Pulse polio program
-
నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఏపీలో పోలియో చుక్కల కార్యక్రమం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులకు ఆదివారం నుంచి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. నాలుగు రోజుల పాటు(బుధవారం వరకు) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,93,832 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం 37,969 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వ్యాక్సినేటర్లు ఇందులో పాల్గొంటున్నారు. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? అలాగే సోమవారం నుంచి ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు చేశారు. హై రిస్క్ ప్రాంతాల కోసం 1,374 మొబైల్ బృందాలు నియమించారు. ఇప్పటికే 13 జిల్లాలకు 66, 95,000 డోసులను వైద్య, ఆరోగ్య శాఖ సరఫరా చేసింది. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో చివరిసారిగా 2008 జూలై 16న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదు. -
రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో ప్రారంభం
హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. 24,574 కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయసున్న 41,52,210 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం వివిధ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో కూడా 897 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో 55 మంది అధికారులు, జిల్లా స్థాయిలో 120, క్షేత్రస్థాయిలో 2,455 సూపర్వైజర్లు, 733 సంచార బృందాలను కార్యక్రమం పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ వ్యాక్సిన్లు వేసేలా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానసరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోని చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేశారు. అలాగే రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పలువురు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరీంనగర్ నగరంలోని కార్ఖానగడ్డ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రారంభించి పోలియో చుక్కలు వేశారు. -
17న పల్స్ పోలియో
సాక్షి, చెన్నై: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల పదిహేడో తేదీ జరగనున్నది. 43 వేల శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 70 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించారు. పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా ప్రతి ఏటా పోలియో చుక్కల్ని ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు వేస్తూ వస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కలు వేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతోన్నది. ఆదిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో విజయవంతం చేయడం లక్ష్యంగా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. సచివాలయంలో బుధవారం ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలో పల్స్ పోలియో శిబిరాల ఏర్పాటు చర్యలపై సమాలోచన సమావేశం జరిగింది. ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్ వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో శిబిరాల్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 43501 శిబిరాల్ని ఏర్పాటు చేసి, 70 లక్షల మంది పిల్లలకు చుక్కల్ని వేయడం లక్ష్యంగా టార్గెట్ నిర్ణయించారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. అలాగే, సంచార వాసులు,కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా మొైబె ల్ శిబిరాల్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1652 మొబైల్ శిబిరాల్ని, మరో వెయ్యి బృందాల్ని ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఈనెల 17వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శిబిరాల్లో పిల్లలకు చుక్కలు వేయనున్నారు. చుక్కలు వేయ బడ్డ పిల్లల ఎడమ చేతి బొటనవేలికి ఇంక్ మార్క్ వేయనున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు మంత్రి విజయభాస్కర్ పిలుపు నిచ్చారు. -
నేడు పల్స్‌పోలియో
- జిల్లాలో 2,790 కేంద్రాల ఏర్పాటు - జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ వెల్లడి - జిల్లాలో 2,790 పల్స్‌పోలియో కేంద్రాలు రాజేంద్రనగర్: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 22న ఆదివారం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,790 పోలియో కేంద్రాల ద్వారా 0-5 సంవత్సరాలలోపు ఉన్న 7,18,124 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శివరాంపల్లి డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలియో బృందంలో పనిచేయడానికి జిల్లాలో 11,160 మంది సిబ్బందిని ఎంపిక చేశామన్నారు. ఆరోగ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణకు 279 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, క్వారీ నిర్మాణం ప్రాంతాలు, సంచార జాతులు నివసించే ప్రదేశాల్లోని 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 65 మొబైల్ టీములను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని బస్టాండులు, రైల్వేస్టేషన్లలో కూడా పోలియో చుక్కలు వేసేందుకు 58 ట్రాన్సిట్ టీములను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లాలో రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 24 మంది అధికారులను నియమించామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో.. రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలు, 14 గ్రామాల్లో ఆదివారం ఉదయం పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు. -
1.73 లక్షల మందికి పోలియో చుక్కలు
హొసూరు : పల్స్‌పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలోని 10 పంచాయతీ సమితుల్లో 881 పోలియో శిబిరాలను ఏర్పాటు చేశారు. క్రిష్ణగిరి, హొసూరు మున్సిపాలిటీల్లో 70 శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రీలంక శరణార్థుల శిబిరాల్లో పోలియో చుక్కలు వేసేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 లక్షల 35 వేల పోలియో చుక్కలను సిద్ధంగా ఉంచుకొన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 3804 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండులు, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల వయసు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. హొసూరులో... హొసూరు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము పోలియో చుక్కలను వేసి శిబిరాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి బస్టాండులో మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారు. పల్స్ పోలియో ప్రారంభం సింధనూరు టౌన్ : తాలూకాలోని గొరేబాళ్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉప తహశీల్దార్ హనుమంతప్ప ఆదివారం ప్రారంభించారు. గ్రామంలోని అంగన్వాడీ 4వ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఎం.అమరేశ్, శామిద్సాబ్, శరణప్ప, ఆశా కార్యకర్తలు శశికళ, అంగన్వాడీ కార్యకర్తలు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తాలూకాలోని సాలగుందా గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. తాలూకా పంచాయతీ సభ్యురాలు గౌరమ్మ శరణబసవ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు హులిగెమ్మ, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోకు శ్రీకారం సింధనూరు టౌన్ : 19వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమానికి నగరసభ సభ్యుడు శరణబసవ గొరేబాళ్ ఆదివారం శ్రీకారం చుట్టారు. శరణబసవేశ్వర కాలనీ, ప్రాథమిక పాఠశాలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖులు యమనప్ప, అంగన్వాడీ కార్యకర్త ఉమ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో నగరసభ సభ్యుడు హాజిమస్తాన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఎఫ్ఏ హణగి, అంగన్వాడీ కార్యకర్త శాంభవి, హజిరాబేగం తదితరులు పాల్గొన్నారు. పోలియో చుక్కలు తప్పనిసరి చెళ్లకెర రూరల్ : పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడేందుకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అనేక పథకాలను జారీ చేసిందన్నారు. పిల్లల ఉత్తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. తాలూకా ఆరోగ్య అధికారి ప్రేమసుధ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 32,106 మందికి పోలీయో వేయించామన్నారు. 226 బూత్‌లకు 458 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో పురసభ అధ్యక్షుడు ఎం.మంజునాథ్, తిప్పేస్వామి, ఆరోగ్య సహాయకులు తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో.. 93.6 శాతం
సాక్షి, సిటీబ్యూరో: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారులు 10 లక్షల మంది ఉన్నారు. తొలిరోజు 93.6 శాతం అంటే 9,27,019 మందికి చుక్కలు వేశారు. సీఎం కేసీఆర్ ఉదయం ఏడు గంటలకు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య జవహర్‌నగర్‌లో, మంత్రి తలసాని అమీర్‌పేటలో చుక్కల మందు వేశారు. తొలిరోజు వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లోనూ వేయనున్నారు. -
రేపు పల్స్ పోలియో
రాజేంద్రనగర్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.సుబాష్ చంద్రబోస్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లును పూర్తి చేశామన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఏడు లక్షల18వేల 124 మంది పిల్లలకు పోలియో చుక్కలను వేయనున్నామన్నారు. ఇందుకోసం 11,160 మంది సిబ్బందిని నియమించామన్నారు. 19, 20 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తామన్నారు. 67 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రెండో విడతగా ఫిబ్రవరి 22న మరోసారి చుక్కలు వేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్లు వి.నిర్మల్‌కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి రెండోవిడత పల్స్‌పోలియో
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రామతులశమ్మ తెలిపారు. మొత్తం 3,55,088 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 2,491 బూత్‌లు ఏర్పాటు చేశామని, 10,935 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. గత నెలలో నిర్వహించిన మొదటివిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలు సాధించామన్నారు. అయినప్పటికీ మరో ఏడాదిపాటు జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలియో వైరస్ ఒకరికి సోకితే పక్కవారికి కూడా సోకే ప్రమాదముందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ ఒక్కరూ పోలియో బారినపడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు కారణంగా పోలియో సోకుతుందన్నారు. అనుమానం ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం చెన్నైకి పంపిస్తామని, పాజిటివ్ రిపోర్టు వస్తే బూస్టర్ డోస్ వేస్తామని తెలిపారు. ఎక్కడైనా పోలియో కేసు నమోదైతే ఆ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తలను డిస్మిస్ చేస్తామని, ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. స్థానిక వైద్యాధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా సంచార జాతులు, బిక్షగాళ్లు, వలస కూలీల పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 23వ తేదీ మొదటిరోజును బూత్డేగా ప్రకటిస్తామన్నారు. ఆ రోజు ఉదయం బూత్‌లలో మాత్రమే పోలియో చుక్కలు వేస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి బూత్‌లకు రాని పిల్లల వివరాలు సేకరించి ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వారందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. 24, 25 తేదీల్లో ఇళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు సంచార జాతుల వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఐడీఎస్పీ వైద్యుడు డాక్టర్ పుల్లారెడ్డి, ఎస్వో శ్రీధర్‌బాబు, డెమో శ్రీనివాసరావు, డిప్యూటీ డెమో పద్మజ తదితరులు పాల్గొన్నారు. రెండోవిడత పల్స్‌పోలియో రూట్ ఆఫీసర్లు వీరే... మార్కాపురం, పెద్దదోర్నాల, వై.పాలెం ప్రాంతాలకు డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.రామతులశమ్మ, ఒంగోలు అర్బన్ పరిధిలో డాక్టర్ కె.సరళాదేవి, చీమకుర్తి, దర్శి ప్రాంతాలకు డాక్టర్ రమేష్, మార్టూరు, అద్దంకి ప్రాంతాలకు డాక్టర్ పద్మావతి, గిద్దలూరు, కంభంకు డాక్టర్ నవీన్, చీరాల, పర్చూరు ప్రాంతాలకు డాక్టర్ సత్యనారాయణ, కందుకూరు, ఉలవపాడు, కొండపికి ఎస్వో శ్రీధర్‌రావు, కనిగిరి, పామూరు ప్రాంతాలకు కేవీ సబ్బలక్ష్మి రూట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తారు. -
పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. శనివారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రి వరకు పల్స్‌పోలి యోపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా పేర్కొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, పాలస్తీనా, ఇజ్రాయిల్, చాడ్, మలేషియా దేశాలకు వెళ్లాలనుకునే వారు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించినట్లు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలని, లేకుంటే వారిని ఆయా దేశాలలోకి అనుమతించరని అన్నారు. ఈ సర్టిఫికెట్లను డీఎంహెచ్ ఓ కార్యాలయం నుంచి పొందవచ్చని తెలి పారు. అనంతరం పల్స్‌పోలియో ఆడియో సీడీని డీఎంహెచ్ఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ వెంకటేశ్వర్లు, బి.వెంకన్న, ఠాగూర్ మంగతాయర్ పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల నిర్వహణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్మి తా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నివేదికలను జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా ప్రగతి శకటాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై పథకాల వివరాలు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. శకటాలకు రోలింగ్ షీల్డ్‌తో ప్రగతి బహుమతి అందజేస్తామన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డీఈఓ రమేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డాక్టర్ శరత్, అదనపు ఎస్పీ మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు బాల్‌రెడ్డి, రవీందర్, రామలక్ష్మి, ఆశీర్వాదం, లక్ష్మణాచారి, కిరణ్‌కుమార్, రమేశ్, శ్రీనివాసులు సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పల్స్‌పోలియో విజయవంతం సంగారెడ్డి అర్బన్: జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో 101శాతం సాధించామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,57,200 మంది చిన్నారులకు పో లియో చుక్కలు వేసి 101శాతం లక్ష్యం సాధించామన్నారు.19వ తేదీన 3,34,204 మంది చిన్నారులకు, 20వ తేదీన 19,204 మంది చిన్నారులకు, 21న 3,642 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గ్రామైక్య సంఘాలు, వైద్య శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భినందనలు తెలిపారు. -
చుక్కల మందుకు చక్కని స్పందన
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైంది. ఒక్క రోజే 95 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ, అనకాపల్లిల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎన్ఏడీ వద్ద మంత్రి బాలరాజు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వైద్య ఆరోగ్య శాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని విశాఖ అర్బన్‌లో పలు శిబిరాలను సందర్శించారు. గ్రామీణ ప్రాంతంలోని దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, లంకవానిపాలెం తదితర ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్యామల పర్యటించి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు రోజులు, విశాఖ అర్బన్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని డీ ఎంహెచ్వో తెలిపారు. ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయాల్సిందిగా పారామెడికల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరానికి స్పందన లభించింది -
పల్స్‌పోలియో విజయవంతం
సాక్షి, బెంగళూరు : ఈ ఏడాది మొదటి విడతగా చేపట్టిన పల్స్‌పోలియో కార్యక్రమం రాష్ర్ట వ్యాప్తంగా విజయవంతమైంది. 75 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా 89 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ శివాజీ నగరలోని గౌసియా ఆస్పత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఏయిర్‌పోర్టులతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేసి ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందు వేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 31,782 పోలియో బూత్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా ఆరోగ్య కార్యకర్తలు పట్టణ ప్రాంతంలో మూడు రోజులు, గ్రామాల్లో రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగి మిగిలిన చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. ఈ కార్యక్రమంలో లక్షకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వలస కార్మికులను గుర్తించి వారు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి చుక్కల మందు వేశారు. రెండోవిడత పల్స్ పోలియో కార్యక్రమం ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉంటే 2007 నుంచి రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. -
నేడు పల్స్ పోలియో
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 3,54,996 మంది 0-నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించిట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.రామతులశమ్మ వెల్లడించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొత్తం 10,935 మంది సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వీరిలో మెడికల్ అండ్ హెల్త్‌కు సంబంధించిన 1631 మంది, ఉపాధ్యాయులు 963 మంది, 2468 మంది అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, 2468 మంది ఆశా కార్యకర్తలు, 1730 మంది వలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. 87 మొబైల్ వెహికల్స్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. అదే విధంగా మొత్తం 2491 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్బన్ ప్రాంతాలైన ఒంగోలులో 72 బూత్‌లు, చీరాలలో 50 బూత్‌లు, కందుకూరులో 29 బూత్‌లు, మార్కాపురంలో 35 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని మంగమూరు రోడ్డులో ఉన్న అర్బన్ పీహెచ్సీలో ఆదివారం ప్రారంభిస్తారని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. జిల్లాలో చివరి సారిగా 2006లో తూర్పుగంగవరంలో పోలియో కేసు నమోదైనట్లు తెలిపారు. అప్పటి నుంచి పోలియో కేసులు నమోదు కాలేదని సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 తర్వాత గుర్తించిందని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ జనవరి 19,20,21 తేదీల్లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నేషనల్ ఇమ్యూనైజేషన్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైరిస్క్ ప్రాంతాలపై ఈ సారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. ఎక్కువగా వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పచ్చాకు కూలీలు, భిక్షగాళ్ల పిల్లలుకు పోలియో చక్కలు దగ్గరుండి వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించండి.. అంగవైకల్యం రాకుండా చూడండి.. అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. బూత్‌లు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేస్తాయన్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సరళాదేవి తెలిపారు. -
నేడే పల్స్ పోలియో
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం 8 గంటలకు క్యాంప్ కార్యాలయంలో వాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బూతుల్లోనే కాకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కుల్లోనూ సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జనాభా: 47.49 లక్షలు ఐదేళ్ల లోపు చిన్నారులు: 6,56,454 మంది చుక్కల మందు వేసే కేంద్రాలు: 3208 తొలి రోజు వేయనివారికి 20,21,22 తేదీల్లోవేయనున్నారు. మేయర్ మాజీద్ హుస్సేన్ ఉదయం 8.30కి సయ్యద్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. -
నేడు పల్స్‌పోలియో
విశాఖపట్నం, న్యూస్‌లైన్: పోలియో బారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ టి.గీతాప్రసాదిని కోరారు. జిల్లాలో 4.02 లక్షల మంది పిల్లలకు పోలియో చక్కలు వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపా రు. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివా రం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. డీఎం అండ్‌హెచ్‌వో కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ ఎన్.ఆర్.వి.సోమరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల, జిల్లా ఇమ్యుైనె జేషన్ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,53,656 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి వారందరికీ చుక్కలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 450 వేల పోలియో చుక్కలు అందుబాటులో ఉంచా రు. ఈ కార్యక్రమ నిర్వహణకు 9,368 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సీహెచ్ఎన్సీ, ఎస్పీహెచ్ఓ, ప్రోగ్రామ్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రధాన కూడళ్లలో బూత్‌లను ఏర్పాటు చేసి చుక్కల మందు వేయనున్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మ తెలిపారు. డయేరియా, వాంతులు ఉన్న వారికి చుక్కలు వేయరాదన్నారు. మురికి వాడల్లో నివసిస్తున్న వారు, వలస సంచార జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యేకంగా 21వ తేదీన జిల్లాలో మొత్తం 86 మొబైల్ యూనిట్ల ద్వారా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కలు వేస్తామన్నా. క్లస్టర్ల వారీగా చిన్నారుల గుర్తింపు.. జిల్లాలో క్లస్టర్ల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్టు ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మ తెలిపారు. నర్సాపూర్ క్లస్టర్లో 22,689 మంది, రామాయంపేటలో 41,340, జోగిపేటలో 25,019, నారాయణ్‌ఖేడ్‌లో 32,287, కోహీర్‌లో 40,648, సదాశివపేటలో 39,338, పటాన్చెరులో 45,744, సిద్దిపేటలో 36,249, దుబ్బాకలో 8,735, గజ్వేల్‌లో 37,960 మంది పిల్లలను గుర్తించినట్టు చెప్పారు. పోలియో రహిత సమాజానికి కృషి చేయాలి కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు జేసీ మూర్తి తెలిపారు. ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జేసీ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ పూర్ణచంద్ర, మున్సిపల్ కమిషనర్లు, నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొనాలి.. పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విధిగా పాల్గొనాలని డీపీఓ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి 25 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశానికి హాజరు కాని పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. -
నేడు పల్స్‌పోలియో
ఐదు సంవత్సరాలలోపు పిల్లలు : 7,12,169 చుక్కలు వేసే కేంద్రాలు : 2,790 సిబ్బంది : 11,450 మొబైల్ బూత్‌లు : 58 మొబైల్ బృందాలు : 65 పర్యవేక్షణ అధికారులు : 24 సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో డ్రాప్స్ వేసేందుకు కేంద్రాలతో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ం వరకు జిల్లాలోని ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తంగా 7.12లక్షల మంది పిల్లలున్నట్లు గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లోనూ ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్‌కుమార్ తెలిపారు.