ఎర్రుపాలెం: బనిగండ్లపాడులో మాట్లాడుతున్న మండల వైద్యాధికారి రాజు
ఎర్రుపాలెం : ఈనెల 28 తేది నుంచి నిర్వహించనున్న పల్ప్‌పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి జి.రాజు సూచించారు. గురువారం మండలంలోని బనిగండ్లపాడు పీహెచ్‌సీలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలకు శిక్షణ నిర్వహించారు. వైద్యాధికారి రాజు మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటీకే 0–5 సంవత్సరాలలోపు గుర్తించిన 4460 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. అదే విధంగా ఈనెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో కుష్టువ్యాధి నిర్మూలనకు ఇంటింటికి ఆశ కార్యకర్తలు వెళ్లి సర్వే నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఆరోగ్య విస్తరణాధికారి సదాశివరావు, హెల్త్ సూపర్‌వైజర్లు లంకా కొండయ్య, జయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ దండెం సాయిరెడ్డి, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
చింతకాని : ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ అనిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరూ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో సీహెచ్‌ఓ మధుసూదన్‌రావు, సూపర్‌వైజర్లు జైపాల్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment