గణతంత్ర వేడుకల నిర్వహణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్మి తా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నివేదికలను జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా ప్రగతి శకటాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై పథకాల వివరాలు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు.
శకటాలకు రోలింగ్ షీల్డ్‌తో ప్రగతి బహుమతి అందజేస్తామన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డీఈఓ రమేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డాక్టర్ శరత్, అదనపు ఎస్పీ మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు బాల్‌రెడ్డి, రవీందర్, రామలక్ష్మి, ఆశీర్వాదం, లక్ష్మణాచారి, కిరణ్‌కుమార్, రమేశ్, శ్రీనివాసులు సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
పల్స్‌పోలియో విజయవంతం
సంగారెడ్డి అర్బన్: జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో 101శాతం సాధించామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,57,200 మంది చిన్నారులకు పో లియో చుక్కలు వేసి 101శాతం లక్ష్యం సాధించామన్నారు.19వ తేదీన 3,34,204 మంది చిన్నారులకు, 20వ తేదీన 19,204 మంది చిన్నారులకు, 21న 3,642 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు.
జిల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గ్రామైక్య సంఘాలు, వైద్య శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భినందనలు తెలిపారు.