health centre
-
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 60 మంది ఆస్పత్రిపాలు
సాక్షి, మైసూరు (కర్ణాటక): చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని వడకెహళ్ళ గ్రామంలో సోమవారం పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనాన్ని తిన్న 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బల్లి పడిన విషయాన్ని చూసుకోకుండా వడ్డించారు. తిన్న వెంటనే బాలలకు వాంతులు, విరేచనాలు కావడంతో కౌదళ్ళి, రామపుర ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స చేయించారు. ఎవరికీ అపాయం లేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పరుగున ఆస్పత్రికి చేరుకున్నారు. వివాహిత అదృశ్యం హోసూరు: హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని చెన్నసంద్రం గ్రామానికి చెందిన శివానందకుమార్ (34). ఇతని భార్య సౌమ్య(29). వీరికి కొడుకు రామ్‌చరణ్ (10) ఉన్నాడు. 2వ తేదీ సౌమ్య కొడుతో కలిసి బయటకెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో భర్త బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టారు. -
సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు..
సాక్షి, బన్సీలాల్‌పేట్(సికింద్రాబాద్): సికింద్రాబాద్ బోయిగూడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మధ్య కోల్డ్‌వార్ సాగుతుంది. రోగులకు సేవలందించే విషయంలో సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడంతో కరోనా రోగులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో గురువారం కరోనా పరీక్షలకు కొంత అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి రంగంలోకి దిగి స్వయంగా పీపీఈకిట్ వేసుకొని కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి, సిబ్బంది మధ్య అంతర్గత పోరు... బోయిగూడ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిణి, స్టాఫ్ మధ్య వైద్య సేవల విషయంలో కొంత కాలం నుంచి అంతర్గత పోరు కొనసాగుతుంది. సెంటర్లో పలువురు సిబ్బంది వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి చెప్పిన మాట వినకుండా ఎదురు తిరుగుతున్నట్లు సమాచారం. వీరి మధ్య విబేధాలు గురువారం ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు సిబ్బంది గురువారం విధులకు రాలేదు. దీంతో సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి కరోనా పరీక్షలు చేయాల్సిందిగా ఏఎన్ఎంను ఆదేశించారు. శిక్షణ లేకుండా తాము ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలని, ఫర్మనెంట్ స్టాఫ్‌ను పిలిపించి పరీక్షలు నిర్వహించాలని సిబ్బంది బదులిచ్చినట్లు సమాచారం. వైద్యాధికారణి, సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరీక్షలు చేసిన డీఎంహెచ్ఓ.. వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి సిబ్బందితో వాగ్వాదం జరిగిన విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన బోయిగూడ సెంటర్‌కు వచ్చి అక్కడ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న ప్రజలను చూసి చలించిపొయాడు. వెంటనే డాక్టర్ వెంకటి పీపీకిట్ ధరించి సాయంత్రం వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో అక్కడున్న ప్రజలు జిల్లా వైద్యాధికారి తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. -
ఘోర ప్రమాదం: 30మంది సజీవ దహనం
బకు: అజెర్ బైజాన్ దేశ రాజధాని నగరం బకులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బకు పట్టణంలోని హెల్త్ సెంటర్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మీడియా అందించిన సమాచారం ఈ ప్రమాదంలో 30 మంది సజీవదహం కాగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక న్యూస్ ఏజెన్సీ ఏపీఏ రిపోర్టు చేసింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమాసియా, తూర్పు యూరప్ దేశాల సరిహద్దు వెంబడి అజెర్బైజాన్ దేశం ఉంటుంది. -
ఆటా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
సాక్షి, అలంపూర్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. స్థానిక పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, డ్యూయల్ డెస్క్, వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రంతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, కలెక్టర్ రజత్ కుమార్ సైని, తదితర సభ్యులతో కలిసి గురువారం ప్రారంభించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులు, డాక్టర్ జ్యోతి నందన్ రెడ్డి(హైదరాబాద్), రాజేశ్ నందన్ రెడ్డి కరకాల (అమెరికా), నరేందర్ రెడ్డి నూకల (అమెరికా), సుహీల్ చందా (అమెరికా), కిశోర్ రెడ్డి జి (అమెరికా)లు విరాళం ఇవ్వడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రాలకు రూ.3 లక్షలు, ప్రాథమిక తరగతి గదులలో 25 డ్యూయల్ బెంచిలకు రూ.లక్ష, డిజిటల్ తరగతి గదులకు రూ.లక్ష, ఆరోగ్య ఉపకేంద్రానికి లక్ష రూపాయల చొప్పున ఆ దాతలు విరాళం అందించి తమ వంతు సేవ చేశారు. చిన్నఆముదాలపాడు గ్రామసర్పంచ్ కవిత, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, నేతలు పాఠశాలను సందర్శించారు. లక్షల్లో నిధులు అందించి పలు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఆటాకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నేతలతో పాటు ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, ఉపాధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి, బోర్డు ట్రస్ట్ సభ్యులు అనిల్ బొడిరెడ్డి, పి.వేణు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీదర్ రెడ్డి, అంతర్జాతీయ సమన్వయకర్త కాశీ, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి, తదితరులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. -
ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రులు
ఉట్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. మండల పరిధిలో ప్రబలుతున్న విషజ్వరాల పై ఏర్పాటు చేయనున్న సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులతో మాట్లాడారు. వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ పాల్గొన్నారు. -
స్థాయి పెంచి సేవలు తగ్గించారు
వెంకటాచలం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి పెంచి క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడంతో వైద్య సేవలు తగ్గాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా 24 గంటలూ వైద్య సేవలు అందించేదన్నారు. క్లస్టర్ పరిధిలో చేర్చడంతో ఉదయం 9 నుం చి సాయంత్రం 4 గంటల వరకే సేవలు అందిస్తున్నారన్నారు. ఎల్లవేళలా వైద్యం అందించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు అవసరమైన భవనం, సిబ్బంది, పరికరాలను కోరుతూ నివేదిక పంపుతామని కాకాణి చెప్పారు. రికార్డులు పరిశీలించి నిధులు వినియోగంపై ఆయన ఆరా తీశారు. పేదలకు సరైన వైద్యం అందలేదన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమే అయినా దాని స్థాయికి తగినట్టు వసతులు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోఆప్షన్ మాజీ సభ్యుడు షేక్ కరీంసాహెబ్ కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్, హుస్సేన్, ఎంపీడీఓ టి సుగుణమ్మ, తహశీల్దార్ డీవీ సుధాకర్, క్లస్టర్ డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ గీతామణి, వైఎస్సార్సీపీ నేతలు కసుపూరు కోదండరామిరెడ్డి, పెళ్లూరు సుధాకర్ రెడ్డి, ఆరుకుంట ప్రభాకర్‌రెడ్డి, నాటకం శ్రీనివాసులు, డబ్బుగుంట వెంకటేశ్వర్లు ,పాశం ప్రభాకర్, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : ఉత్తమ్
కల్మల్చెర్వు(గరిడేపల్లి), న్యూస్‌లైన్: హుజూర్నగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి తనను గెలిపించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గరిడేపల్లి మండలం కల్మల్చెర్వు గ్రామంలో 1.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను, రూ.40 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా వేల కోట్ల రుపాయలతో హుజుర్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానన్నారు. పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాను ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. కల్మల్చెర్వు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత నిధులను రెట్టింపు చేయించానన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేయిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి తన గెలుపుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు. చావ్వారిగూడెం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మొదట గంగానగర్‌లో మంత్రి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కల్మల్‌చెర్వులో ప్రగతి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని నాయకులు, కార్యకర్తలు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, యరగాని గుర్వయ్యగౌడ్, బొలిశెట్టి సత్యనారాయణ, పయిడిమర్రి రంగనాథ్, బచ్చలకూరి మట్టయ్య, కటికం రమేశ్, బండా నర్సిరెడ్డి, పెండెం శ్రీనివాస్‌గౌడ్, సీతారాంరెడ్డి, యోహాన్, జానకిరాములు, సైదిరెడ్డి, లతీఫ్, శేఖర్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, గంటా సుధాకర్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, మాశెట్టి శ్రీహరి, సుందరి నాగేశ్వరరావు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏడీఏ రాంమోహన్‌రెడ్డి, డాక్టర్ శ్వేత, సైదయ్య, మంగళగిరి నాగరాజు, అంజయ్య, వట్టికూటి అంజ య్య తదితరులు పాల్గొన్నారు. -
కదలిన అధికారులు
వెంకటాచలం, న్యూస్‌లైన్ : పో లియో చుక్కల మందును అం దించడంలో అలసత్వంపై ‘అధికారుల నిర్లక్ష్యం’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా వై ద్యాధికారి స్పందించి సోమవా రం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెం టర్ను తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. పోలియో మందును చిన్నారులకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించా రు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి పద్మావతి కూడా ఈ విషయమై ఆరా తీసినట్టు క్లస్టర్ డాక్టర్ పి.పురుషోత్తం తెలిపా రు. డాక్టర్ పురుషోత్తం, ఎస్‌యూఓ నారాయణరావు, కసుమూరు డాక్టర్ రజనీ, సీహెచ్ఓ శ్రీరాములు, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, ఆశా వర్కర్ వెంకటరమణమ్మ జ్యోతినగర్ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల గుర్తులను పరిశీలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 108 అందుబాటులో పెడతాం వెంకటాచలం వద్ద ఉన్న 108 వాహనాన్ని జూబ్లీ ఆస్పత్రిలో గర్భవతులు ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఉపయోగిస్తున్నాం. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాహనం ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి వాహనాన్ని వెంకటాచలంలో ఉంచేందు కు చర్యలు తీసుకుంటాం. -ప్రోగ్రాం మేనేజర్ రమణయ్య