కల్మల్‌చెర్వు(గరిడేపల్లి), న్యూస్‌లైన్: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి తనను గెలిపించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గరిడేపల్లి మండలం కల్మల్‌చెర్వు గ్రామంలో 1.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను, రూ.40 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా వేల కోట్ల రుపాయలతో హుజుర్‌నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానన్నారు. పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాను ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. కల్మల్‌చెర్వు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత నిధులను రెట్టింపు చేయించానన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేయిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి తన గెలుపుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు. చావ్వారిగూడెం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మొదట గంగానగర్‌లో మంత్రి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కల్మల్‌చెర్వులో ప్రగతి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని నాయకులు, కార్యకర్తలు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, యరగాని గుర్వయ్యగౌడ్, బొలిశెట్టి సత్యనారాయణ, పయిడిమర్రి రంగనాథ్, బచ్చలకూరి మట్టయ్య, కటికం రమేశ్, బండా నర్సిరెడ్డి, పెండెం శ్రీనివాస్‌గౌడ్, సీతారాంరెడ్డి, యోహాన్, జానకిరాములు, సైదిరెడ్డి, లతీఫ్, శేఖర్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, గంటా సుధాకర్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, మాశెట్టి శ్రీహరి, సుందరి నాగేశ్వరరావు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏడీఏ రాంమోహన్‌రెడ్డి, డాక్టర్ శ్వేత, సైదయ్య, మంగళగిరి నాగరాజు, అంజయ్య, వట్టికూటి అంజ య్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : ఉత్తమ్
Published Sat, Feb 15 2014 3:19 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement