ఐదు సంవత్సరాలలోపు పిల్లలు : 7,12,169
చుక్కలు వేసే కేంద్రాలు : 2,790
సిబ్బంది : 11,450
మొబైల్ బూత్‌లు : 58
మొబైల్ బృందాలు : 65
పర్యవేక్షణ అధికారులు : 24
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో డ్రాప్స్ వేసేందుకు కేంద్రాలతో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ం వరకు జిల్లాలోని ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.
మొత్తంగా 7.12లక్షల మంది పిల్లలున్నట్లు గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లోనూ ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్‌కుమార్ తెలిపారు.
నేడు పల్స్‌పోలియో
Published Sat, Jan 18 2014 11:38 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement