
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆయా పాఠశాల తమకు కేటాయించిన లాగిన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఏ.సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, జీపీఏల్లో బోర్డు ప్రకటించనుంది. టెన్త్ ఫలితాలు ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో కూడా అందుబాటులో ఉంటాయి.