
ప్రతీకాత్మక చిత్రం
శంషాబాద్: హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.
బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment