
ఉదయం 10 గంటలకు విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు.
ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.comతో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు.