Baby boy died
-
Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు
శంషాబాద్: హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు. -
చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
సాక్షి, వరంగల్: పది నెలల తమ కుమారుడు ఏడుస్తున్నాడని కొబ్బరి ముక్క చేతిలో పెట్టాడు తండ్రి.. కానీ, ఆ కొబ్బరి ముక్క.. ఆ బుడిబుడి మాటల బాలుడి ప్రాణాలు తీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు శివారు వెంకటతండా జీపి పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండా వాసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దరావత్ కవిత–మాలు దంపతులు. మాలు అయ్యప్ప స్వామి మాలధారణ చేశాడు. కాగా, అయ్యప్ప పూజ కార్యక్రమంలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా.. తమ కుమారుడు మణికంఠ(10నెలలు) ఏడుస్తుండడంతో కొబ్బరిముక్క ఇచ్చారు. కొబ్బరిముక్క బాబు గొంతులో ఇరుక్కొపొయి నోటి నుంచి నురుగు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెక్కొండకు తీసుకువస్తున్న క్రమంలో ఊపిరిఆడక బాలుడు మృతి చెందాడు. చదవండి: నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు.. -
నా భార్య.. బిడ్డ కావాలంటోంది
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ‘‘నా భార్య బిడ్డ కావాలంటొంది.. మాకు ఏడేళ్ల తర్వాత బిడ్డ పుడుతుందనుకుంటే కడుపులోనే చంపేసి చేతికిచ్చారు’’ అని బుధవారం కామారెడ్డి ఆస్పత్రిలో మృతి చెందిన శిశువు తండ్రి రమేష్ వైద్యులు, పోలీసులు ఎదుట వాపోయాడు. ఆస్పత్రిలో బుధవారం రాత్రి శిశువు మృతి చెందిన సంఘటనలో గురువారం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ప్రసవం గది ముందు ఆందోళన చేశారు. అక్కడే నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి బయట ధర్నా చేశారు. పోలీసులు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. గైనిక్ వైద్యురాలు పట్టించుకోకపోవడం, నర్సులు నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంవో కాళ్లు మొక్కి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చదవండి: శుభకార్యానికి వచ్చి .. భర్తకు పూటుగా మద్యం తాగించి.. ఆతర్వాత -
గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని చిన్నారి మృతి
పావగడ: గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య (9 నెలలు) సంతానం. ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... కుమారుడు సత్య ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ బ్యాంక్ మేనేజర్ -
విషాదం: మిస్టరీగా నెలల బాలుడి మృతి
శాలిగౌరారం (నకిరేకల్) : నెలల బాలుడి మృతి మిస్టరీగా మారింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి యల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె సంతోష(26)ను మండలంలోని వల్లాలకు చెందిన ఆడెపు యాదగిరికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(10 నెలలు) ఉన్నారు. ఏడాది కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత జనవరి 23న ఆకారంలోని తన తల్లిగారింటికి వచ్చిన సంతోష ఈనెల 3న కుమారుడితో ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. సఖ్యతగా మెలుగుతున్న వ్యక్తితో వెళ్లి.. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బాలకిషన్ అత్తగారు గ్రామం ఆకారం. సంతోష పుట్టిల్లు, బాలకిషన్ అత్తగారి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఈనెల 3న ఇంటినుంచి వెళ్లి కోదాడలో కాపురం పెట్టారు. అయితే, అనుకోకుండా మంగళవారం సంతోష కుమారుడికి ఫిట్స్ వచ్చాయి. వెంటనే వారు కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. గ్రామంలో ఉద్రిక్తత బాలుడి మృతదేహంతో సంతోష కారులో బుధవా రం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంది. పుట్టింటికి కాకుండా సమీప బంధువు ఇంటికి వెళ్లి విషయాన్ని వివరించింది. బాలుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న యాదగిరి (బాలుడితండ్రి) కుటింబికులు వల్లాలకు చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారం గ్రామానికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బాలుడిని సంతోష, బాలకిషన్‌లు తలపై కొట్టి హత్య చేసి ఉంటారని తండ్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలుడి మృతదేహాన్ని వల్లాల తీసుకెళ్లేందుకు తండ్రి యాదగిరి కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నచ్చజెప్పి బాలుడి మృతదేహానికి నకిరేకల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బా లుడి మృతదేహంపై అంతర్గతంగా , బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేనట్లు వైద్య నివేదికలో వెల్లడైనట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తల్లి సంతోషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, సంతోష తండ్రి యల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో.. -
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
-
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. (రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..) నిర్లక్ష్యం ఖరీదు ఓ పసి బాలిక మృతి.. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మిల్లత్ నగర్ వద్ద ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల మరుయం అనే బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
బజ్జీల నూనె పడి చిన్నారి మృతి
కుల్కచర్ల: ఇంట్లో బజ్జీలు వేసుకున్న తర్వాత సలసల కాగే నూనె పడడంతో ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్యాల నర్సింలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామంలో చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో దంపతులు బజ్జీలు వేసుకున్నారు. అవి పూర్తయిన తరువాత స్టౌవ్ బంద్ చేసి నూనెను కిందికి దింపకుండా అలాగే ఉంచారు. అనంతరం వారు పని మీద బయటకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు హార్దిక్ (4) బజ్జీల కోసం నూనె వద్దకు వెళ్లాడు. కడాయిని పట్టుకునేందుకు యత్నించగా బాలుడి మీద పడింది. బాగా వేడిగా ఉన్న నూనె పడడంతో బాలుడు విలవిల్లాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించారు. -
స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి
పశ్చిమగోదావరి,టి.నరసాపురం: ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గండిగూడెంలో శుక్రవారం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యానికి తమబిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గండిగూడేనికి చెందిన కొక్కొండ కృష్ణమాచారి ఐదేళ్ల కుమారుడు కొక్కొండ పార్థ వీర ఉమాశంకర్ (5) ఈ సంఘటనలో మృతిచెందాడు. బొర్రంపాలెం జీఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన స్కూల్‌బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ గమనించకపోవడంతో రోడ్డుపక్కన ఉన్న బాలుడు బస్సు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి కృష్ణమాచారి ఫిర్యాదుతో హెచ్‌సీ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలియో చుక్కలు వికటించి బాలుడి మృతి
చెన్నై,తిరువొత్తియూరు: పోలియో చుక్కలు వికటించి కాట్టు మన్నార్ కోయిల్‌లో ఏడాది వయసున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు.. కడలూరు జిల్లా కాట్టు మన్నార్ కోయిల్, టీ నెడుంజేరి పుత్తూరు సమీపంలోని పణ్ణపట్టు గ్రామానికి చెందిన అలెగ్జాండర్, జయలక్ష్మీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు హరీష్ ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం హరీష్‌కు అదే ప్రాంతంలోని అంగన్ వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేశారు. ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సమాయానికే స్ఫృహ తప్పింది. వెంటనే బిడ్డను చిదంబరం కామరాజర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన తరువాత వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరీష్ మరణించాడు. కాలం చెల్లిన పోలియో చుక్కలు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. -
మాంజా పంజా
సాక్షి, చెన్నై : రాజధాని నగరంలో ‘మాంజా’దారం పంజా విసిరింది. ఎక్కడి నుంచో గాలి పటం ద్వారా వచ్చిన ఆ దారం ఓ బాలుడి గొంతు కోసింది. తల్లిదండ్రులతో ఆనందంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న మూడేళ్ల ఆ బాలుడు సంఘటనా స్థలంలోనే విగత జీవి అయ్యాడు. కళ్లెదుటే ఒక్కగానొక బిడ్డను మాంజా బలికొనడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. ఇక, ఏదేని ఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామని మరో మారు పోలీసులు, అధికారులు నిరూపించుకున్నారు. గాలి పటాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. గాలి పటాలు ఎగర వేయడం అంటే అందరికీ సరదా. కొన్ని సార్లు ఈ సరదా ప్రాణాలును బలితీసుకుంటోంది. గాజు పెంకులను పొడి చేసి, వాటిని జిగురు(గమ్)లో కలిపి, దారానికి పూసి ఎండ బెట్టి మరీ విక్రయిస్తున్నారు. వీటి వల్ల ఆస్పత్రి పాలయ్యే వాళ్లు ఎక్కువే. 2006లో ఈ మాంజా రూపంలో తొలి మరణం చోటు చేసుకోవడం, ఆ తదుపరి క్రమంగా మరణాల సంఖ్య పెరగడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. మాంజా దారాలను నిషేధించాల్సిందేని కోర్టు ఆదేశించినా, అమలు పరిచే వారు లేకపోయారు. దీంతో చాప కింద నీరులా మాంజా దారాల విక్రయాలు సాగుతూ వస్తున్నాయి. ఏదేనా సంఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామన్న చందంగా ప్రస్తుతం ఘటన చోటు చేసుకోవడంతో మాంజా దారాల విక్రయదారుల పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. చిన్నారిని మింగిన మాంజా రాజస్థాన్ నుంచి ఉద్యోగ నిమిత్తం చెన్నైకు వచ్చిన గోపాల్ కొండితోపులో భార్య సుమిత్ర, కుమారుడు అభినేష్(3)తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం బంధువుల ఇంటికి మోటారు సైకిల్ మీద బయలు దేరారు. తల్లిదండ్రులతో ఆనందంగా వెళ్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో మాంజా మృత్యు పంజాగా మారింది. కొరుక్కుపేట మీనాంబాల్‌నగర్ వంతెన మీద మోటారు సైకిల్ పయనిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన మాంజా దారం ఆ బాలుడి గొంతు కోసింది. క్షణాల్లో బాలుడు తూలి పడటంతో తండ్రి గోపాల్ అప్రమత్తమైన మోటారు సైకిల్‌ను పక్కగా ఆపేశాడు. ఏమి జరిగిందో అన్నది తెలియని పరిస్థితి. తనయుడి గొంతు తెగి రక్తం దారాల పారడంతో ఆందోళనకు లోనయ్యాడు. అక్కడున్న వాళ్లు సాయంతో, ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా, అప్పటికే బాలుడు మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. మూడేళ్ల బాలుడి బలితో మాంజాదారం నిషేధం పోలీసులకు గుర్తుకొచ్చినట్టుంది. ఎక్కడ కోర్టు చేత అక్షింతలు వేయించుకోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో పడ్డ పోలీసులు పరుగులు తీసే పనిలో పడ్డారు. 11 మంది పిల్లల బలి.. 2006 నుంచి ఇప్పటి వరకూ మాంజా దారం రూపంలో 11 మంది పిల్లలు బలి అయ్యారు. వీరిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో మోటార్ సైకిల్ మీద వెళ్లున్నప్పుడు గొంతు కోయబడి మరణించిన వారే. అభినేష్ మరణంతో రాజస్థానీయుల్లో ఆగ్రహం రేగింది. అర్థరాత్రి పోలీసు స్టేషన్‌ను ముట్టడించడంతో తొలుత మెతక వైఖరి అనుసరించినా, ఆర్కేనగర్ పోలీసులు సోమవారం ఉదయాన్నే మాంజా మీద కొరడా ఝుళిపించే విధంగా దూకుడు పెంచారు. కొరుక్కుపేట కామరాజర్ నగర్‌కు చెందిన నాగరాజ్, 15 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మాంజాను నిల్వ ఉంచిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంతో పాటుగా ఉత్తర చెన్నై పరిధిలోని అన్ని దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరైనా మంజా విక్రయించినా, వాటితో గాలిపటాలు ఎగరేసినా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
మెదక్, జహీరాబాద్ టౌన్: చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు, బీజేపీ నాయకులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. బాలుడికి వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌కు చెందిన విజయ్ (ఆటో డ్రైవర్) తన 11 నెల బాబు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ హనీఫ్ బాలుడికి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమించి కొద్ది సేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు, బీజేపీ నాయకులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. డాక్టర్ హనీఫ్ బాబుకు సరైన వైద్యం అందిచనందున మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో మతాలు, కులాల పరంగా వైద్యం సేవలు అందిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ ఉద్ధేశ పూర్వకంగా బాబుకు సరైన చికిత్స అందిచకపోవడంతో చనిపోయాడని బీజేపీ నాయకుడు పూల సంతోష్ ఆరోపించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కూడా లేవని, సీరియస్ పేషంట్లకు వైద్యం అందించకుండా హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారని వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ గణపతి జాదవ్, జహీరాబాద్ టౌన్ సీఐ. సైదేశ్వర్, ఎస్ఐ. వెంకటేశం ఆస్పత్రిని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఘటనపై డీఎస్పీ గణపతి జాదవ్ మాట్లాడుతూ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడం బాధకరమైన విషయమన్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు దర్యాప్తు చేస్తామన్నారు. ఇలా ఉండగా బాలుడికి వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని డాక్టర్ హనీఫ్ పేర్కొన్నారు. బాలుడు ఆస్పత్రికి వచ్చేసరికి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన సేవలను అందించామన్నారు. -
చిన్నారిని చంపేసిన కుక్కలు
కర్ణాటక, బొమ్మనహళ్లి : రాజదాని బెంగళూరులో ఎప్పుడు వీధి కుక్కలు విరుచుకుపడతాయో, ఎప్పుడు ప్రాణాలు తీస్తాయో చెప్పడం కష్టం. బెంగళూరు పాలికె నిర్లక్ష్యం వల్ల వీధి శునకాలు విచ్చలవిడిగా సంచరిస్తూ జనాన్ని కరుస్తున్నాయి. గతంలో ఎన్నో సార్లు వీధికుక్కలు దాడి చిన్నారులను గాయపరిచిన సంఘటనలు మరిచిపోక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు తన ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన నగరంలో చోటు చేసుకుంది. బిస్కెట్ కొందామని అంగడికి వెళ్లగా బాధిత బాలుడు గుల్బర్గా జిల్లాలోని సేడం తాలూకాకు చెందిన మల్లప్ప,అనిత దంపతుల కుమారుడు దుర్గేష్ (5)గా గుర్తించారు. పొట్టచేత పట్టుకొని జీవనం సాగించడానికి వచ్చిన ఈ దంపతులు బెంగళూరు ఉత్తరలోని సోలదేవనహళ్ళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అజ్జెగౌడన పాళ్యలో నివాసముంటున్నారు. దొరికిన కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. సోమవారం సాయంత్రం అంగట్లో బిస్కెట్లు కొనుక్కోవడానికి వెళ్లిన బాలుడు దుర్గేష్‌పైన వీధికుక్కలు పడి కరిచాయి. తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందడం జరిగింది. ప్రజల ఆగ్రహం ఈ ప్రాంతంలో చిన్నారుల పైన వీధి కుక్కలు దాడి చేయడం మూడోసారి అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపైన గ్రామానికి చెందిన అధికారులు కానీ, బీబీఎంపీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘోరాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. మరో ఘటనలో చిన్నారికి గాయాలు నగరంలోని ఎంజీ రోడ్డుకు సమీపంలో ఉన్న శాంతినగర నియోజకవర్గంలోని నీలసంద్ర వార్డులోని రోజ్‌గార్డెన్‌లో చిన్నారిపైన వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. చిన్నారి గట్టిగా అరువడంతో స్థానికులు గమనించి కుక్కలను పారదోలారు. దాంతో చిన్నారి పాప బతికి బయటపడింది. ఇప్పటికైనా నగరంలో వీధి కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు బలి
నెల్లూరు(బారకాసు): జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా కాన్పుచేసిన కొద్దిసేపటికే శిశువు (మగ) మృతిచెందింది. తమ బిడ్డ మృతికి కారణం ప్రభుత్వ వైద్యులేనని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రసూతి విభాగంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కొత్తూరు సమీపంలో ఉన్న శ్రీలంకకాలనీకి చెందిన రవికుమార్ తన భార్య సోనీని కాన్పుకోసం ఈనెల 14వ తేదీ సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేర్పించాడు. వైద్యులు ఆమెను పరీక్షించి సాధారణ కాన్పు చేస్తామని తెలియజేశారు. 16వ తేదీ అర్ధరాత్రి సోనీకి నొప్పులు అధికం కావడంతో కాన్పుకోసం ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని సాధారణ కాన్పు చేయడం కష్టతరమని ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తోందని డాక్టర్లు రవికుమార్‌తోపాటు కుటుంబసభ్యులకు తెలిపారు. వారు సమ్మతించడంతో డాక్టర్ సోనీకి సిజేరియన్ ద్వారా కాన్పు చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పిన వైద్యులు మరో అర్ధగంట తర్వాత మృతిచెందిందని బాధితులకు అప్పగించారు. రవికుమార్ కుటుంబసభ్యులు బాధపడుతూ శిశువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. రక్తం రావడంతో.. గురువారం ఉదయం శిశువుకు దహన సంస్కారాలు చేసే సమయంలో బిడ్డ తల నుంచి రక్తం కారుతుండడాన్ని గుర్తించారు. వెంటనే శిశువుకు చుట్టిన తెల్లగుడ్డ తీసి చూడగా తలకు కత్తిగాటు కనిపించింది. వెంటనే రవికుమార్ కుటుంబసభ్యులు, బంధువులు శిశువుని తీసుకుని దర్గామిట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతిచెందిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కి వెళ్లి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో శిశువు చనిపోయిందని ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రసూతి విభాగం వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. విచారణ జరిపిస్తామని తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కమిటీ వేశాం శిశువు మృతి ఘటనపై కలెక్టర్, డీఎంఈకి నివేదిక పంపించాం. విచారణ కమిటీ నియమించడం జరిగింది. రెండురోజుల్లో విచారణ నివేదికను తనకు అందజేయాలని ఆదేశించా. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ శ్రీనివాసరావు,సూపరింటెండెంట్ -
సూది మందు వికటించి చిన్నారి మృతి
కొల్చారం (మెదక్) : ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తేజ అనే ఏడు నెలల బాలుడికి రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక డాక్టర్(ఆర్ఎంపీ) వద్ద ఇంజక్షన్ చేయించారు. సూది వేసిన కొద్దిసేపటికే బాలుడు ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకొని మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు డాక్టర్‌పై దాడి చేశారు.