
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం (11న) నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇందుకోసం 22,768 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు.
787 మొబైల్ టీం.. 2,280 మంది రూట్ సూపర్‌వైజర్స్, 8,711 మంది ఎఎన్‌ఎంలు, 27,045 మంది ఆశా వర్కర్లు, 32,082 మంది అంగన్‌వాడీ వర్కర్లు కలిపి మొత్తంగా 95,500 మంది సిబ్బంది కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. 11న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం వరుసగా రెండ్రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి సూచించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment