శ్రీచైతన్య స్కూల్ టెక్నో విద్యార్థుల జయభేరి
హైదరాబాద్: సీబీఎస్‌ఈ-2014 పదోతరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ విద్యార్థులు జయభేరి మోగించినట్టు అకడమిక్ డెరైక్టర్ సీమ ఓ ప్రకటనలో తెలిపారు. 253 మంది సంస్థ విద్యార్థులు సీజీపీఏ 10కి 10 పాయింట్లు సాధించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా సీబీఎస్‌ఈ బ్రాంచీల్లో సగటున 25 శాతం విద్యార్థులకు జీపీఏ 10కి 10 పాయింట్లు, 100 శాతం పాస్ పర్సంటేజ్ సాధించి దేశంలో నంబర్ 1 పాఠశాలగా నిలిచినట్టు తెలిపారు. కోర్ సబ్జెక్టులతో పాటు భాషల్లో కూడా తామందిస్తున్న పటిష్ట ఫౌండేషన్, పరిశోధనాత్మక కార్యక్రమాలు, ఒత్తిడిలేని బోధనా పద్ధతుల కారణంగానే తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ బీఎస్ రావు అభినందించినట్టు తెలిపారు.
సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో..
Published Thu, May 22 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement