సాక్షి, సిటీబ్యూరో: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం 8 గంటలకు క్యాంప్ కార్యాలయంలో వాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బూతుల్లోనే కాకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కుల్లోనూ సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో జనాభా: 47.49 లక్షలు
ఐదేళ్ల లోపు చిన్నారులు: 6,56,454 మంది
చుక్కల మందు వేసే కేంద్రాలు: 3208
తొలి రోజు వేయనివారికి 20,21,22 తేదీల్లోవేయనున్నారు.
మేయర్ మాజీద్ హుస్సేన్ ఉదయం 8.30కి సయ్యద్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.
నేడే పల్స్ పోలియో
Published Sun, Jan 19 2014 5:51 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement