ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.
శనివారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రి వరకు పల్స్‌పోలి యోపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా పేర్కొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం బస్‌స్టేషన్‌లు, రైల్వే స్టేషన్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, పాలస్తీనా, ఇజ్రాయిల్, చాడ్, మలేషియా దేశాలకు వెళ్లాలనుకునే వారు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించినట్లు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలని, లేకుంటే వారిని ఆయా దేశాలలోకి అనుమతించరని అన్నారు. ఈ సర్టిఫికెట్లను డీఎంహెచ్ ఓ కార్యాలయం నుంచి పొందవచ్చని తెలి పారు. అనంతరం పల్స్‌పోలియో ఆడియో సీడీని డీఎంహెచ్‌ఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ వెంకటేశ్వర్లు, బి.వెంకన్న, ఠాగూర్ మంగతాయర్ పాల్గొన్నారు.
పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
Published Sat, Feb 22 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement