nirmal kumar
-
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
ముంబైలో శశికుమార్
నటుడు శశికుమార్ ముంబైలో మకాం పెట్టారు. అంతే కాదు అక్కడి తమిళులు తనపై చూపిన అభిమానానికి తబ్బిబ్బైపోతున్నారు కూడా. గ్రామీణ చిత్రాలకు పేటెంట్ హీరోగా మారిన ఈయన ఇప్పుడు సిటీస్‌లోనూ అలరించడానికి సిద్ధమైపోయారు. అలా శశికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రాన్ని కల్పతరు పిక్చర్స్ పతాకంపై పీకే.మోహన్ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌తో పాటు వినోదభరిత సన్నివేశాలతో కూడిన కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను నటుడు శరత్‌కుమార్ పోషించడం విశేషం. ఎన్వీ.నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను ముంబైలో బాగా జన సంచారం ఉన్న రోడ్లపై చిత్రీకరించామని తెలిపారు. షూటింగ్ అని తెలియకుండా కెమెరాలను చాటుగా ఉంచి ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. దీంతో అక్కడేదో గొడవ జరుగుతుందని భావించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారన్నారు. దీంతో అక్కడకు పోలీసులు రావడంతో తాము పరిస్థితిని వారికి వివరించినట్లు చెప్పారు. ముంబైలో శశికుమార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కొంత మంది తమిళులు శశికుమార్ ను చూసేందుకు షూటింగ్ లోకేషన్‌కు చేరుకున్నారు. ముంబైలో ఉన్న తమిళులు కూడా తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడైన శశికుమార్ అందరితో ఫోటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు. తమ పొరుగు రాష్ట్రాల్లోనూ ఇంతటి అభిమానులను సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి మంచి మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలని కోరుకుంటున్నానని శశికుమార్ తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దీనికి సంగీతాన్ని అందించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇకపోతే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెన్నైలో పూర్తి చేసినట్లు, ప్రస్తుతం ముంబైలో 15 రోజుల పాటు రెండవ షెడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఫుల్ యాక్షన్
ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు నటుడు అరవింద్ స్వామి. ఎందుకంటే తన తర్వాతి చిత్రం కోసం. అవును... ఆయన నెక్ట్స్ చిత్రం ఖరారు అయ్యింది. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక లుక్‌తో కనిపించిన అరవింద్ స్వామి సెకండాఫ్‌లో మరో లుక్‌తో సర్ప్రైజ్ చేస్తారు. ఈ లుక్స్‌కు సంబంధించి ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. మార్చిలో అరవింద్ స్వామి లుక్, టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. మార్చి 20న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకన్నా ముందు నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘చతురంగ వేటై్ట 2’ అనే సినిమా చేశారు. ఇక ఆయన కీలక పాత్ర చేసిన ‘నరగాసురన్’ (తెలుగులో ‘నరకాసురుడు’) చిత్రం కూడా రిలీజ్‌కు దగ్గరపడుతోంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా అరవింద్ స్వామి ఫుల్ బిజీగా ఉన్నారు. -
‘పెంటావలెంట్’తో ప్రాణాంతక వ్యాధులు దూరం
తాండూరు: పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.నిర్మల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి(పీపీయూనిట్)లో నిర్వహించిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఏఎన్ఎంల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంటావలెంట్ టీకా శిశువులకు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెంటావలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతాయన్నారు. ఈ టీకాతో ప్రాణాంతకమైన కంఠస్పర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హైపటైటీస్-బీ, హెమోఫిలస్ ఇన్ల్ఫూయెంజా అనే ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడవచ్చన్నారు. అంతేకాకుండా పెంటావలెంట్తో హెమోయెంజా టైప్‌బీ(హిబ్) బాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియా, మెనింజైటీస్, చెవిటితనం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయన్నారు. ఏఎన్ఎంలు వచ్చే నెల డిసెంబర్లో పెంటావలెంట్ టీకాలను శిశువులకు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు డా.సూర్యప్రకాష్, డా.శ్రీనివాస్, రవి, బాలరాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేడు పల్స్‌పోలియో
ఐదు సంవత్సరాలలోపు పిల్లలు : 7,12,169 చుక్కలు వేసే కేంద్రాలు : 2,790 సిబ్బంది : 11,450 మొబైల్ బూత్‌లు : 58 మొబైల్ బృందాలు : 65 పర్యవేక్షణ అధికారులు : 24 సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో డ్రాప్స్ వేసేందుకు కేంద్రాలతో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ం వరకు జిల్లాలోని ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తంగా 7.12లక్షల మంది పిల్లలున్నట్లు గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లోనూ ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్‌కుమార్ తెలిపారు.