
హరీష్
చెన్నై,తిరువొత్తియూరు: పోలియో చుక్కలు వికటించి కాట్టు మన్నార్ కోయిల్‌లో ఏడాది వయసున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు.. కడలూరు జిల్లా కాట్టు మన్నార్ కోయిల్, టీ నెడుంజేరి పుత్తూరు సమీపంలోని పణ్ణపట్టు గ్రామానికి చెందిన అలెగ్జాండర్, జయలక్ష్మీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు హరీష్ ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం హరీష్‌కు అదే ప్రాంతంలోని అంగన్ వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేశారు. ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సమాయానికే స్ఫృహ తప్పింది. వెంటనే బిడ్డను చిదంబరం కామరాజర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన తరువాత వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరీష్ మరణించాడు. కాలం చెల్లిన పోలియో చుక్కలు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment