ఘోర ప్రమాదం: 30మంది సజీవ దహనం | Deadly fire hits Azerbaijan Health Centre | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం: 30మంది సజీవ దహనం

Published Fri, Mar 2 2018 1:07 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Deadly fire hits Azerbaijan Health Centre - Sakshi

బకు: అజెర్ బైజాన్ దేశ రాజధాని నగరం బకులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బకు పట్టణంలోని  హెల్త్‌ సెంటర్‌లో శుక్రవారం  భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  స్థానిక మీడియా అందించిన సమాచారం  ఈ ప్రమాదంలో 30 మంది  సజీవదహం కాగా, మరో  నలుగురికి  తీవ్ర  గాయాలయ్యాయి.  బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక న్యూస్‌ ఏజెన్సీ ఏపీఏ రిపోర్టు చేసింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, తదితర వివరాలు ఇంకా  తెలియాల్సి ఉంది.  పశ్చిమాసియా, తూర్పు యూరప్ దేశాల సరిహద్దు వెంబడి అజెర్‌బైజాన్ దేశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement