Tenth exam results
-
టెన్త్‌లో 86.60% పాస్.. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావులతో కలసి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని... 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయని.. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని వివరించారు. ఫెయిలైన వారు ఆందోళనకు గురికావొద్దని.. ఆత్మస్థైర్యంతో మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకోవాలన్నారు. 15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున స్టేట్ బ్యాంకు ద్వారా రుసుము చెల్లించాలని.. దరఖాస్తులను పోస్టు ద్వారా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సంబంధిత పాఠశాల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు పంపాలని చెప్పారు. దరఖాస్తు నమూనా bse.telangana.gov.in వెబ్సైట్లో లభిస్తుందని తెలిపారు. రీ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలో జరుగుతుందని, దీనికోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు అయితే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్స్ సబ్జెక్టుకు అదనంగా 20 నిమిషాలు సమయం ఉంటుందన్నారు. 2,793 స్కూళ్లలో అందరూ పాస్ పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ పాస్ పదో తరగతి పరీక్షల్లో మాధ్యమం (మీడియం) వారీగా చూస్తే.. ఆంగ్ల మాధ్యమం వారిలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారిలో 90.50 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఉర్దూ మీడియంలో 73.45, తెలుగు మీడియంలో 72.58 శాతం పాస్ అయ్యారు. ఇక ప్రధాన సబ్జెక్టుల్లో సాంఘిక శాస్త్రంలో, భాషా సబ్జెక్టుల్లో హిందీ (సెకండ్ లాంగ్వేజ్)లో ఎక్కువ శాతం పాస్ అయ్యారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ 90శాతంపైనే ఉత్తీర్ణత కనిపించింది. -
AP SSC Results 2023: నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది..బాలురు 3,09,245 మంది ఉన్నారు. https://www.sakshieducation.comలో ఫలితాలను చూడవచ్చు. -
పది ఫలితాలపై విమర్శలు సరికాదు
సాక్షి, అమరావతి: పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ వ్యవహారం బయటకు వచ్చాక ఫలితాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కఠినంగా పరీక్షలు నిర్వహించడం కూడా ఎక్కువ మంది పాస్ కాకపోవడానికి కారణమని చెప్పారు. అలాగే కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ తీసేయడం కూడా ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఒక కారణమన్నారు. ఈ మేరకు సజ్జల గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పదో తరగతి ఫలితాలపై కోవిడ్ కూడా ప్రభావం చూపించిందని తెలిపారు. నారాయణ, చైతన్య వంటివి గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడంతోపాటు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డాయన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పైగా ఉత్తీర్ణత ఉండేదని చెప్పారు. తాము పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరీక్షలు జరిపామా? లేదా అనేదే ముఖ్యమన్నారు. కోవిడ్‌తో రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడంతో విద్యార్థుల్లో స్ఫూర్తి తగ్గి ఉండొచ్చన్నారు. ఇంగ్లిష్ మీడియం వల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని చెప్పారు. పది ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యశ్రీ బలోపేతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యల్లో డొల్లతనం బయటపడిందని సజ్జల అన్నారు. పథకాల్లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత అనేది చూడాలని హితవు పలికారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ అనేది ఇప్పుడొచ్చిందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మందికి ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారన్నారు. బీజేపీ వస్తుందో, లేదో కానీ టీడీపీతో వెళ్లడం ఖాయమని పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోందని సజ్జల అన్నారు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. తమకు పొత్తులపైన విశ్వాసం లేదని.. ప్రజలపైనే నమ్మకమని తేల్చిచెప్పారు. -
టెన్త్‌కు కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: వరుస వేవ్‌లతో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విద్యారంగాన్నీ వదల్లేదు. కోవిడ్ ప్రభావంతో వరుసగా రెండేళ్ల పాటు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొనగా తాజాగా వెలువడ్డ 2022 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురపై బాలికలు పైచేయి సాధించారు. పరీక్షలకు 6,20,788 మంది నమోదు చేసుకోగా 6,15,908 (99.21 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,16,820 మంది బాలురకు గాను 2,02,821 (64.02 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,99,088 మంది హాజరు కాగా 2,11,460 (70.70 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురకన్నా బాలికలు 6.68% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రకాశం ఫస్ట్.. చివరిలో ‘అనంత’ ► 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ► 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. వీటిల్లో 31 ప్రైవేట్ స్కూళ్లు కాగా 18 ఎయిడెడ్ స్కూళ్లున్నాయి. ► ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా అనంతపురం జిల్లా 49.70 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ► ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్లు 91.10 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు 50.10 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేశాయి. లాంగ్వేజెస్‌లో అధిక ఉత్తీర్ణత ఈసారి లాంగ్వేజెస్‌లలో ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మేథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 5,64,294 (91.73 శాతం) మంది, సెకండ్ లాంగ్వేజ్‌లో 5,95,801 (97.03 శాతం) మంది, థర్డ్ లాంగ్వేజ్‌లో 6,01,644 (97.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మేథమెటిక్స్‌లో 4,93,839 (80.26 శాతం) మంది, జనరల్ సైన్సులో 5,05,719 (82.18 శాతం) మంది, సోషల్ స్టడీస్‌లో 5,00,975 (81.43 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమం విద్యార్ధుల ఆధిక్యం టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం కన్నా ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 43.97 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఆంగ్ల మాధ్యమంలో 77.55 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అత్యధికులకు ఫస్ట్ డివిజన్ టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధికులు ఫస్ట్ డివిజన్లో నిలిచారు. 3,17,789 మంది ఫస్ట్ డివిజన్ సాధించగా 69,597 మంది సెకండ్ డివిజన్లో, 26,895 మంది థర్డ్ డివిజన్లో నిలిచారు. రెండేళ్లుగా చదువులపై ప్రభావం కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరుచుకోని పరిస్థితుల్లో 2020, 2021లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. మహమ్మారి వల్ల పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి. 2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.61 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండేళ్లుగా కరోనాతో పిల్లల చదువులు ముందుకు సాగకపోవడంతో ఆ ప్రభావం ఈసారి టెన్త్ పరీక్షలపై పడి 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,01,627 మంది ఫెయిలయ్యారు. -
ఆంధ్రప్రదేశ్: నేడు 'పది' ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఫలితాలను 'www.bse.ap.gov.in' తో పాటు 'sakshieducation.com' వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ‘మెమొరాండమ్ ఆఫ్ సబ్జెక్టు వైజ్ పెర్ఫార్మెన్స్’లను తమ పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డైరెక్టర్ సుబ్బారెడ్డి సూచించారు. డౌన్లోడ్ చేసిన కాపీలను అటెస్టెడ్ సంతకాలు చేసి విద్యార్థులకు ఇవ్వాలని పేర్కొన్నారు. 2020, 2021 రెండేళ్లు కూడా కరోనా వల్ల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే. 2020వ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు గతంలో ఆల్‌పాస్‌గా ప్రకటించి సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లలో గ్రేడ్లు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది విద్యార్థులకు కూడా.. 2021 విద్యార్థులకు మాదిరిగానే అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించాలని ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2020, 2021కి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు గ్రేడ్లు విడుదల చేయనుంది. ఎలా చూసుకోవాలంటే.. ► 2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు. ► 2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు. -
10-12 రోజుల్లో టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసె స్ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన ఉత్తర్వుల జారీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉత్తర్వు ల్లో ఉండాల్సిన మార్గదర్శకాలపై చర్చించింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఇవి వెలువడే అవకాశం ఉంది. వాటితోపాటు కోర్టులోనూ కేసు ఉన్నందున కోర్టుకు తెలియజేయాల్సిన అంశాలపైనా అడ్వొకేట్ జనరల్ (ఏజీ)తో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీలోని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పగా ప్రభుత్వం పరీక్షలనే రద్దు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు. పారదర్శకంగానే ఫలితాలు: మంత్రి సబిత పదో తరగతి ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను స్కూళ్ల యాజమాన్యాలు ఆన్లైన్లో పంపినందున ఆ మార్కులను ఎవరూ మార్చే ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. ఆన్లైన్లో అందిన మార్కులకు సైబర్ భద్రత ఉందని, తద్వారా ఫలితాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన వాస్తవ మార్కుల ఆధారంగా నే ఫలితాలు ఉంటాయని ఆమె వివరించారు. -
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా అందులో బాలికలు 95.09 శాతం మంది, బాలురు 94.68 శాతం మంది ఉన్నారు. గత ఏడాదికన్నా ఈసారి 0.40% ఉత్తీర్ణత పెరిగింది. మంగళవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,30,082 మంది పరీక్ష రాశారు. 2,816 మంది పరీక్షకు హాజరుకాలేదు. పరీక్ష రాసిన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,19,494 మంది, ప్రైవేటు విద్యార్థులు (ఒకసారి రాసి ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన వారు) 10,588 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 5,87,765 (94.88) మంది ఉత్తీర్ణులవ్వగా పరీక్ష రాసిన బాలురలో 94.68 శాతం (3,00,548) మంది, బాలికల్లో 95.09 శాతం (2,87,217) మంది పాస్ అయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో 6,228 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11,690 పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలకు విద్యార్థులు హాజరుకాగా వీటిలో 5,464 (46.74 శాతం) స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాసవ్వలేదు. వీటిలో రెండు ప్రైవేటు స్కూళ్లు, ఒకటి ఎయిడెడ్ స్కూల్ ఉంది. ఫలితాల్లో తెలుగు మాధ్యమ విద్యార్థుల కన్నా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 97.54 శాతం మంది, తెలుగు మాధ్యమ విద్యార్థులు 90.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తూర్పుగోదావరి ఫస్టు టెన్త్ ఫలితాల్లో ఈఏడాది 98.19 శాతంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు 87.16 శాతంతో ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచారు.10 జీపీఏలో కూడా తూర్పుగోదావరి జిల్లానే ముందువరసలో ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 5,456 మందికి 10 జీపీఏరాగా నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 1,271 మందికి 10 జీపీఏ లభించింది. కాగా, ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటుకే ఎక్కువగా 10 జీపీఏ పాయింట్లు అత్యధిక శాతం 10 జీపీఏ పాయింట్లను ప్రైవేటు పాఠశాలలే సాధించాయి. ఇంటర్నల్ మార్కులను ఇష్టానుసారం ప్రైవేటు పాఠశాలలు వేసుకుంటున్నాయని, అందుకే 10 జీపీఏ పాయింట్లు ఆ పాఠశాలలే సాధిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఫలితాల్లో అదే తీరు కనిపించింది. టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులు 33,972 ఉంటే.. ఇందులో 29,016 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. 10 జీపీఏ సాధించిన యాజమాన్యాలు, విద్యార్థుల వివరాలు.. సబ్జెక్టుల వారీగా ఏ1 గ్రేడ్లు సాధించిన విద్యార్థులు.. ఇంగ్లీషు: 2,04,746 సోషల్ స్టడీస్: 1,70,587 ఫస్టు లాంగ్వేజ్: 1,68,193 మేథమెటిక్స్: 1,41,417 సెకండ్ లాంగ్వేజ్: 1,03,086 జనరల్ సైన్సు: 90,025 జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీని జూన్ 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు జూన్ 6వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల మెమోలను రెండు రోజుల్లో ఠీఠీఠీ. bట్ఛ్చp. ౌటజ వెబ్సైట్లో పొందుపర్చనున్నామని వివరించారు. వీటి ఆధారంగా ఇంటర్మీడియెట్ కాలేజీల్లో చేరవచ్చని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు మే 30 రీకౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంధ్యారాణి తెలిపారు. ఫీజును సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా ధ్రువీకరణ సంతకం చేయించి హాల్ టికెట్ జిరాక్సు కాపీతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈనెల 30 లోగా సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాను www. bseap. org వెబ్సైట్ నుంచి, లేదా డీఈవో కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. రీవెరిఫికేషన్ కోరే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,000 చొప్పున చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్లో మార్కులను లెక్కించడం, అన్ని సమాధానాలకు మార్కులు ఇచ్చారా? లేదా? అన్న అంశాలను పరిశీలించడం, మూల్యాంకనం చేయని సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయించడం ఉంటుందన్నారు. ‘గురుకులాల్లో 95.40శాతం ఉత్తీర్ణత’ పదో తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 95.40శాతం ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి కల్నల్ వి.రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 గురుకుల పాఠశాలల్లో 13,064 మంది పరీక్షలకు హాజరు కాగా, 12,463 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. చిత్తూరు జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణత సాధించి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం 71 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని తెలిపారు. ఇక ఏపీటీవీఆర్ఐ సొసైటీకి చెందిన విద్యార్థులు 94.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 52 రెసిడెన్షియల్ స్కూళ్లలో 23 స్కూల్స్ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ఇంటర్నల్ మార్కులు రద్దు! రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ప్రశ్నపత్రం మోడల్లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచే నామినల్ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. జూన్ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు డీఎస్సీ నియామకాలను జూన్ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు. -
టెన్త్ పాసైన ఆనందంలో రోడ్డుపై కొస్తే...
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే, టెన్త్ ఫలితాలు ఓ కుటుంబంలో తీరని దుఃఖం నింపాయి. పాస్ అయిన ఆనందంలో కూల్‌డ్రింక్ కొనుక్కుందామని రోడ్డుపైకి వచ్చిన తిరుగుపల్లి రుక్మిణి (15) అనే విద్యార్థిని ప్రమాదానికి గురైంది. టాటాఏస్-మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తోడుగా వచ్చిన ఆమె చెల్లెలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి :ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల) ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లో చూసుకోవచ్చు... https://www.sakshieducation.com వీడియో: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల -
నేడు టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆయా పాఠశాల తమకు కేటాయించిన లాగిన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఏ.సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, జీపీఏల్లో బోర్డు ప్రకటించనుంది. టెన్త్ ఫలితాలు ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో కూడా అందుబాటులో ఉంటాయి. -
బీసీ గురుకులాలదే హవా
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ డంకా బజాయించింది. అత్యుత్తమ ఉత్తీర్ణతా శాతంతో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులాలకు పోటాపోటీగా ముందుకెళ్లిన విద్యా శాఖ గురుకులాలు 98.54 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆదర్శ పాఠశాలలు (98.45), సాంఘిక సంక్షేమ గురుకులాలు (96.56), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (95.07) ఉన్నాయి. గురుకుల పాఠశాలల కేటగిరీలో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ని మినహాయిస్తే మిగతా సొసైటీలన్నీ రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని (92.43) దాటడం గమనార్హం. పది పాయింట్లతో... గురుకుల పాఠశాలలు సాధించిన ఉత్తీర్ణత రికార్డు స్థాయిలో ఉండగా.. ఉత్తమమైన గ్రేడ్ పాయింట్లు సాధించిన పిల్లలు సైతం అధికంగానే ఉన్నారు. ఆదర్శ పాఠశాలల్లో 210 మంది, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 53 మంది, విద్యా శాఖ గురుకులాలకు చెందిన 20 మంది, బీసీ గురుకులాల్లో 13 మంది, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నూరు శాతం ఫలితాలు సాధించిన కేటగిరీలో 13 బీసీ గురుకులాలు, 58 ఎస్సీ గురుకులాలు, 15 గిరిజన సంక్షేమ గురుకులాలు, 185 కేజీబీవీలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. ఎస్సీ హాస్టళ్లలో వసతి పొందుతూ ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంత్రి, అధికారుల అభినందనలు.. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, బోధన, బోధనేతర సిబ్బందికి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. ప్రత్యేక తరగతులతోపాటు ట్యూటర్లను ఏర్పాటు చేసి అభ్యసనం చేయించడం, రాత్రి వేళ ప్రత్యేక డైట్/స్నాక్స్ ఇవ్వడంతో ఫలితాల శాతం గణనీయంగా పెరిగిందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరుతో పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసిన పిల్లలకు అభినందనలు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలతో ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చామని విద్యా శాఖ గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బీసీ గురుకులాలతో సమానంగా విద్యాశాఖ గురుకులాలు పోటీ పడ్డాయని స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ మరింత మెరుగైన పనితీరుతో అగ్రస్థానం కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. సర్కారీ సూళ్లది వెనుకబాటే.. పదో తరగతి ఫలితాల్లో సర్కారీ స్కూళ్లు వెనుకబడ్డాయి. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటంతోపాటు విద్యార్థుల సంఖ్య సైతం పెద్ద మొత్తంలో ఉంది. దీంతో ఫలితాల్లో కొంత వెనుకబాటు సహజమే అయినప్పటికీ.. రాష్ట్ర సగటుకు ఆమడ దూరంలో ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా పరిషత్ పాఠశాలలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా నమోదు కాలేదు. గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలు మాత్రం ఫలితాల్లో వెనుకబడ్డాయి. రాష్ట్ర సగటును అందుకోకపోగా 9 శాతానికిపైగా విద్యార్థులు ఫెయిలైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
4,374 పాఠశాలల్లో 100 % ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య ఈసారి రెట్టింపైంది. గతేడాది 2,125 పాఠశాలల్లోనే 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి అలాంటి పాఠశాలల సంఖ్య 4,374కు పెరిగింది. మరోవైపు సున్నా ఫలితాల పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలు 21 ఉంటే ఈసారి వాటి సంఖ్య 9కి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలుంటే అందులో 4,374 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఇక 100 శాతం ఫలితాలను సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. 2,279 ప్రైవేటు స్కూళ్లలో వంద శాతం.. ఇక పదో తరగతి ఫలితాల్లో 2,279 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. గతేడాది 1,225 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈసారి వాటి సంఖ్య పెరిగింది. గతేడాది 76 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వంద శాతం ఫలి తాలు రాగా, ఈసారి 185 కేజీబీవీల్లో 100% ఫలితాలు వచ్చాయి. అలాగే గతేడాది 35 మోడల్ స్కూళ్లలోనే వంద శాతం ఫలితాలు రాగా, ఈసారి వాటి సంఖ్య 97కు చేరింది. గతేడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా పరిషత్ పాఠశాలలు 686 ఉంటే ఈసారి వాటికి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. 1,580 జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్ల సంఖ్య ఈ సారి పెరిగింది. సున్నా ఫలితాలు 9 స్కూళ్ల లో వస్తే అందులో 5 ప్రైవేటు స్కూళ్లే ఉన్నాయి. -
పదో తరగతిలో 94.48% ఉత్తీర్ణత
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : ఇంటర్మీడియట్లో పైచేయి సాధించిన అమ్మాయిలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లోనూ అగ్రస్థానంలో నిలిచారు. బాలురకంటే తామే ముందున్నామని బాలికలు మరోసారి నిరూపించారు. 2018 పదో తరగతి పరీక్షా ఫలితాలను ఆదివారం సాయంత్రం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షలకు 6,13,378 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 94.48 శాతమైన 6,04,527 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇందులో 94.56 శాతం బాలికలు కాగా, 94.41 శాతం బాలురు. ఉత్తీర్ణతలో బాలురకంటే బాలికలు 0.15 శాతం ఆధిక్యం సాధించారన్నారు. అలాగే, ప్రైవేటుగా హాజరైన విద్యార్థులు 78.35 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 5,340 ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని.. సున్నా ఫలితాలు సాధించిన స్కూళ్లలో ప్రైవేట్‌వి 10, ఎయిడెడ్వి 2, జిల్లా పరిషత్ పాఠశాలలు 5 ఉన్నాయని వివరించారు. పాఠశాలల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని చూస్తే.. జిల్లా పరిషత్ పాఠశాలలు 92.57, ప్రభుత్వ పాఠశాలలు 90.77, ఏపీ మోడల్ స్కూళ్లు 97.38, మున్సిపల్ స్కూళ్లు 90.40 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వివరించారు. ‘ప్రకాశం’ టాప్.. నెల్లూరు లాస్ట్ రాష్ట్రంలోకెల్లా ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 80.37 శాతంతో నెల్లూరు జిల్లా ఆఖరి స్థానంలోనూ నిలిచాయని ‘గంటా’ వివరించారు. 2007లో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా మళ్లీ ఇప్పుడు ఆ స్థానం దక్కించుకుంది. సామాజికవర్గాల వారీగా చూస్తే.. ఓసీ విద్యార్థులు 96.77, ఎస్సీలు 91.12, ఎస్టీలు 91.47, బీసీలు 94.94 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ భాషలో అత్యధికంగా 99.98 శాతం, గణితంలో అత్యల్పంగా 96.45 శాతం మంది ఉత్తీర్ణత పొందారన్నారు. అలాగే, రాష్ట్రం మొత్తమ్మీద 29,921 మంది 10/10 జీపీఏ సాధించారని, వీరిలో అత్యధికులు (26,475 మంది) ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారేనని చెప్పారు. జూన్ 11 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. జూన్ 11 నుంచి 25 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి మే 30లోగా చెల్లించాలన్నారు. విద్యార్థులకు మార్కుల మెమోలను 15 రోజుల్లో పంపిస్తామని చెప్పారు. విద్యార్థులు మార్కులు తిరిగి లెక్కింపు కోరుకుంటే రూ.500 చెల్లించి మే 14 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సబ్జెక్టుల సమాధాన పత్రాల పునఃపరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో వికేంద్రీకరించినట్టు తెలిపారు. ఇలాంటి వారు మే 14లోగా తమ దరఖాస్తులు పంపుకోవాలన్నారు. ‘ప్రైవేటు’ ఫలితాలపై విచారణ 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి పాఠశాలలపై విచారణ జరిపిస్తామని ఆయన బదులిచ్చారు. అలాగే, ఈ ఏడాది వేసవి సెలవులు ముగియడానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమంలోనే అధిక ఉత్తీర్ణత టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులకన్నా ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 97.32 శాతం మంది ఉత్తీర్ణులు కాగా తెలుగు మాధ్యమంలో 90.12 శాతం మంది మాత్రమే పాసయ్యారు. -
టెన్త్ ఫలితాల్లో.. స్కూళ్ల హవా !
సగానికి తగ్గిన ‘వంద శాతం’ స్కూళ్లు సాక్షి, హైదరాబాద్: వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు సగానికి పడిపోయింది. గతేడాది తెలంగాణలోని 2,434 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 1,491 పాఠశాలలు మాత్రమే ఈ ఫలితాలను సాధించాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో అత్యధికంగా (944) ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో జిల్లా పరిషత్తు పాఠశాలలు (385) నిలిచాయి. మరోవైపు గతేడాది 27 పాఠశాలల్లో సున్నా ఫలితలు రాగా ఈసారి 28 పాఠశాలల్లో ఈ ఫలితాలు వచ్చాయి. రవీంద్రభారతికి తిరుగులేని ఆధిక్యం సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో రవీంద్రభారతి స్కూల్ హవా కొనసాగింది. తన రికార్డులను తానే తిరగరాస్తూ తనకు తానే సాటిగా నిరూపించుకుంది. ఈసారి ఫలితాల్లో 606 మంది విద్యార్థులకు అన్ని సబ్టెక్టుల్లోనూ 10కి 10 గ్రేడ్ పాయింట్లు లభించాయి. అలాగే 2244 మంది ఏ1, ఏ2 గ్రేడ్లు సాధించారు. కేవలం పదిలోనే కాకుండా రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధిస్తూ రవీంద్రభారతి అగ్రగామిగా నిలుస్తోందని విద్యాసంస్థల చైర్మన్ ఎం.ఎస్.మణి పేర్కొన్నారు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్స్ జైత్రయాత్ర సాక్షి, హైదరాబాద్: పది ఫలితాల్లో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్స్ అత్యుత్తమ ఫలితాలు సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 12 ఏళ్లుగా రాష్ర్ట స్థాయి ర్యాంకులు సాధిస్తూ వస్తున్న బ్రిలియంట్ విద్యార్థులు ఇప్పుడు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈసారి పరీక్షలకు 2533 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 98 శాతం మంది ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. 27 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 85 శాతం మంది విద్యార్థులు 10/9 జీపీఏను పొంది బ్రిలియంట్ విద్యాసంస్థలను రాష్ర్టంలో అగ్రగామిగా నిలబెట్టారు. విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని విద్యాసంస్థల చైర్మన్ కె. నారాయణరెడ్డి తెలిపారు. దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్స్ ఘన విజయం సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. సంస్థకున్న ఐదు బ్రాంచీల నుంచి 1080 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజర వగా 97.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 20 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించింది. వీరికి రుద్రా మెమోరియల్ మెరిట్ అవార్డు పేరిట రూ. 20 వేల నగదు బహుమతి అందించనున్నట్లు దిల్సుఖ్నగర్ విద్యాసంస్థల చైర్మన్ ఏవీఎన్ రెడ్డి తెలిపారు. నంబర్ వన్ త్రివేణి సాక్షి, హైదరాబాద్: పదో తర గతి ఫలితాల్లో త్రివేణి టాలెంట్ స్కూల్స్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. త్రివేణి విద్యా సంస్థల్లోని 20 మంది విద్యార్థులు ఏకంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 61 మంది విద్యార్థులకు 9.8 పాయింట్లకుపైగా, 115 మందికి 9.7 పాయింట్లకుపైగా, 173 మందికి 9.5 పాయింట్లకుపైగా, 243 మందికి 9.3 పాయింట్లకుపైగా, 339 మందికి 9.2 పాయింట్లకుపైగా, 455 మందికి 9.0 పాయింట్లకుపైగా, 1072 మందికి 8 పాయింట్లకుపైగా సాధించినట్లు విద్యా సంస్థల డెరైక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 1563 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్ సాధించి రాష్ర్టంలోనే ఎదురులేకుండా నిలిచారని చెప్పారు. డాక్టర్ కేకేఆర్ విద్యార్థుల ప్రభంజనం సాక్షి, హైదరాబాద్: పది ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాసంస్థలకు చెందిన కుషాయిగూడ బ్రాంచిలో 13 మందికి 10/10 గ్రేడ్ పాయింట్లు, కూకట్పల్లి బ్రాంచిలో ఆరుగురికి, దిల్సుఖ్నగర్ బ్రాంచిలో ఇద్దరికి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) బ్రాంచిలో ఇద్దరికి కూడా 10కి 10 పాయింట్లు వచ్చాయి. డాక్టర్ కేకేఆర్ విద్యా సంస్థల్లోని 50 శాతానికిపైగా విద్యార్థులు 9.8 గ్రేడ్ పాయింట్లు పొంది తమ ప్రతిభను కనబరిచారు. తమ మొత్తం సరాసరి 8.9గా నమోదైందని డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కె.కోటేశ్వరరావు తెలిపారు. శ్రీచైతన్య స్కూల్ ఆల్‌టైమ్ రికార్డ్ సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ రికార్డు సృష్టించింది. రాష్ర్టంలోనే అత్యధికంగా 158 మంది విద్యార్థులు జీపీఏ 10కి 10 సాధించారు. 448 మందికి 9.8 ఆపైన, 1297 మంది విద్యార్థులకు 9.5కిపైగా గ్రేడ్ పాయింట్లు లభించాయి. అంతేకాకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ రాష్ర్టంలోనే అత్యధిక మంది విద్యార్థులకు ఏ1, ఏ2 గ్రేడ్లు సాధించి శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు అకడమిక్ డెరైక్టర్ సీమ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ టెక్నో సిలబస్, టార్గెట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ వల్లే ఇంతటి అద్భుత విజయం సాధించినట్లు పేర్కొన్నారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ హవా సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 23 మంది విద్యార్థులు 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఎం.ఎం. షరీఫ్, రాజు అభినందనలు తెలిపారు. భాష్యం ధూమ్ ధామ్ సాక్షి, హైదరాబాద్: ఎస్ఎస్సీ-2015 ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ర్టంలోనే అత్యధికంగా ఒక్క హైదరాబాద్ నుంచే భాష్యం విద్యార్థులు 51 మంది 10/10 జీపీఏ సాధించి అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశారు. రాష్ర్టంలో విడుదలైన తొలి ఎస్ఎస్సీ ఫలితాల్లో భాష్యం చరిత్ర సృష్టించిందని విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. నారాయణ స్కూల్స్ విజయకేతనం సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 10కి 10 జీపీఏ సాధనలో రెండేళ్లుగా 400శాతం వృద్ధితో నారాయణ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈసారి రాష్ర్టవ్యాప్తంగా 11 నారాయణ స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎండీ పి.సింధూర నారాయణ తెలిపారు. 112 మందికి 10కి 10 గ్రేడ్ పాయింట్లు, 301 మందికి 9.8కిపైగా జీపీఏ వచ్చినట్లు చెప్పారు. సత్తా చాటిన ‘ఎస్ఆర్’ 10/10 గ్రేడ్ సాధించిన 26 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా: పదో తరగతి వార్షిక ఫలితాల్లో వరంగల్, హన్మకొండలోని ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి వెల్లడించారు. హన్మకొండ పద్మాక్షికాలనీలోని ఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పాఠశాల నుంచి 26 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు, 76 మంది 9.8 పాయింట్లు, 72 మంది 9.7 పాయింట్లు, 112 మంది విద్యార్థులు 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించారని వివరించారు. -
విద్యార్థుల ‘లెక్క’ తప్పింది
సాక్షి, హైదరాబాద్: పదో పరీక్షల్లో గణితంలో విద్యార్థుల లెక్క తప్పింది. 99,871 మంది విద్యార్థులు ఒక్క గణితంలో ఫెయిల్ అయ్యారు. 57,947 మంది సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ప్రథమ భాషలో 33,987 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. -
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో..
శ్రీచైతన్య స్కూల్ టెక్నో విద్యార్థుల జయభేరి హైదరాబాద్: సీబీఎస్ఈ-2014 పదోతరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ విద్యార్థులు జయభేరి మోగించినట్టు అకడమిక్ డెరైక్టర్ సీమ ఓ ప్రకటనలో తెలిపారు. 253 మంది సంస్థ విద్యార్థులు సీజీపీఏ 10కి 10 పాయింట్లు సాధించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా సీబీఎస్ఈ బ్రాంచీల్లో సగటున 25 శాతం విద్యార్థులకు జీపీఏ 10కి 10 పాయింట్లు, 100 శాతం పాస్ పర్సంటేజ్ సాధించి దేశంలో నంబర్ 1 పాఠశాలగా నిలిచినట్టు తెలిపారు. కోర్ సబ్జెక్టులతో పాటు భాషల్లో కూడా తామందిస్తున్న పటిష్ట ఫౌండేషన్, పరిశోధనాత్మక కార్యక్రమాలు, ఒత్తిడిలేని బోధనా పద్ధతుల కారణంగానే తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ బీఎస్ రావు అభినందించినట్టు తెలిపారు.