మధ్యాహ్న భోజనంలో బల్లి.. 60 మంది ఆస్పత్రిపాలు  | Food Poison: Dead Lizard Found In Food In Karnataka | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 60 మంది ఆస్పత్రిపాలు 

Published Tue, Jan 11 2022 7:26 AM | Last Updated on Tue, Jan 11 2022 7:26 AM

Food Poison: Dead Lizard Found In Food In Karnataka - Sakshi

సాక్షి, మైసూరు (కర్ణాటక): చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని వడకెహళ్ళ గ్రామంలో సోమవారం పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనాన్ని తిన్న 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బల్లి పడిన విషయాన్ని చూసుకోకుండా వడ్డించారు. తిన్న వెంటనే బాలలకు వాంతులు, విరేచనాలు కావడంతో కౌదళ్ళి, రామపుర ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స చేయించారు. ఎవరికీ అపాయం లేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పరుగున ఆస్పత్రికి చేరుకున్నారు.  

వివాహిత అదృశ్యం
హోసూరు: హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని చెన్నసంద్రం గ్రామానికి చెందిన శివానందకుమార్‌ (34). ఇతని భార్య సౌమ్య(29). వీరికి కొడుకు రామ్‌చరణ్‌ (10) ఉన్నాడు. 2వ తేదీ సౌమ్య కొడుతో కలిసి బయటకెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో భర్త బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement