
ఉసురు తీసిన పోలియో చుక్కలు!
వాంతులతో అస్వస్థత.. చికిత్సకు తీసుకెళ్తుండగా చిన్నారి మృతి
విజయనగరం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి 5 నెలల ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో ఆదివారం చిన్నారి తరుణికి పోలియో చుక్కలు వేసిన అనంతరం కొద్దిసే పటికి తల్లి స్వాతి పాలుపట్టింది. వెంటనే తరుణి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స కోసం సుందరపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగా తరుణి మృతి చెందింది. పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరాడక చిన్నారి చనిపోయిందని, పోలియో చుక్కలు కారణం కాదని డీఎంహెచ్‌ఓ సి.పద్మజ తెలిపారు.