటుంబాల కడుపు నింపడమే కాంగ్రెస్ పార్టీకి తెలుస ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను పార్టీ గు ర్తుంచుకుంటుందన్నారు. పదవులు పొందిన నాయకులు ప్రజ లకు సేవ చేయాలన్నారు. బోథ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్ర మాణస్వీకార కార్యక్రమం మండలకేంద్రంలోని పరిచయ గార్డెన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. పేద కుటుంబా లను ఆర్థికంగా ఆదుకునే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ గెలిపించాలన్నారు. బోథ్ రెవెన్యూ డివిజన్, ఫైర్‌స్టేషన్ ఏ ర్పాటు, సొనాల మండలంలో నూతన కార్యాలయాలు, కొత్త పో స్టుల మంజూరు కోసం కేబినెట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాట్లాడుతూ.. ప్రజల్లో ఉంటేనే పార్టీ అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకు తానే ఉదాహరణ అని అన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మా ట్లాడుతూ, రైతుల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముందుగా జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ నూత న పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, తెలంగాణ కాంగ్రెస్ కి సాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, బజార్హత్నూర్ జెడ్పీటీసీ నర్సయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్రెడ్డి, మహమూద్‌ఖాన్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సంక్షేమం.. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారనే ప్రజా సంక్షేమం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గృహజ్యోతి పథకాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి గృహజ్యోతి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే వారికి జీరో బిల్లు ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖానా పూర్ ఎమ్మెల్మే వెడ్మ బొజ్జు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిముద్ఖాన్, వైస్ ఎంపీపీ జాలైజాకు, ఎస్ఈ జైవంత్‌రావు, డీఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు.. చిన్నారుల నిండు జీవితానికి.. రెండు చుక్కల మందు వేయించాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం బోథ్‌కు వె ళ్తుండగా మార్గమధ్యలో మండలకేంద్రంలో పల్స్ పోలియోకేంద్రా న్ని సందర్శించి చిన్నారులకు పోలియోచుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. మంత్రిని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్ శాలువాతో సత్కరించారు. వారివెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు మల్లేశ్, ఏఎంసీ ఉపాధ్యక్షుడు వసంత్‌రావు, బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రపుల్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా.. -
గుట్టలెక్కి.. పోలియో చుక్కలు వేసి..
వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్‌సీకి చేరుకున్నారు. -
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కేంద్రమంత్రి
కవాడిగూడ: అయిదేళ్లలోపు పిల్లలకు అందిస్తున్న పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌లు ఆదివారం ఇందిరాపార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జి. కిషన్‌రెడ్డి చిన్నారులకు కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచనశ్రీతో కలిసి పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటి, పద్మజలతో పాటు వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు రమేష్‌రాం, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, మహేందర్‌బాబు, జి. వెంకటేష్, ప్రభాకర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు. -
పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత
ముంబై: పోలియో చుక్కల పంపిణీలో సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్‌ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దీంతో చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం (జనవరి 31) చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ చేశారు. అయితే యావత్మల్లో పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ చుక్కలు వేశారు. దీంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. శానిటైజర్ చుక్కలు వేయించుకున్న 12 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు గుర్తించారు.. పిల్లలకు పోలియో బదులు శానిటైజర్ వేశారని. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగుందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
అందరికీ పోలియో చుక్కలు వేయించాలి: గవర్నర్
సాక్షి, అమరావతి : పోలియో రహిత సమాజ స్ధాపనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఇంతకు ముందు వేయించినా, తిరిగి వేయించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గవర్నర్ బీబీ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు నిరంతరంగా చేపడుతున్న చర్యల ఫలితంగా 2011 నుండి భారత దేశంలో ఒక్క పోలియో బాధిత కేసు కూడా నమోదు కాలేదన్నారు. తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ద చేయకుండా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 52.72 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల వేయాలన్నది లక్ష్యంగా అన్నారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలోని చిన్నారులు సమీపంలోని పోలీసు పోలియో చుక్కల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్ల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, రాష్ట్ర రోగ నిరోధక అధికారి డాక్టర్ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుహాసిని తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పోలియో చుక్కలు వికటించి బాలుడి మృతి
చెన్నై,తిరువొత్తియూరు: పోలియో చుక్కలు వికటించి కాట్టు మన్నార్ కోయిల్‌లో ఏడాది వయసున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు.. కడలూరు జిల్లా కాట్టు మన్నార్ కోయిల్, టీ నెడుంజేరి పుత్తూరు సమీపంలోని పణ్ణపట్టు గ్రామానికి చెందిన అలెగ్జాండర్, జయలక్ష్మీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు హరీష్ ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం హరీష్‌కు అదే ప్రాంతంలోని అంగన్ వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేశారు. ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సమాయానికే స్ఫృహ తప్పింది. వెంటనే బిడ్డను చిదంబరం కామరాజర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన తరువాత వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరీష్ మరణించాడు. కాలం చెల్లిన పోలియో చుక్కలు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. -
భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్‌పై లాహోర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. యాంటి- పోలియో టీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు... ఫవాద్ ఖాన్ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు పోలియో వర్కర్లు ఫైజల్ టౌన్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న ఫవాద్ భార్య సదాఫ్ ఖాన్.. తమ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు నిరాకరించారు. అంతేకాకుండా కారు డ్రైవర్‌తో కలిసి సంబంధిత వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు ఫవాద్ ఖాన్ సహా అతడి భార్య, డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫవాద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈవెంట్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నాడు. కాగా పోలియో కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటైన పాకిస్తాన్లో.. అక్కడి చట్టాల ప్రకారం పిల్లలకు పోలియో చుక్కలు వేయించని తల్లిదండ్రులకు జరిమానా విధించడంతో పాటు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇక సోనమ్ కపూర్ ఖూబ్సూరత్ సినిమాలో హీరోగా నటించిన ఫవాద్.. యే దిల్ హై ముష్కిల్ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు బాలీవుడ్ తెరకు దూరం కానున్నాడు. -
‘కలుషిత పోలియో’ కాల్చివేత!
సాక్షి, హైదరాబాద్: కలుషిత పోలియో చుక్కలను కాల్చివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు లక్షల మంది చిన్నారులకు వీటిని వేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని చిన్నారుల రోగనిరోధకశక్తి అధికంగా ఉన్నందున వాటివల్ల ప్రమాదం ఏమీ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇంకా మిగిలిన వాటి లో కలుషితమైనట్లు భావిస్తున్న 10 లక్షల డోసుల పోలియో చుక్కలను జిల్లాల నుంచి ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు తెప్పించారు. వాటిని ధ్వంసం చేసే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ పోలియో చుక్కల బాటిళ్లను కాల్చివేస్తామని వైద్యాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బ్యాచ్ నంబర్–బీ10048 కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 గల కలుషిత వ్యాక్సిన్లు రాష్ట్రంలోనూ అనేకమంది చిన్నారులకు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. వీటిని ఎంతమందికి వేశారో సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. కలుషిత పోలియో చుక్కలను తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని చిన్నారులకు వేయించారని కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ కలుషితమైన ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. మూడు బ్యాచ్‌ల్లో కలుషితమైన 1.5 లక్షల యూనిట్ల వ్యాక్సిన్లను 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వేశారు. 3 లక్షల డోసుల పోలియో మందు రాక... 10 లక్షల డోసుల పోలియో చుక్కలను వెనక్కి తేవడంతో రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో వాటి కొరత ఏర్పడింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప్రమాదంలేని 3 లక్షల డోసుల పోలియో మందును రాష్ట్రానికి కేంద్రం పంపిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.వాటిని రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశామని పేర్కొన్నాయి. -
నేడే రెండో విడత పల్స్ పోలియో
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం (11న) నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇందుకోసం 22,768 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. 787 మొబైల్ టీం.. 2,280 మంది రూట్ సూపర్వైజర్స్, 8,711 మంది ఎఎన్ఎంలు, 27,045 మంది ఆశా వర్కర్లు, 32,082 మంది అంగన్వాడీ వర్కర్లు కలిపి మొత్తంగా 95,500 మంది సిబ్బంది కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. 11న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం వరుసగా రెండ్రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి సూచించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
ఎర్రుపాలెం : ఈనెల 28 తేది నుంచి నిర్వహించనున్న పల్ప్‌పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి జి.రాజు సూచించారు. గురువారం మండలంలోని బనిగండ్లపాడు పీహెచ్సీలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు శిక్షణ నిర్వహించారు. వైద్యాధికారి రాజు మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటీకే 0–5 సంవత్సరాలలోపు గుర్తించిన 4460 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. అదే విధంగా ఈనెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో కుష్టువ్యాధి నిర్మూలనకు ఇంటింటికి ఆశ కార్యకర్తలు వెళ్లి సర్వే నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఆరోగ్య విస్తరణాధికారి సదాశివరావు, హెల్త్ సూపర్వైజర్లు లంకా కొండయ్య, జయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ దండెం సాయిరెడ్డి, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. చింతకాని : ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ అనిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరూ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో సీహెచ్ఓ మధుసూదన్‌రావు, సూపర్వైజర్లు జైపాల్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన పోలియో చుక్కలు!
వాంతులతో అస్వస్థత.. చికిత్సకు తీసుకెళ్తుండగా చిన్నారి మృతి విజయనగరం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి 5 నెలల ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో ఆదివారం చిన్నారి తరుణికి పోలియో చుక్కలు వేసిన అనంతరం కొద్దిసే పటికి తల్లి స్వాతి పాలుపట్టింది. వెంటనే తరుణి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స కోసం సుందరపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగా తరుణి మృతి చెందింది. పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరాడక చిన్నారి చనిపోయిందని, పోలియో చుక్కలు కారణం కాదని డీఎంహెచ్ఓ సి.పద్మజ తెలిపారు. -
పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి!
పూసపాటిరేగ(విజయనగరం జిల్లా): పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం వైద్యసిబ్బంది గ్రామంలో పోలియో చుక్కలు వేస్తుండటంతో రౌతు గెట్లయ్య, రౌతు స్వాతి అనే దంపతులు కూడా తమ 5 నెలల చిన్నారికి వేయించారు. అనంతరం చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో సమీప పీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలియో చుక్కలు వికటించడం వల్లే మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందరు పిల్లలకు వేసినట్లే వేశామని, చిన్నారికి బలవంతంగా పాలు పట్టడం వల్ల, పాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి ఊపిరాడక మృతిచెందినట్లు పోలియో చుక్కలు వేసిన సిబ్బంది చెబుతున్నారు. చిన్నారి గత రాత్రి నుంచి పాలు తాగడం లేదని సమాచారం. -
చుక్కల మందుకు పక్కా ప్లానింగ్
కాకినాడ వైద్యం : జిల్లాలో ఈనెల 29 నుంచి పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేం దుకు వైద్య,ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.58,61, 508 వైద్య ఆరోగ్యశాఖకు పంపించింది. జిల్లాలో ఉన్న 128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 839 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని పోలియోబూత్లలో చుక్కల మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అయిదేళ్లలోపు చిన్నారులు 5,01,307 మంది ఉండగా అందరికీ పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 3,582 బూత్‌లను ఏర్పాటు చేశారు. 136 మొబైల్ కేంద్రాలను సిద్ధం చేశారు. కార్యక్రమ నిర్వహణలో సేవలు అందించేందుకు 362 సూపర్వైజర్లు, 7,323 మంది వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది, 7,520 మంది అంగ¯ŒSవాడీ, ఆశా కార్యకర్తలతో పాటు ఐకేపీ డ్వాక్రా సంఘ సభ్యులను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,46,088 మంది, అర్బ¯ŒS పరిధిలో 1,20,852, ఏజెన్సీలో 34,367 మంది చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య, జిల్లా ఇ మ్యూనైజేష¯ŒS అధికారిణి డాక్టర్ అనిత, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పవ¯ŒSకుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జీవనోపాధి కోసం పట్టణాలు వచ్చిన సంచార జాతుల పిల్లలు, ఇటుకబట్టీలు తదితర చోట పనిచేసే కూలీల పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరిగా పోలియో చుక్కల మందును వేయాలని ఇప్పటికే సిబ్బందికి సూచించి శిక్షణ ఇచ్చారు. గతాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ముందుగానే రూ. 58,61,508 లక్షలను డీఎంఅండ్‌హెచ్‌వోకు పంపింది. గత ఏడాది పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కార్యక్రమ నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. అప్పట్లో రూ.57 లక్షలకు రూపాయి కూడా మంజూరు కాకపోవడం, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించడంలో అప్పటి డీఎంఅండ్‌హెచ్‌వో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో కార్యక్రమ నిర్వహణలో ఇబ్బందులు వచ్చాయి. కాకినాడ ఏటిమొగలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సభకు అర్భ¯ŒS వైద్య అధికారి కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై అప్పటి డీఎంఅండ్‌హెచ్‌పై కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది కార్యక్రమానికి ముందుగానే జిల్లాకు నిధులు మంజూరయ్యాయి. -
నేడు పోలియో చుక్కల మందు పంపిణీ
-
నేడు పోలియో చుక్కల మందు పంపిణీ
రాష్ర్టవ్యాప్తంగా 27 వేల కేంద్రాల్లో ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందును పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 27 వేల కేంద్రాల్లో పోలియో చుక్కల మందు వేయనున్నారు. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకెళ్లి పోలియో చుక్కలు చేయించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం తెలియక మందు వేయించనివారికోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బందే ఇంటింటికి రానున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లోని చిన్నారుల కోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు సిబ్బంది ఇళ్లకు వెళ్లి చిన్నారుల వివరాలు తెలుసుకుని తొలి మూడు రోజుల్లో డ్రాప్స్ వేయని వారికి ప్రత్యేకంగా మందు పంపిణీ చేయనున్నారు. ఈ నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు వయసున్న 42 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1.25 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున హైదరాబాద్‌లో పోలియో చుక్కలు వేసే ప్రారంభ కార్యక్రమంలో మంత్రులెవరూ పాల్గొనటం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ కార్యక్రమాన్ని ఉదయం ఎనిమిది గంటలకు కుందన్‌బాగ్‌లో ప్రారంభించనున్నారు. -
టైమ్ అయిపోయిన వ్యాక్సిన్ వల్లే పాప చనిపోయిందా ?
-
టీకా వికటించి చిన్నారి ప్రన్వీ మృతి
-
టీకా వికటించి చిన్నారి మృతి
నాగోలు (హైదరాబాద్) : నాగోలులో విషాదం చోటుచేసుకుంది. టీకా వికటించడంతో ఓ చిన్నారి మృతిచెందింది. పోలియో చుక్కలు వేయడంతోనే చిన్నారి మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగోలులోని విజయపురి కాలనీకి చెందిన ప్రణవికి శనివారం అంగన్వాడీ సెంటర్లో పోలియో చుక్కలు వేయించారు. అయితే అప్పటి నుంచి అస్వస్థతకు గురైన ప్రణవి ఆదివారం ఉదయం ప్రాణాలొలింది. దీంతో చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. -
ప్రతినెలా 7 నుంచి టీకాల వారం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయి వ్యాధి నిరోధక టీకాలు కేవలం 55.40 శాతం మంది చిన్నారులకే అందాయి. 42.50 శాతం పిల్లలకు పాక్షికంగా అందాయి. అసలే టీకా అందని చిన్నారులు 2.10 శాతం ఉన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కేవలం 65 శాతం మంది చిన్నారులే పుట్టిన తొలి ఏడాదిలో అన్నిరకాల వ్యాక్సిన్లు పొందగలుగుతున్నారన్నారు. -
మూడు నెలలకే కానరాని లోకాలకు...
శిశువు ఉసురు తీసిన చుక్కల మందు కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు జగ్గయ్యపేట అర్బన్ : లేకలేక తొమ్మిదేళ్లకు సంతానం అందుకున్న ఆ తల్లికి ఆ ముచ్చట తీరకముందే మూడు నెలలకే ఆ చిట్టితండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పట్టణంలోని చెరువుబజారుకు చెందిన ఓర్సు సాంబశివరావు సుతారు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయన బార్య భూలక్ష్మితో సంతానం కోసం గుళ్లు, గోపురాలు తిరిగాడు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పుట్టిన అంకమరావును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంచికొచ్చిన ఆయన బాబుతో ముచ్చట్లాడుకుంటూ భోజనం చేసి పనిలోకి వెళతాడు. ఇటీవల దేశవ్యాప్తంగా వేసిన పోలియో చుక్కలు బాబుకు ఏమైనా అవుతుందేమోనని వేయించలేదు. కాని ఆయన భయం అనతికాలంలోనే నిజమైంది. బుధవారం మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చిన ఏఎన్ఎంలు నాగలక్ష్మి, పద్మలు తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. మధ్యాహ్నం బోజనానికి వచ్చి ఎప్పటిలా బిడ్డతో ఆడుకుందామనుకున్న ఆ తండ్రికి ఊహించని విధంగా బాబు లోకం వదిలి వెళ్లిపోయాడని తెలిసి స్పృహతప్పిపడిపోయాడు. బంధువులు ధైర్యం చెప్పగా ఆసుపత్రికి వచ్చిన ఆయన నాబిడ్డను నాకు ఇవ్వండంటూ బోరున ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యం వలనే చనిపోయాడని ఆరోపించాడు. బాలుడి మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం విజయవాడ : జగ్గయ్యపేట కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం పరిధిలో మృతి చెందిన నాలుగు నెలల బాలుడి మరణ ంపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయం నుంచి జగ్గయ్యపేటలో జరిగిన సంఘటనను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టాలని జిల్లా వైధ్యఅధికారి, జగ్గయ్యపేట తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జగ్గయ్యపేట చెరువు బజారుకు చెందిన ఒరుసు భూలక్ష్మి, సాంబశివరావుల నాలుగు నెలల బాలుడు వ్యాక్సినేషన్ కారణంగా మృతి చెంది నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. -
ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయాలి
నెల్లూరు(అర్బన్): ఐదేళ్ల లోపు ఉండే ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఎం.జానకి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె నగరంలోని భక్తవత్సల్‌నగర్‌లో ఉన్న కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల్లో ప్రారంభించారు. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు కూడా తోడ్పాటు అందించాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం 0-5 ఏళ్ల లోపు పిల్లలు 3,29,304 మంది ఉన్నారన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,37,435 మంది, అర్బన్ పరిధిలో 91,869 మంది ఉన్నారని తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకు రూరల్ ప్రాంతాల్లో 2554 బూత్‌లు, అర్బన్ పరిధిలో 488 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 88 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఎలా జరుగుతోంది? ఏమైనా ఇబ్బందులున్నాయా ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ బొల్లినేని శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు 92.73 శాతం నమోదు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భారతీరెడ్డి నెల్లూరు, మనుబోలు, కోట తదితర ప్రాంతాల్లో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 92.73 పల్స్‌పోలియో శాతం నమోదైందని తెలిపారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించామన్నారు. కడప ఆర్డీ, జిల్లా పల్స్‌పోలియో పరిశీలకులు డాక్టర్ దశరథరామయ్య ఇరుకళల పరమేశ్వరి దేశస్థానం ప్రాంతంలో పోలియో చుక్కల కేంద్రాన్ని పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్బారావు నగరంలోని డీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, మెటర్నటీ, రేబాల చిన్న పిల్లల ఆసుపత్రుల్లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. -
నేడు పల్స్‌పోలియో
- జిల్లాలో 2,790 కేంద్రాల ఏర్పాటు - జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ వెల్లడి - జిల్లాలో 2,790 పల్స్‌పోలియో కేంద్రాలు రాజేంద్రనగర్: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 22న ఆదివారం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,790 పోలియో కేంద్రాల ద్వారా 0-5 సంవత్సరాలలోపు ఉన్న 7,18,124 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శివరాంపల్లి డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలియో బృందంలో పనిచేయడానికి జిల్లాలో 11,160 మంది సిబ్బందిని ఎంపిక చేశామన్నారు. ఆరోగ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణకు 279 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, క్వారీ నిర్మాణం ప్రాంతాలు, సంచార జాతులు నివసించే ప్రదేశాల్లోని 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 65 మొబైల్ టీములను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని బస్టాండులు, రైల్వేస్టేషన్లలో కూడా పోలియో చుక్కలు వేసేందుకు 58 ట్రాన్సిట్ టీములను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లాలో రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 24 మంది అధికారులను నియమించామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో.. రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలు, 14 గ్రామాల్లో ఆదివారం ఉదయం పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు. -
1.73 లక్షల మందికి పోలియో చుక్కలు
హొసూరు : పల్స్‌పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలోని 10 పంచాయతీ సమితుల్లో 881 పోలియో శిబిరాలను ఏర్పాటు చేశారు. క్రిష్ణగిరి, హొసూరు మున్సిపాలిటీల్లో 70 శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రీలంక శరణార్థుల శిబిరాల్లో పోలియో చుక్కలు వేసేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 లక్షల 35 వేల పోలియో చుక్కలను సిద్ధంగా ఉంచుకొన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 3804 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండులు, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల వయసు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. హొసూరులో... హొసూరు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము పోలియో చుక్కలను వేసి శిబిరాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి బస్టాండులో మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారు. పల్స్ పోలియో ప్రారంభం సింధనూరు టౌన్ : తాలూకాలోని గొరేబాళ్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉప తహశీల్దార్ హనుమంతప్ప ఆదివారం ప్రారంభించారు. గ్రామంలోని అంగన్వాడీ 4వ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఎం.అమరేశ్, శామిద్సాబ్, శరణప్ప, ఆశా కార్యకర్తలు శశికళ, అంగన్వాడీ కార్యకర్తలు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తాలూకాలోని సాలగుందా గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. తాలూకా పంచాయతీ సభ్యురాలు గౌరమ్మ శరణబసవ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు హులిగెమ్మ, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోకు శ్రీకారం సింధనూరు టౌన్ : 19వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమానికి నగరసభ సభ్యుడు శరణబసవ గొరేబాళ్ ఆదివారం శ్రీకారం చుట్టారు. శరణబసవేశ్వర కాలనీ, ప్రాథమిక పాఠశాలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖులు యమనప్ప, అంగన్వాడీ కార్యకర్త ఉమ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో నగరసభ సభ్యుడు హాజిమస్తాన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఎఫ్ఏ హణగి, అంగన్వాడీ కార్యకర్త శాంభవి, హజిరాబేగం తదితరులు పాల్గొన్నారు. పోలియో చుక్కలు తప్పనిసరి చెళ్లకెర రూరల్ : పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడేందుకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అనేక పథకాలను జారీ చేసిందన్నారు. పిల్లల ఉత్తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. తాలూకా ఆరోగ్య అధికారి ప్రేమసుధ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 32,106 మందికి పోలీయో వేయించామన్నారు. 226 బూత్‌లకు 458 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో పురసభ అధ్యక్షుడు ఎం.మంజునాథ్, తిప్పేస్వామి, ఆరోగ్య సహాయకులు తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో.. 93.6 శాతం
సాక్షి, సిటీబ్యూరో: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారులు 10 లక్షల మంది ఉన్నారు. తొలిరోజు 93.6 శాతం అంటే 9,27,019 మందికి చుక్కలు వేశారు. సీఎం కేసీఆర్ ఉదయం ఏడు గంటలకు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య జవహర్‌నగర్‌లో, మంత్రి తలసాని అమీర్‌పేటలో చుక్కల మందు వేశారు. తొలిరోజు వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లోనూ వేయనున్నారు. -
93.05 శాతం పల్స్‌పోలియో నమోదు
నెల్లూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 93.05 శాతం పల్స్‌పోలియో నమోదైంది. 3,06,238 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 3,29,112 మంది ఐదేళ్ల లోపు పిల్లలున్నట్లు గుర్తించారు. అర్బన్ పరిధిలో 487, గ్రామీణ ప్రాంతాల్లో 2,551 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 88 మొబైల్ బూత్‌లు అందుబాటులో ఉంచారు. 308 మంది రూట్ సూపర్వైజర్లు, 27 మంది ఉన్నతాధికారులు, 1966 మంది ఆశ వలంటీర్లు, 3,682 మంది ఐసీడీఎస్ సిబ్బంది, 896 మంది పారామెడికల్ స్టాఫ్, 3,050 మంది ఐకేపీ సభ్యులు, 2,044 మంది ఉపాధ్యాయులు, 514 మంది నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. సిబ్బంది ముమ్మరంగా పాల్గొని చుక్కలు వేయాలని డీఎంహెచ్‌వో భారతిరెడ్డి ఆదేశాలిచ్చారు. పోలియో కేంద్రాల్లో వసతుల కరువు.. పోలింగ్ కేంద్రాల్లో వసతుల గురించి అధికారులు పట్టించుకోలేదు. చుక్కల మందుకు ఎండ తగలకూడదని తెలిసినా షామియానాలు ఏర్పాటు చేయలేదు. కొందరు ఎండలోనే ఉండి చుక్కలు వేయాల్సి వచ్చింది. సిబ్బంది, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. నెల్లూరు నగరంలో చుక్కలు వేసేందుకు అధికారులు నర్సింగ్ విద్యార్థులను ఉపయోగించుకున్నారు. చాలా మంది విద్యార్థులకు కార్పొరేషన్ అధికారులు భోజనాలు అందజేస్తారని అధికారులు చెప్పినా ఆచరణలో అమలుకాలేదు. విద్యార్థులే సొంత డబ్బులతో భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర పరిశీలకుడి ఆగ్రహం.. పోలియో చుక్కల కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడిగా దశరధరామయ్యను ప్రభుత్వం నియమించింది. ఈయన గూడురు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. అరకొర వసతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బజారువీదిలోని గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏఎన్ఎంలు ఎవరూ లేకుండా కేవలం అంగన్వాడీ కార్యకర్త, ఆయాలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలియో చుక్కల మందుకు ఎండ వేడి తగలకూడదని, సిబ్బంది కూడా ఎండలోనే ఉంటూ పనిచేస్తున్నారని ఈ కేంద్రం వద్ద షామియానాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కేంద్రాన్ని నీడ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈదూరు సుధాకర్ గూడూరులోని పెద్దపరిగ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయకపోవడం, ఏర్పాట్లు బాగోలేకపోవడంతో ఆగ్రహించిన ఆయన యూడీసీ క్లర్క్‌కు మెమో అందజేశారు. -
ఎనీ కార్... సింగిల్ హ్యాండ్
కొందరిని వైకల్యం కుంగదీస్తుంది.. ఇంకొందరిని విధిని జయించేలా చేస్తుంది. తాను ఎదుర్కొంటున్న సమస్య తనలాంటి వారికి ఎదురవ్వొద్దని ఆలోచించేలా చేస్తుంది. పరిష్కారం కనుగొంటుంది. అందుకే పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిన జానీ మియా కారు నడిపాడు. మామూలు కారునే తనూ నడిపేలా మార్చేసుకున్నాడు. సింగిల్ హ్యాండ్‌తో డ్రైవింగ్ చేయడమే కాదు.. తనలాంటి వారు కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ షికారు కొట్టేలా చేస్తున్నాడు. వికలాంగులు సైతం ఈజీగా డ్రైవ్ చేసేలా కార్లను మార్చేసి.. క్యా బాత్ హై అనిపించుకుంటున్నాడు. - వాంకె శ్రీనివాస్ ‘మా సొంతూరు ఖమ్మం జిల్లా పాటివారిగూడెం. ఖమ్మంలో సెయింట్ మేరీస్ పోలియో హోమ్‌లో చదువుకున్నా. ఐటీఐ పూర్తయ్యాక ఖమ్మంలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు రిపేర్ చేసేవాడ్ని. కువైట్‌లో రెండేళ్లు ఎలక్ట్రానిక్ చిప్ తయారీ కంపెనీలో పనిచేసి 2009లో హైదరాబాద్‌కు వచ్చేశాను. ఓసారి స్నేహితులతో కారులో విహారయాత్రకు వెళ్లినప్పుడు నేనూ డ్రైవ్ చేస్తానంటే వాళ్లు హేళన చేశారు. అప్పుడే ఎలాగైనా కారు నడపాలని నిశ్చయించుకున్నా. గతంలో మా నాన్నకు ఆటో నేర్పిన అనుభవం నాలో ధీమాను పెంచింది. చేతినిండా పని మా అన్నయ్య ఖాదర్‌బాబు ఫిట్టర్‌గా పనిచేసేవాడు. ఆయన దగ్గర మెకానిక్ పని కొంత నేర్చుకున్నాను. మొదట ఒక మారుతి ఒమ్నీ వ్యాన్ కొన్నా. ఇంజిన్ ఎలా పని చేస్తుందో.. తెలుసుకునేందుకే నాకు రెండేళ్లు పట్టింది. ప్రయోగాల కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశాను. క్లచ్ సిస్టమ్‌లో కాస్త మార్పులు చేసి చేత్తో తక్కువ బలంతో ప్రెస్ చేసినా పనిచేసేలా మార్చా. కుడి చేతి వైపు క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్‌లను పెట్టి రెండు కాళ్లతో చేసే పనిని చేత్తో చేసేలా మార్చేశాను. కుడి చేయి సరిగా పని చేయకుండా ఒక కాలు సరిగా పని చేసే వారి కోసం అందుకు తగ్గట్టు మార్పులు చేశాను. నాలుగేళ్లు ప్రయోగాల తర్వాత డ్రైవర్ సీట్లో కూర్చుని కారు నడిపాను. మిగతా కార్లకు ఇలాంటి ఏర్పాట్లే చేశాను. ట్రాఫిక్‌లో బటన్ నొక్కి వాహనాన్ని ఆపేలా మార్పు చేశాను. అదే కారును మామూలు వ్యక్తులు నడిపినపుడు వికలాంగుల కోసం అమర్చిన వ్యవస్థను లాక్ చేసే ఏర్పాటు కూడా చేశాను. వైకల్యాన్ని బట్టి... వైకల్యం ప్రకారం 14 రకాలుగా కార్లను మాడిఫై చేస్తున్నా. వనస్థలిపురంలో ‘క్రియేటివ్ టెక్నాలజీస్’ పేరుతో గ్యారేజీ నిర్వహిస్తున్నా. హ్యాండ్, లెగ్, టూలెగ్, బాడీ ఫిట్‌నెస్‌లో సమస్యలున్న వారికి అనుగుణంగా డిజైన్ చేసిన కారులో టెస్ట్ డ్రైవ్ చేసి చూపెడతాను. ఇప్పటి వరకు 1,200 కార్ల డ్రైవింగ్ సిస్టమ్‌ను మార్చాను. ఎలక్ట్రికల్ ఆపరేటింగ్, హైడ్రాలిక్ ఆపరేటింగ్, మెకానికల్ ఆపరేటింగ్‌ను ఆధారంగా చేసుకొని 14 రకాల కార్లను డిజైన్ చేశాను. డెమో వెహికల్ ద్వారా డ్రైవింగ్ నేర్పుతాను. రెండు వారాల్లో వారికి డ్రైవింగ్‌లో శిక్షణిస్తాను. కాస్త పర్ఫెక్ట్ అయ్యాక ఇదే కారుతో ఆర్టీఏ కార్యాలయంలో టెస్ట్ డ్రైవ్ చేసి లెసైన్స్ పొందుతున్నారు. తమ వైకల్యానికి అనుగుణంగా కారు మార్చుకోవాలనుకుంటున్న వారికి రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. స్పెషల్ కార్లు కావాల్సిన వారు http://handicappedcar.in వెబ్సైట్లో లాగిన్ అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తాను చేసే పని వైకల్య బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జానీమియా అంటారు. -
జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం..
కూసుమంచి, న్యూస్‌లైన్: జిల్లాలో 2.98లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలని లక్ష్యం నిర్ధేశించుకుని 2.78లక్షల మందికి వేశామని డీఎంహెచ్ఓ భానుప్రకాష్ తెలిపారు. మిగిలిన వారికి కూడా సోమ, మంగళవారాలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పూర్తి చేస్తామని అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పాలేరు, నర్సింహులగూడెం, చౌటపల్లి గ్రామల్లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. అనంతరం కూసుమంచి పీహెచ్‌సీని తనిఖీ చేసి విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డెంగీ, మలేరియా పరీక్షల నిర్ధారణకు ఆరుగురు ల్యాబ్ టెక్నిషియన్లను నియమించామని, జిల్లాలో 61 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ ఉండగా 59 భర్తీ చేశామని, మిగిలిన ఇద్దరు త్వరలో విధుల్లో చేరతారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లాలో మరో 32 పీహెచ్‌సీలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వాటిల్లో నాలుగు పీహెచ్‌సీలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో 33 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి సం బంధించి ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే వీరు విధుల్లో చేరుతారని అన్నారు. భారత దేశం పోలి యో రహిత దేశంగా ఈ నెల 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని అన్నారు. పీహెచ్‌సీల పని తీరును మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శంకర్కుమార్నాయక్ పాల్గొన్నారు. 59 మంది వైద్యాధికారులను నియమించాం నేలకొండపల్లి: జిల్లాలో 59 మంది వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలియో చుక్కల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 61 సార్లు పోలియో చుక్కల మందును పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో 3327 బూత్‌లు, 3308 మొబైల్ పార్టీల ఏర్పాటు చేసి చుక్కల మందు పంపిణీ చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మందికి పోలియో చుక్కల మందు వేశామని అన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ అధికారి మోహన్‌రావు, మం డల వైద్యాధికారి సురేష్‌నారాయణ, దంత వైద్యులు మురళీకృష్ణ, స్వప్న, నివేదిత, పార్మసిస్ట్ అప్పారావు, హెచ్ఈఓ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
23 నుంచి రెండోవిడత పల్స్‌పోలియో
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రామతులశమ్మ తెలిపారు. మొత్తం 3,55,088 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 2,491 బూత్‌లు ఏర్పాటు చేశామని, 10,935 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. గత నెలలో నిర్వహించిన మొదటివిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలు సాధించామన్నారు. అయినప్పటికీ మరో ఏడాదిపాటు జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలియో వైరస్ ఒకరికి సోకితే పక్కవారికి కూడా సోకే ప్రమాదముందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ ఒక్కరూ పోలియో బారినపడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు కారణంగా పోలియో సోకుతుందన్నారు. అనుమానం ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం చెన్నైకి పంపిస్తామని, పాజిటివ్ రిపోర్టు వస్తే బూస్టర్ డోస్ వేస్తామని తెలిపారు. ఎక్కడైనా పోలియో కేసు నమోదైతే ఆ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తలను డిస్మిస్ చేస్తామని, ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. స్థానిక వైద్యాధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా సంచార జాతులు, బిక్షగాళ్లు, వలస కూలీల పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 23వ తేదీ మొదటిరోజును బూత్డేగా ప్రకటిస్తామన్నారు. ఆ రోజు ఉదయం బూత్‌లలో మాత్రమే పోలియో చుక్కలు వేస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి బూత్‌లకు రాని పిల్లల వివరాలు సేకరించి ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వారందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. 24, 25 తేదీల్లో ఇళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు సంచార జాతుల వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఐడీఎస్పీ వైద్యుడు డాక్టర్ పుల్లారెడ్డి, ఎస్వో శ్రీధర్‌బాబు, డెమో శ్రీనివాసరావు, డిప్యూటీ డెమో పద్మజ తదితరులు పాల్గొన్నారు. రెండోవిడత పల్స్‌పోలియో రూట్ ఆఫీసర్లు వీరే... మార్కాపురం, పెద్దదోర్నాల, వై.పాలెం ప్రాంతాలకు డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.రామతులశమ్మ, ఒంగోలు అర్బన్ పరిధిలో డాక్టర్ కె.సరళాదేవి, చీమకుర్తి, దర్శి ప్రాంతాలకు డాక్టర్ రమేష్, మార్టూరు, అద్దంకి ప్రాంతాలకు డాక్టర్ పద్మావతి, గిద్దలూరు, కంభంకు డాక్టర్ నవీన్, చీరాల, పర్చూరు ప్రాంతాలకు డాక్టర్ సత్యనారాయణ, కందుకూరు, ఉలవపాడు, కొండపికి ఎస్వో శ్రీధర్‌రావు, కనిగిరి, పామూరు ప్రాంతాలకు కేవీ సబ్బలక్ష్మి రూట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తారు. -
చిన్నారి మృతి
రాంగోపాలపురం (భద్రాచలం రూరల్), న్యూస్‌లైన్: రాంగోపాలపురం పంచాయతీలోని సున్నంగుంపు గ్రామంలో సోమవారం నెలన్నర వయస్సున్న బాలుడు మృతిచెందాడు. పోలియో చుక్కల మందు వికటించినందునే తమ బిడ్డ చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ బాలుడి మృతికి కిడ్నీ సంబంధ వ్యాధే కారణమని పరిశీలనలో తేలిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రకాశ్ చెబుతున్నారు. బాలుడి మృతికి సంబంధించి తల్లి రాధ తెలిపిన ప్రకారం.. సున్నం రమేష్-రాధ దంపతుల నెలన్నర వయసున్న కుమారుడికి శనివారం రాత్రి వాంతులు చేసుకున్నాడు. జలుబుతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆదివారం ఉదయం పోలి యో చుక్కల కేంద్రానికి తీసుకెళ్లారు. బాలుడి అనారోగ్య విషయాన్ని వారు అక్కడి సిబ్బందికి చెప్పలేదు. చుక్కలు వేసిన తరువాత కొద్దిపసేపటికి ఆ చిన్నారికి మళ్లీ వాంతులయ్యాయి. తల్లిదండ్రులు ఆ పిల్లాడిని ముందుగా ఓ గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లారు. ఆ పూజారి రోగ నివారణ పేరుతో మూడు గంటలపాటు పూజలు నిర్వహించి, డాక్టర్ వద్దకు వెళ్లాలని సూచించాడు. ఆ తల్లిదండ్రులు భద్రాచలంలోని ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని చెప్పారు. ఆ తల్లిదండ్రులు ఖమ్మం ఆస్పత్రికి కాకుండా స్థానికంగాగల మరో ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ బాలుడు అక్కడే సోమవారం ఉదయం మృతిచెందాడు. పోలియో చుక్కలు వికటించినందునే తమ కుమారుడు మృతిచెందాడని సున్నం రమేష్-రాధ దంపతులు ఆరోపిస్తున్నారు. పోలియో చుక్కలు కారణం కాదు... చిన్నారి మృతి విషయం తెలుసుకున్న సంబంధిత (లక్ష్మీపురం) పీహెచ్సీ వైద్యుడు సత్యదేవ్.. సున్నం గుంపు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. పోలి యో చుక్కలు వేయించక ముందు నుంచే బాలుడు అనారోగ్యంతో ఉన్నాడని, సకాలంలో వైద్యం అం దని కారణంగానే మృతిచెందాడని నిర్థారించారు. కిడ్నీ సంబంధ వ్యాధే కారణం.. చిన్నారి మృతికి పోలియో చుక్కలు కారణం కానేకాదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్ చెప్పారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. కిడ్నీ సంబంధ వ్యాధి కారణంగానే ఆ చిన్నారి మృతిచెందినట్టుగా తమ విచారణలో తేలినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేస్తే మృతిచెందటం జరగదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్భయంగా పోలియో చుక్కలు వేయించవచ్చని అన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలియో చుక్కలు వేయించవచ్చు.. ఖమ్మం మయూరి సెంటర్: ఐదేళ్ల లోపు పిల్లలు ఎంతటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నిస్సందేహంగా పోలియో చుక్కలు వేయించవచ్చని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన సోమవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. భద్రాచలంలో మండలంలో ఓ చిన్నారి మృతికి పోలియో చుక్కలు ఏమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. ఈ చిన్నారికి వేసిన వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ మందునే మరో లక్షమంది చిన్నారులకు కూడా వేశామన్నారు. అమాయకత్వం, అవగాహన లోపమే కారణం గిరిజన చిన్నారి మృతికి తల్లిదండ్రుల అమాయకత్వం, అవగాహన లోపమే అసలు కారణమని అర్థమవుతోంది. బాలుడి అనారోగ్య విషయాన్ని తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేసిన సిబ్బందికి ముందుగా చెప్పలేదు. చెప్పి ఉన్నట్టయితే వారు తగిన సలహా, సూచనలు ఇచ్చేవారేమో..! ఆ తరువాత కూడా.. వాంతులతో అస్వస్థుడైన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి కాకుండా గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లి, దాదాపు మూడు గంటలపాటు అక్కడే గడిపారు. ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని భద్రాచలంలోని ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పినప్పటికీ వినకుండా, స్థానికంగాగల మరో ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటి రోజు ఉదయం అక్కడే బాలుడు మృతిచెందాడు. బాలుడిని ముందుగా గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లడం.. ఆ తల్లిదండ్రుల అమాయకత్వానికి, ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వినకపోవడం... (వైద్యం-ఆరోగ్యంపై) వారి అవగాహన లేమికి అద్దం పడుతోంది. ఏజెన్సీలోని గిరిజనులకు ‘ఆరోగ్యం, వైద్యం’పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఈ బాలుడి మృతి ఉదంతం మరోమారు గుర్తుచేసినట్టయింది. -
కదలిన అధికారులు
వెంకటాచలం, న్యూస్‌లైన్ : పో లియో చుక్కల మందును అం దించడంలో అలసత్వంపై ‘అధికారుల నిర్లక్ష్యం’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా వై ద్యాధికారి స్పందించి సోమవా రం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెం టర్ను తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. పోలియో మందును చిన్నారులకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించా రు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి పద్మావతి కూడా ఈ విషయమై ఆరా తీసినట్టు క్లస్టర్ డాక్టర్ పి.పురుషోత్తం తెలిపా రు. డాక్టర్ పురుషోత్తం, ఎస్‌యూఓ నారాయణరావు, కసుమూరు డాక్టర్ రజనీ, సీహెచ్ఓ శ్రీరాములు, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, ఆశా వర్కర్ వెంకటరమణమ్మ జ్యోతినగర్ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల గుర్తులను పరిశీలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 108 అందుబాటులో పెడతాం వెంకటాచలం వద్ద ఉన్న 108 వాహనాన్ని జూబ్లీ ఆస్పత్రిలో గర్భవతులు ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఉపయోగిస్తున్నాం. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాహనం ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి వాహనాన్ని వెంకటాచలంలో ఉంచేందు కు చర్యలు తీసుకుంటాం. -ప్రోగ్రాం మేనేజర్ రమణయ్య -
పోలియోను తరిమికొడదాం
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: జిల్లా నుంచి పోలియోను తరిమికొట్టాలని, రెండే రెండు పోలియో చుక్కలు వేయించి, చిన్న పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడేలా చేద్దామని కలెక్టర్ గిరిజాశంకర్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆది వారం ఆయన జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు. రామయ్యబౌళి ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు చుక్కల మందు వేసి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా చుక్కల మందు వేయించేందుకు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విడత పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 4.96 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 3057 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర ప్రయాణ పాంతాల్లో కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేం దుకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏజేసీ పి.రాజారాం, డీఎంహెచ్ఓ డాక్టర్ రుక్మిణమ్మ, డీఐఓ రంగాపూర్, సహాయ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బాలజీ, రామాంజనేయులు, రవిశంకర్, డా.రఫిక్, ఏజో కొమ్ములయ్య, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు లయన్ నటరాజ్, సత్తూర్ రాములుగౌడ్, డా.రజిని,తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోను ఉద్యమంలా చేపట్టాలి గద్వాల టౌన్: ఐదేళ్లలోపున్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయాలని, ఉద్యమంలో ఈ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దూద్ దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రా న్ని మంత్రి డీకే అరుణ సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలను వేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు మందు తప్పనిసరిగా వేయిం చాలని సూచించారు. పోలియోపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బీఎస్ కేశవ్, బం డల వెంకట్రాములు, రామంజనేయు లు, తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించిన డీఐఓ
కారేపల్లి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా 2,98,220 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే విధంగా లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కారేపల్లి పీహెచ్సీలో విలేకరులతో మాట్లాడారు. 3,327 పోలియో కేంద్రాలు, 90 మోబైల్ టీంలు, 62 తాత్కాలిక పోలియో కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైద్య సిబ్బందితో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ స్వచ్చంధ సేవా సంస్థల నుంచి వలంటీర్లు మొత్తంగా 13,944 మంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. గోదావరి నది పరివాహాక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలైన రేఖపల్లి, జీడికుప్ప, పోచారం, పేరాంటాలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో రెండు లాంచీ లను, పర్ణశాల, అమలారం, ఏలూరి, తిప్పకుప్ప గ్రామాలకు మూడు బోట్లను ఏర్పాటుచేసి చిన్నారులకు పోలి యో చుక్కలను వేసినట్లు ఆయన తెలిపారు. కొండరెడ్లు, ఆదివాసీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వచ్చే నెల 11వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)ద్వారా దేశానికి ఫ్రీ పోలి యో సర్టిఫికెట్‌ను ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల చేతుల మీదుగా ఢిల్లీలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కారేపల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట కారేపల్లి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, వైద్యురాలు నాగమణి, ల్యాబ్ టెక్నిషియన్ జియావుద్దీన్‌లు ఉన్నారు. -
నేడు పల్స్‌పోలియో
ఐదు సంవత్సరాలలోపు పిల్లలు : 7,12,169 చుక్కలు వేసే కేంద్రాలు : 2,790 సిబ్బంది : 11,450 మొబైల్ బూత్‌లు : 58 మొబైల్ బృందాలు : 65 పర్యవేక్షణ అధికారులు : 24 సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో డ్రాప్స్ వేసేందుకు కేంద్రాలతో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ం వరకు జిల్లాలోని ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తంగా 7.12లక్షల మంది పిల్లలున్నట్లు గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లోనూ ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్‌కుమార్ తెలిపారు. -
రేపటి నుంచి చుక్కల మందు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పల్స్ పోలియో చుక్కల డబ్బాలను ఆయా పీహెచ్‌సీలకు పంపిణీ చేశారు. మొదటి ఈనెల 19న బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారు. 20,21 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి తిరుగుతారు. ఇంకా బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆటోస్టాండ్, పారిశ్రామిక ప్రాంతాల్లో, ఇటుక బట్టీల వద్ద వలస కూలీల పిల్లలకు, జనావాసాలు ఉన్నచోట పోలియో చుక్కలు వేయనున్నారు. ఒక్కో బూత్‌లో నలుగురు సేవలందించనున్నారు. కాగా జిల్లాలో మూడేళ్ల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 19న పట్టణంలోని హమాలివాడలోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో కలెక్టర్ బాబు కార్యక్రమం ప్రారంభించనున్నారు. -
19న పల్స్‌పోలియో
చిలుకూరు, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ పల్స్‌పోలియోను 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు విడతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయిలో 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. అలాగే కేంద్రంలో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 20,21 తేదీలలో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 5ఏళ్ల లోపు 3,69,905 మంది పిల్లలను గుర్తించారు. 100 శాతం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాకు 5లక్షల వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి. వీటిని రెండు రోజుల్లో మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. అదనంగా 33 కేంద్రాల ఏర్పాటు ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 3004 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 2971 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది మరో 33 కేంద్రాలను అదనంగా పెంచారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు ,స్వచ్చంద్ర సేవా సంస్థలు వారు, ఉపాధ్యాయులు మొత్తం 11,884మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారి, జిల్లా అధికారులతో 6 జిల్లా కోర్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరు ఆ రోజు కేంద్రాలను పరిశీలిస్తారు. వీరితో పాటు జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో ఆయా ఎస్పీహెచ్ఓ(ప్రత్యేక వైధ్యాదికారులు)లు పరిశీలిస్తారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల్లో వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అమోస్, జిల్లా వైద్యాదికారి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలి. ఇప్పటికే పల్స్‌పోలియోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 5 ఏళ్ల లోపు పిల్లలు 3,69,905 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వారికి పోలియో చుక్కలు వేసేందుకు సుమారుగా 12 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులు బాద్యతగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలి. -
పల్స్‌పోలియో వందశాతం చేయూలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వంద శాతం చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ వీరరాఘవరావు వైద్యులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి19న పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందులో భాగంగా తిరువళ్లూరు జిల్లాలోని డెప్యూటీ డెరైక్టర్లు, ప్రభుత్వ వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వీరరాఘవరావు మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి 15 నాటికి ఐదేళ్ల లోపు 2,70,795 మంది వున్నట్టు కలెక్టర్ వివరించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా జనసంచార ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్, మార్కెట్, పాఠశాలల వద్ద పోలియో చుక్కలు వేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలియో చుక్కలు వేసే సమయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. పోలియో చుక్కలు వేసే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. -
2,40,824 మంది పిల్లలకు పోలియో చుక్కలు
పొందూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1606 కేంద్రాల్లో 2,40,824 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా వైద్య,ఆరోగ ్యశాఖాధికారి గీతాంజలి చెప్పారు. గురువారం పొందూరు 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. సిబ్బంది డ్యూటీ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 19న చుక్కలు వేయిం చుకోని వారికి 20, 21 తేదీల్లో ఇంటింటికి వెళ్లి తమ సిబ్బంది చుక్కలు వేస్తారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులకు వచ్చే లా వైద్యులు సేవలు అందించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో జవహర్ బాలల ఆరోగ్య రక్ష కో ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, స్థానిక వైద్యులు హరనాథరావు, సునీల్ పాల్గొన్నారు.