dead lizard in meals
-
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 60 మంది ఆస్పత్రిపాలు
సాక్షి, మైసూరు (కర్ణాటక): చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని వడకెహళ్ళ గ్రామంలో సోమవారం పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనాన్ని తిన్న 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బల్లి పడిన విషయాన్ని చూసుకోకుండా వడ్డించారు. తిన్న వెంటనే బాలలకు వాంతులు, విరేచనాలు కావడంతో కౌదళ్ళి, రామపుర ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స చేయించారు. ఎవరికీ అపాయం లేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పరుగున ఆస్పత్రికి చేరుకున్నారు. వివాహిత అదృశ్యం హోసూరు: హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని చెన్నసంద్రం గ్రామానికి చెందిన శివానందకుమార్ (34). ఇతని భార్య సౌమ్య(29). వీరికి కొడుకు రామ్‌చరణ్ (10) ఉన్నాడు. 2వ తేదీ సౌమ్య కొడుతో కలిసి బయటకెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో భర్త బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 50 మందికి అస్వస్థత
బీహార్‌లో మధ్యాహ్న భోజనం అంటేనే పిల్లలు భయపడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారంనాడు అక్కడ పెట్టిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి ఒకటి బయటపడింది. ఈ ఆహారం తీసుకున్న దాదాపు 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. వారిద్దరిపైన ఎఫ్ఐఆర్ దాఖలైంది. గడిచిన నెల రోజుల్లోనే బీహార్‌లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇది నాలుగో సంఘటన. నౌగాచియా సమీపంలోని రాఘోపూర్‌లో గల బతారా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత చాలామంది పిల్లలు తమకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదుచేశారు. వెంటనే వాళ్లను అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అన్నం శాంపిళ్లను సేకరించారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. గత శనివారం నాడు బీహార్‌లోని బక్సర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 12 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. గడిచిన ఏడు నెలల్లో బీహార్ రాష్ట్రంలో 14 ఫుడ్ పాయిజనింగ్ కేసులు మధ్యాహ్న భోజనాల్లో జరిగాయని విద్యాశాఖాధికారులు తెలిపారు. గత సంవత్సరం శరణ్ జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 23 మంది విద్యార్థులు మరణించారు.