పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి! | 1 child dies allegedly after getting polio drops in vizianagaram district | Sakshi
Sakshi News home page

పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి!

Published Sun, Jan 29 2017 4:15 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

1 child dies allegedly after getting polio drops in vizianagaram district

పూసపాటిరేగ(విజయనగరం జిల్లా): పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం వైద్యసిబ్బంది గ్రామంలో  పోలియో చుక్కలు వేస్తుండటంతో రౌతు గెట్లయ్య, రౌతు స్వాతి అనే దంపతులు కూడా తమ 5 నెలల చిన్నారికి వేయించారు. అనంతరం చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో సమీప పీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలియో చుక్కలు వికటించడం వల్లే మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అందరు పిల్లలకు వేసినట్లే వేశామని, చిన్నారికి బలవంతంగా పాలు పట్టడం వల్ల, పాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి ఊపిరాడక మృతిచెందినట్లు పోలియో చుక్కలు వేసిన సిబ్బంది చెబుతున్నారు. చిన్నారి గత రాత్రి నుంచి పాలు తాగడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement