దేవరకొండ ఆస్పత్రికి తరలింపు
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్‌పహాడ్ మోడల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థు లు గురువారం అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదు వుతున్న ముగ్గురు విద్యార్థి నులు, ఆరో తరగతి చ దువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యా రు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108 వాహనంలో ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందించారు.
వారిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతుండగా మరో ముగ్గురు వాంతులు, క డుపునొప్పితో బాధపడుతున్నట్లు దేవరకొండ ఆస్ప త్రి సూపరింటెండెంట్ మంగ్తానాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మాతృనాయక్ ఆస్పత్రికి చేరు కొని విద్యార్థినులను పరామర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలోనే ఇటీవల ఒక మోడల్ స్కూల్ విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారు
ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కేటగిరీ–1 పీహెచ్‌డీలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ డీన్‌లు.. పీహెచ్‌డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటగిరీ–1 పీహెచ్‌డీ ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన.. యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్ ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment