తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వంద శాతం చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ వీరరాఘవరావు వైద్యులకు సూచించారు.
పల్స్‌పోలియో వందశాతం చేయూలి
Jan 13 2014 4:07 AM | Updated on Sep 2 2017 2:34 AM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వంద శాతం చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ వీరరాఘవరావు వైద్యులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి19న పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందులో భాగంగా తిరువళ్లూరు జిల్లాలోని డెప్యూటీ డెరైక్టర్లు, ప్రభుత్వ వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వీరరాఘవరావు మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి 15 నాటికి ఐదేళ్ల లోపు 2,70,795 మంది వున్నట్టు కలెక్టర్ వివరించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా జనసంచార ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్, మార్కెట్, పాఠశాలల వద్ద పోలియో చుక్కలు వేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలియో చుక్కలు వేసే సమయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. పోలియో చుక్కలు వేసే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
Advertisement
Advertisement