వెంకటాచలం, న్యూస్‌లైన్ : పో లియో చుక్కల మందును అం దించడంలో అలసత్వంపై ‘అధికారుల నిర్లక్ష్యం’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా వై ద్యాధికారి స్పందించి సోమవా రం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెం టర్‌ను తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. పోలియో మందును చిన్నారులకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించా రు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి పద్మావతి కూడా ఈ విషయమై ఆరా తీసినట్టు క్లస్టర్ డాక్టర్ పి.పురుషోత్తం తెలిపా రు. డాక్టర్ పురుషోత్తం, ఎస్‌యూఓ నారాయణరావు, కసుమూరు డాక్టర్ రజనీ, సీహెచ్‌ఓ శ్రీరాములు, ఏఎన్‌ఎం ప్రసన్నకుమారి, ఆశా వర్కర్ వెంకటరమణమ్మ జ్యోతినగర్ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల గుర్తులను పరిశీలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
108 అందుబాటులో పెడతాం
వెంకటాచలం వద్ద ఉన్న 108 వాహనాన్ని జూబ్లీ ఆస్పత్రిలో గర్భవతులు ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఉపయోగిస్తున్నాం. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాహనం ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి వాహనాన్ని వెంకటాచలంలో ఉంచేందు కు చర్యలు తీసుకుంటాం.
-ప్రోగ్రాం మేనేజర్ రమణయ్య
కదలిన అధికారులు
Published Tue, Jan 21 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement