చుక్కల మందుకు పక్కా ప్లానింగ్‌ | polio drops | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు పక్కా ప్లానింగ్‌

Published Thu, Jan 26 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

చుక్కల మందుకు పక్కా ప్లానింగ్‌

చుక్కల మందుకు పక్కా ప్లానింగ్‌

 
కాకినాడ వైద్యం :
జిల్లాలో ఈనెల 29 నుంచి పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేం దుకు వైద్య,ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.58,61, 508 వైద్య ఆరోగ్యశాఖకు పంపించింది. జిల్లాలో ఉన్న 128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 839 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని పోలియోబూత్‌లలో చుక్కల మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అయిదేళ్లలోపు చిన్నారులు 5,01,307 మంది ఉండగా అందరికీ పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 3,582 బూత్‌లను ఏర్పాటు చేశారు. 136 మొబైల్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. కార్యక్రమ నిర్వహణలో సేవలు అందించేందుకు 362 సూపర్‌వైజర్లు, 7,323 మంది వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది, 7,520 మంది అంగ¯ŒSవాడీ, ఆశా కార్యకర్తలతో పాటు ఐకేపీ డ్వాక్రా సంఘ సభ్యులను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,46,088 మంది, అర్బ¯ŒS పరిధిలో 1,20,852, ఏజెన్సీలో 34,367 మంది చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.చంద్రయ్య, జిల్లా ఇ మ్యూనైజేష¯ŒS అధికారిణి డాక్టర్‌ అనిత, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పవ¯ŒSకుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జీవనోపాధి కోసం పట్టణాలు వచ్చిన సంచార జాతుల పిల్లలు, ఇటుకబట్టీలు తదితర చోట పనిచేసే కూలీల పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరిగా పోలియో చుక్కల మందును వేయాలని ఇప్పటికే సిబ్బందికి సూచించి శిక్షణ ఇచ్చారు.
గతాన్ని దృష్టిలో ఉంచుకుని..
ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ముందుగానే రూ. 58,61,508 లక్షలను డీఎంఅండ్‌హెచ్‌వోకు పంపింది. గత ఏడాది పల్స్‌ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కార్యక్రమ నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది.
 అప్పట్లో రూ.57 లక్షలకు రూపాయి కూడా మంజూరు కాకపోవడం, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించడంలో అప్పటి డీఎంఅండ్‌హెచ్‌వో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో కార్యక్రమ నిర్వహణలో ఇబ్బందులు వచ్చాయి. కాకినాడ ఏటిమొగలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సభకు అర్భ¯ŒS వైద్య అధికారి కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై అప్పటి డీఎంఅండ్‌హెచ్‌పై కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది కార్యక్రమానికి ముందుగానే జిల్లాకు నిధులు మంజూరయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement